E-Paper
Advertisement

‘దాని వెనుక ఎన్నో అవమానాలు’.. పవన్ విజయంపై సతీమణి అన్నా ఎమోషనల్ పోస్ట్!

‘దాని వెనుక ఎన్నో అవమానాలు’.. పవన్ విజయంపై సతీమణి అన్నా ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Anna Konidela Post: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల (అనా లెజ్నెవా) సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను గుర్తుచేసుకుంటూ ఆమె పెట్టిన పోస్ట్ జనసైనికులను, మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Read also-‘Mega 158’ క్రేజీ అప్‌డేట్.. పొల్లాచిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిరు-బాబీ చిత్రం

ఆ పోస్ట్‌లో ఏముందంటే..?

Advertisement

పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ అన్నా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈరోజు మీరందరూ ఆయన సాధించిన విజయాన్ని చూస్తున్నారు. కానీ, ఈ విజయం వెనుక ఎన్నో అవమానాలు, నిందలు, సుదీర్ఘ పోరాటం ఉన్నాయి. ఎన్ని ఎదురైనా ఆయన ఎప్పుడూ తన పోరాటాన్ని ఆపలేదు. అందుకే ఈ విజయం మాకు చాలా స్పెషల్” అంటూ పవన్ పట్టుదలను కొనియాడారు.

ప్రధాని మోదీ కూడా గమనించారు..

గతంలో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “ప్రమాణస్వీకార సభలో ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తుంటే.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆనందంతో నేను ఏడవడాన్ని వేదికపై ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా గమనించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అంటూ ఆమె తన హృదయాంతరాల్లోని భావాలను పంచుకున్నారు.

Advertisement

Read also-‘సింగ్-గీతం’ మూవీ రివ్యూ.. సింగీతం గారి ‘సంగీత’ ప్రయోగం ఎలా ఉందో తెలియాలంటే?

తెర వెనుక తోడుగా..

సాధారణంగా అన్నా కొణిదెల మీడియా ముందుకు రావడం కానీ, రాజకీయ పరమైన విషయాలపై సోషల్ మీడియాలో స్పందించడం కానీ చాలా అరుదు. పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి.. ముఖ్యంగా 2019 ఎన్నికల ఓటమి తర్వాత ఎదుర్కొన్న తీవ్ర విమర్శల సమయంలో ఆమె తెర వెనుక ఉండి పవన్‌కు మానసిక స్థైర్యాన్ని అందించారు. కూటమి ఘనవిజయం సాధించి, ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో ఆమె ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అన్నా కొణిదెల చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్‌పై జనసైనికులు, మెగా అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. “ఒక లీడర్ వెనుక ఉన్న లీడీ సపోర్ట్ అంటే ఇదే”, “నిజమైన పోరాటానికి దక్కిన గౌరవం ఇది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సాధించిన విజయానికి ఈ పోస్ట్ అద్దం పడుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related News

షూటింగ్లో గాయపడ్డ జూ.ఎన్టీఆర్.. స్పందిస్తున్న సెలబ్రిటీస్!

ఫ్యాన్స్ మీట్ లో అల్లు అర్జున్.. ట్రోల్స్ వద్దు బ్రదర్!

ఆడాళ్ళకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు.. వీడియోతో వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’!

పావలా శ్యామల అంత్యక్రియలు.. బాధ్యత మొత్తం ‘మా’దే -కరాటే కళ్యాణి

పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ భార్య!

ఏంటీ.. శ్రీనిధి శెట్టి వెంకటేష్ కి కూతురుగా నటిస్తోందా?

హీరోయిన్ హెబ్బా పటేల్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత…

Big Stories

Advertisement
×