E-Paper
Advertisement

మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఫొటో, గేమింగ్ యాప్స్ లొకేషన్ ఎందుకు అడుగుతాయి?

మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఫొటో, గేమింగ్ యాప్స్ లొకేషన్ ఎందుకు అడుగుతాయి?
Advertisement

Location Tracking: సాధారణంగా మన ఫోన్‌లో ఏదైనా కొత్త యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు.. అది ఓపెన్ చేయగానే అడిగే పర్మిషన్స్ గురించి పెద్దగా ఆలోచించకుండా వెంటనే Allow బటన్‌పై క్లిక్ చేసేస్తుంటాం. గూగుల్ మ్యాప్స్ వంటి యాప్స్‌కు లొకేషన్ అవసరమని అర్థం చేసుకోవచ్చు. కానీ, ఫొటో ఎడిటింగ్ యాప్స్, కొన్ని గేమింగ్ యాప్స్‌కు మన లొకేషన్‌తో ఏం పని? అయినా సరే.. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా లొకేషన్ యాక్సెస్ ఇచ్చేస్తుంటారు.

దీంతో కొన్ని యాప్స్ మన లొకేషన్ సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, ఎప్పుడో పర్మిషన్ ఇచ్చి వదిలేసిన యాప్స్‌కు ఇప్పటికీ లొకేషన్ యాక్సెస్ ఉందనే విషయాన్ని చాలామంది గుర్తించరు. అయితే, ఇలాంటి యాప్స్‌ను ఫోన్ నుంచి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా వాటికి లొకేషన్ యాక్సెస్‌ను నిలిపివేయవచ్చు. మరి, ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో ఈ సెట్టింగ్స్‌ను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందామా..

ఆండ్రాయిడ్‌లో ఆఫ్ చేయడం:

Advertisement

ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి లొకేషన్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ యాప్ లొకేషన్ పర్మిషన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే.. మీ ఫోన్‌లోని ఏ యాప్‌కి లొకేషన్ యాక్సెస్ ఉందనే జాబితా వస్తుంది. మీకు ఏ యాప్‌పై అనుమానం ఉంటుందో, ఆ యాప్ పేరు మీద టాప్ చేయాలి. అక్కడ Don’t allow సెలెక్ట్ చేసుకుంటే లొకేషన్ పూర్తిగా కట్ అయిపోతుంది. కేవలం యాప్ వాడేటప్పుడు మాత్రమే లొకేషన్ కావాలంటే Allow only while using the app ఎంచుకోవచ్చు. అలాగే కచ్చితమైన లొకేషన్ అక్కర్లేని యాప్స్‌కి ప్రిసైజ్ లొకేషన్ టోగుల్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌పై బిగ్ అప్‌డేట్.. iPhone 17 కావాలంటే ఈ తేదీని అస్సలు మిస్ కావద్దు!

ఐఫోన్‌లో లొకేషన్ ఆపడం:

Advertisement

ఐఫోన్ వాడేవారు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్లాలి. అక్కడ లొకేషన్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే ఏ యాప్స్ లొకేషన్ వాడుతున్నాయో లిస్ట్ కనిపిస్తుంది. ఆ జాబితాలో నుంచి మీకు నచ్చిన యాప్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ యాప్ కింద ఉన్న సెట్టింగ్స్‌లో Never సెలెక్ట్ చేస్తే లొకేషన్ పర్మిషన్ పూర్తిగా ఆగిపోతుంది. కేవలం యాప్ వాడుతున్నప్పుడు మాత్రమే తెలియాలంటే While using the app ఆప్షన్ పెట్టుకోవచ్చు. కొన్ని యాప్స్‌కి మన ఖచ్చితమైన ప్రాంతం తెలియాల్సిన అవసరం ఉండదు. అలాంటి వాటికి ప్రిసైజ్ లొకేషన్ ఆప్షన్‌ని ఆఫ్ చేసి ఉంచడం చాలా మంచిది.

ప్రైవసీ మన చేతుల్లోనే:

యాప్స్ లొకేషన్ యాక్సెస్ ఆపేయడం వల్ల మన లొకేషన్ కొంతవరకు సేఫ్‌గా ఉంటుంది. అయితే, కొన్ని యాప్స్ మన ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ ద్వారా కూడా మనం ఎక్కడ ఉన్నామో అంచనా వేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవసీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఏ యాప్‌కి ఏది అవసరమో చూసుకొని పర్మిషన్స్ ఇస్తే మన పర్సనల్ డేటా ఎవరికీ లీక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. నావిగేషన్ లాంటి అత్యవసర యాప్స్‌కి మినహా.. మిగతా వాటికి ప్రిసైజ్ లొకేషన్ ఆఫ్ చేయడం ఎప్పుడూ సురక్షితమైన మార్గం.

Also Read: చివరకు ఆ కోరిక తీరిందిగా.. అద్భుతమైన ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో Apple iPad Mini వచ్చేసింది!

Tags

Related News

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌పై బిగ్ అప్‌డేట్.. iPhone 17 కావాలంటే ఈ తేదీని అస్సలు మిస్ కావద్దు!

చివరకు ఆ కోరిక తీరిందిగా.. అద్భుతమైన ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో Apple iPad Mini వచ్చేసింది!

ఈ గూగుల్ సెట్టింగ్ ఆఫ్‌ చేశారా? లేదంటే మీ పర్సనల్ డేటా టార్గెటెడ్ యాడ్స్ పరం అయినట్టే!

iPhone Duo స్క్రీన్ క్రాక్స్ మిస్టరీ వీడింది.. రిపేర్ చేయడం కూడా చాలా కష్టమని తేల్చేసిన నిపుణులు!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేస్తే.. ఆర్థికంగా సర్వనాశనమే!

సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు కారణాలు ఇవే!

బిఏ కుర్రాడి అద్భుతం.. యూట్యూబ్ చూసి ఎగిరే కారు ఆవిష్కరణ.. యావత్ దేశమే షాక్!

Big Stories

Advertisement
×