Hyderabad: పైన కనిపిస్తున్న దంపతులు ఒకే ప్రాంతానికి చెందినవారు. వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. రెండేళ్ల కిందట ఓ బిడ్డకు జన్మ ఇచ్చారు. హ్యాపీగా సాగుతున్న సంసారంలో చిన్న కుదుపు. రెండేళ్ల కూతుర్ని చంపి ఆ తర్వాత యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. అసలు ఏం జరిగింది?
పశ్చిమ బెంగాల్‌లో బంకురా జిల్లాకు చెందిన గోపీనాథ్- సమత ఇద్దరు ప్రేమించుకున్నారు. మనసులు కలవడంతో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మూడేళ్ల కిందట హైదరాబాద్ సిటీలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లో రెండేళ్లుగా ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. గోపినాథ్ స్థానిక హోటల్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. వీలు కుదిరినప్పుడల్లా పిజ్జా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా అదనంగా పని చేసేవాడు.
ఈ జంటకు దాదాపు రెండేళ్ల వయస్సు కూతురు ఉంది. గోపీనాథ్ సోదరులు గచ్చిబౌలి, ఎల్‌బీనగర్, మాదాపూర్ ప్రాంతాల్లో చెఫ్‌లుగా పని చేస్తున్నారు.
గోపీనాథ్ కూతుర్ని ఎదుర ఇంట్లో ఉండే ఓ పెద్దాయన రోజూ ఆడిస్తూ ఉండేవాడు. అయితే మంగళవారం ఉదయం నుంచి గోపీనాథ్ ఇంటి తలుపు ఓపెన్ కాలేదు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన ఆ పెద్దాయన.. సాయంత్రం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు, తలుపులు పగులగొట్టారు. దంపతులు హాల్‌లో సీలింగ్‌కు ఉరి వేసుకుని కనిపించారు. పడక గదిలో రెండేళ్ల చిన్నారి విగత జీవిగా కనిపించడంతో పోలీసులతోపాటు పెద్దాయన ఒక్కసారి షాకయ్యాడు. ఈ క్రమంలో రూమ్ అంతా వెతగ్గా గోడపై అక్షరాలు కనిపించాయి. అందులో బెంగాలీలో రాసి ఉంది.
ఆ లేఖలో కీలక విషయాలు బయటపడ్డాయి. చాలా కాలం కిందట తామిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రస్తావించారు. ఈ విషయంలో తప్పు చేస్తున్నామని తెలుసని, మరొక దారి లేకపోవడమే ఇందుకు కారణంగా ప్రస్తావించారు. మమ్మల్ని క్షమించాలని, మా ముగ్గురి మరణం వెనుక మూడో వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో బంధువులను విచారించ వద్దని గోడపై రాశారు. ఇదికాకుండా బెంగాలీ, ఇంగ్లీష్‌లో రాసిన ఓ సూసైడ్ నోట్ లభించింది. గోపీనాథ్ ఆదివారం డ్యూటీకీ హాజరయ్యాడని, సోమవారం సెలవు కావడంతో ఇంట్లో ఉన్నాడు. తమ్ముడు రఘునాథ్ సోమవారం అన్నయ్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆత్మహత్య వెనుక ఆర్థిక ఇబ్బందులు కారణమని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.
ALSO READ: ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడైనా చూశామా.. కాంగ్రెస్‌పై జగదీశ్‌రెడ్డి ఫైర్!