E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌పై బిగ్ అప్‌డేట్.. iPhone 17 కావాలంటే ఈ తేదీని అస్సలు మిస్ కావద్దు!

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌పై బిగ్ అప్‌డేట్.. iPhone 17 కావాలంటే ఈ తేదీని అస్సలు మిస్ కావద్దు!
Advertisement

Flipkart Diwali Sale 2026: అంబరాన్ని అంటే దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ సమయంలో షాపింగ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో అందరినీ అలరించిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు మరో కొత్త సేల్‌తో మన ముందుకు వస్తోంది. Big Bang Diwali Sale 2026 పేరుతో ఈ నెల అక్టోబర్ 28 నుంచే ఈ సేల్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా లైవ్‌లోకి వచ్చేసింది. బట్టలు, ఎలక్ట్రానిక్స్ ఇలా ఏది కొనాలన్నా ఇదే మంచి అవకాశం. ముఖ్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి.

ఐఫోన్ 17 పై భారీ తగ్గింపు:

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 ఈ సేల్‌లో తక్కువ ధరకే లభించనుంది. కేవలం ఐఫోన్ మాత్రమే కాదు.. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ, మోటరోలా ఎడ్జ్ 70 ప్రో, ఒప్పో, వివో, పోకో వంటి ఎన్నో ప్రముఖ కంపెనీల ఫోన్లు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే మొబైల్ మార్కెట్లో ఉన్న క్రేజ్ చూస్తుంటే.. ఈ సేల్‌లో ఫోన్ల కొనుగోళ్లు రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. డైరెక్ట్ ప్రైస్ కట్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా తోడవుతుండటంతో తక్కువ ధరకే మనకి నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: iPhone Duo స్క్రీన్ క్రాక్స్ మిస్టరీ వీడింది.. రిపేర్ చేయడం కూడా చాలా కష్టమని తేల్చేసిన నిపుణులు!

SBI కార్డులతో అదనపు ఆఫర్లు:

ఈ సేల్‌లో కేవలం ధరల తగ్గింపే కాకుండా.. బ్యాంకుల ద్వారా కూడా భారీగా ఆదా చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు అలాగే ఈఎంఐ లావాదేవీలపై నేరుగా పది శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంతేకాకుండా.. రూ.2 లక్షల వరకు క్రెడిట్ సదుపాయంతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ వాడే వారికి నేరుగా రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్‌ను మార్చుకుని ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా వాడుకుంటే చాలా డబ్బు మిగులుతుంది.

రాత్రి పూట ప్రత్యేక ఆఫర్లు:

Advertisement

ఈ దీపావళి సేల్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడానికి ఫ్లిప్‌కార్ట్ కొన్ని ప్రత్యేకమైన సమయాలను కేటాయించింది. ‘టిక్ టాక్ డీల్స్’ పేరుతో ప్రతి గంటకూ కొత్త ఆఫర్లను ఇస్తున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య బిగ్ బాంగ్ అవర్స్, 8 నుంచి 10 గంటల మధ్య పటాఖా డీల్స్, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ఫెస్టివల్ బెస్ట్ సెల్లర్స్ ఇలా ప్రత్యేక సమయాల్లో ధరలు అమాంతం తగ్గిపోతాయి. మొబైల్సే కాకుండా హెచ్‌పీ, శాంసంగ్ లాంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి.

Also Read: ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

Tags

Related News

మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఫొటో, గేమింగ్ యాప్స్ లొకేషన్ ఎందుకు అడుగుతాయి?

చివరకు ఆ కోరిక తీరిందిగా.. అద్భుతమైన ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో Apple iPad Mini వచ్చేసింది!

ఈ గూగుల్ సెట్టింగ్ ఆఫ్‌ చేశారా? లేదంటే మీ పర్సనల్ డేటా టార్గెటెడ్ యాడ్స్ పరం అయినట్టే!

iPhone Duo స్క్రీన్ క్రాక్స్ మిస్టరీ వీడింది.. రిపేర్ చేయడం కూడా చాలా కష్టమని తేల్చేసిన నిపుణులు!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేస్తే.. ఆర్థికంగా సర్వనాశనమే!

సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు కారణాలు ఇవే!

బిఏ కుర్రాడి అద్భుతం.. యూట్యూబ్ చూసి ఎగిరే కారు ఆవిష్కరణ.. యావత్ దేశమే షాక్!

Big Stories

Advertisement
×