E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ రూంలోకి వెళ్లిన జ్యోత్స్న షాక్ అవ్వడానికి కారణం ఏంటి..? 

Karthika Deepam 2 Serial Today Episode October 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ రూంలోకి వెళ్లిన జ్యోత్స్న షాక్ అవ్వడానికి కారణం ఏంటి..? 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌ చెప్పినట్టుగానే తన వారం షెడ్యూల్‌ ఫైల్‌ చేసి మాలిని ఇంటికి తీసుకెళ్తుంది జ్యోత్స్న. దక్షిణమూర్తి ఇంట్లో మాలిని, సూరజ్‌, దక్షిణమూర్తి టిఫిన్‌ చేస్తుంటారు. సూరజ్‌ దోశ వేసుకుంటుంటే చేయి పట్టుకుంటుంది జ్యోత్స్న. జ్యోత్స్నను చూసిన మాలిని, సూరజ్ షాక్‌ అవుతారు. జ్యోత్స్న మాత్రం సారీ సార్‌ మీరు చెప్పినట్ట టైంకు పది నిమిషాలు లేట్‌ అయింది. ఇందిగోండి మీ వారం షెడ్యూల్‌ అని ఫైల్‌ తీసి సూరజ్‌ చేతిలో పెడుతుంది. తన మాటలతో సూరజ్‌, మాలినికి కోపం వచ్చేలా చేస్తుంది. కానీ అక్కడ దక్షిణమూర్తి ఉన్నాడని మాలిని, సూరజ్‌ సైలెంట్‌గా ఉంటారు.

ఫైల్‌ ఇచ్చావు కదా ఇక వెళ్లు ఇంకా ఎందుకు ఏదేదో వాగుతున్నావు అంటూ సూరజ్ అంటే జ్యోత్స్న వెళ్లిపోతుంటే.. టిఫిన్‌ చేసి వెళ్లమని దక్షిణమూర్తి అడుగుతాడు. మా సార్‌ ఏమంటాడో తాత అని సూరజ్ ను చూస్తుంది జ్యోత్స్న. అందుకు సూరజ్‌ తిండి దగ్గర కూడా రిస్టిక్షన్స్‌ పెట్టేంత మూర్ఖులం కాదు మేము అంటాడు సూరజ్‌. అందుకు జ్యోత్స్న లవ్యూ సార్‌ అంటూ టిఫిన్‌ తినబోతుంది. మాలిని, సూరజ్‌ షాకింగ్‌ గా చూస్తుంటారు. అంతే ఈ మధ్య థాంక్స్‌కు బదులు లవ్యూ చెప్పడం ట్రెండ్‌ కదా అంటుంది జ్యోత్స్న. అందరూ టిఫిన్‌ చేశాక జ్యోత్స్న ఆఫీసుకు వెళ్తుంటే.. దక్షిణమూర్తి ఆపేసి సూరజ్‌ వస్తాడు ముగ్గురం కలిసి వెళ్దామని చెప్తాడు. సూరజ్‌ లోపలికి వెళ్లిపోతాడు.

Advertisement

దక్షిణమూర్తి, జ్యోత్స్న హాల్లో కూర్చుని మాట్లాడుకుంటారు. పీఏ అంటే ఏంటని దక్షిణమూర్తి అడిగితే.. జ్యోత్స్న సిగ్గు పడుతూ ఎవ్వరికీ చెప్పకు తాత అంటూ మెల్లగా పర్సనల్‌ అసిస్టెంట్‌ అంటుంది. నీకు సూరజ్‌ అంటే ఇష్టం కదా అని దక్షిణమూర్తి అడిగితే.. జ్యోత్స్న మౌనంగా ఉంటుంది. తనకు అర్థం అయిందని వాడు కూడా మనసులో నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయటకు చెప్పడం లేదు.. అంటుంటే.. సూరజ్‌ ఫోన్‌కు కాల్‌ వస్తుంది. అది చూసిన దక్షిణమూర్తి ఈ ఫోన్‌ వాడికి ఇవ్వమ్మా అని జ్యోత్స్నకు చెబితే.. జ్యోత్స్న ఫోన్‌ తీసుకుని సూరజ్‌ రూంలోకి వెళ్తుంది. సూరజ్‌ పర్సులో తన ఫోటో ఉందేమోనని వెతుకుతుంది. పర్సులో ఫోటో లేకపోవడంతో రూంలో వెతుకుతుంది. ఫిల్లో కింద జ్యోత్స్న ఫోటో ఉంటుంది.

అప్పుడే సూరజ్‌ వచ్చి తిడతాడు. ఫోటో లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఇవ్వకుండా నా ఫోటో నీ దగ్గర ఎందుకు ఉంది అంటూ ప్రశ్నిస్తుంది. అది నా ఇష్టం అయినా నీతో వాదించడం కాదు ముందు ఫోటో ఇటివ్వు అంటూ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు సూరజ్‌. జ్యోత్స్న తప్పించుకుంటుంది. అప్పుడే జ్యోత్స్నకు కోపం తెప్పించేలా కార్తీక్‌ను జ్యోత్స్న ప్రేమించిందన్న విషయం గుర్తు చేస్తాడు. అది ప్రేమ కాదు నీకు నా మీద ఉన్నది ప్రేమ అది నేను గమనించాను అంటూ కోపంగా చూసే నీ మనసు వెనక ఓ కన్నీటి సముద్రం ఉంది.. దాని ఘోష నేను విన్నాను. ఎవరికో ఇచ్చిన మాట కోసం మనసు ఇచ్చిన వ్యక్తిని వదిలేసిన పోతున్న నీ పంతం వెనక ప్రేమని చూశాను.. నచ్చిన మనిషి కళ్లముందు కష్టపడకూడదు అని రిజెక్ట్ చేసిన నీ తిరస్కారం వెనక నీ అంతర్మథనం చూశాను అంటూ చెప్పి జ్యోత్స్న వెళ్లిపోతుంటే.. సూరజ్‌ తదేకంగా చూస్తుంటాడు.

Advertisement

జ్యోత్స్న రెస్టారెంట్‌కు శివనారాయణ ఫ్రెండ్స్ వెళ్తారు. శివనారాయణ కోసం వెతికితే సూరజ్‌ వచ్చి తానే చైర్మన్‌ అని చెప్తాడు. అక్కడే ఉన్న జ్యోత్స్నను చూసి ఓ కట్నం కింద కంపెనీ తీసుకున్నావా..? శివనారాయణ నిజంగా గొప్పోడు అంటూ తెగ పొగిడేస్తుంటారు. ఆ మాటలు విని మాలిని ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Meenaakshi : మీనాక్షి ఒక్కరోజు రెమ్యూనరేషన్ అంతా..?

Ye Devi Varamo Neevu: అంజలి నెలకు అంత సంపాదిస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..

Podarillu Today Episode : కన్నాపై మహా సీరియస్.. పాపం మనీష.. నిజం తెలిసిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లికి విడాకులు..?

Brahmamudi Serial Today Episode October 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజుల పెళ్లికి లక్కీ స్కెచ్ వేశాడా..?  

సీరియల్ హీరోయిన్లకు డిమాండ్ ఎందుకు ఎక్కువ..? ఇదే నిజమా..?

Big Stories

Advertisement
×