E-Paper
Advertisement

Aadhar new app: ఈ యాప్ ఫోన్ లో ఉంటే.. ఆధార్ జేబులో ఉన్నట్టే

Aadhar new app: ఈ యాప్ ఫోన్ లో ఉంటే.. ఆధార్ జేబులో ఉన్నట్టే
Advertisement

ఆధార్ కార్డ్, దాని వినియోగంపై కేంద్రం ఎప్పటికప్పుడు నూతన విధానాలు తీసుకొస్తోంది. తాజాగా ఆధార్ కి సంబంధించి ఒక యాప్ ని రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఆధార్ వినియోగం మరింత సులభంగా మారుతుందని తెలిపారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ యాప్ మన ఫోన్లో ఉంటే, భౌతికంగా మనం ఆధార్ కార్డ్ ని బయటకు తీసుకెళ్లాల్సిన పని లేదు. ఆధార్ ని చూపించండి, ఒరిజినల్ ఆధార్ ఇవ్వండి అని ఎవరూ మనల్ని ఒత్తిడి చేయరు. సింపుల్ గా ఫోన్ ద్వారానే పని పూర్తవుతుంది.

ఎలా పనిచేస్తుంది..?
ఉదాహరణకు మనం ఎక్కడికైనా హోటల్ కి వెళ్లి చెక్ ఇన్ అయ్యేటప్పుడు వాళ్లు ఆధార్ కార్డ్ అడుగుతారు. లేదా కొత్త సిమ్ కార్డ్ కోసం వెళ్తే అక్కడ కూడా ఆధార్ అడుగుతారు. అలాంటి సందర్భాల్లో మనం మన వెంట ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మన ఆధార్ నెంబర్ వారికి చెప్పాలి. అవసరమైతే ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని కూడా వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడా అవసరం లేదు. మనం మన ఆధార్ కార్డ్ కూడా వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు. సింపుల్ గా వారి వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ ని మన ఫోన్ లోని ఆధార్ యాప్ లో స్కాన్ చేస్తే మన డిటెయిల్స్ అన్నీ వారికి చేరిపోతాయి. ప్రత్యేకంగా అథెంటిఫికేషన్ కూడా అవసరం ఉండదు.

Advertisement

గేమ్ ఛేంజింగ్ యాప్..
ఆధార్ వినియోగంలో ఇది ఒక గేమ్ ఛేంజింగ్ యాప్ అని కేంద్రం చెబుతోంది. క్యూఆర్ కోడ్ తోపాటు, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. ఏఐ ఆధారంగా దీన్ని తయారు చేశామని అంటున్నారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ యాప్ మన ఫోన్ లో ఉంటే ఆధార్ కార్డ్ ని భౌతికంగా మనం ఎక్కడికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

మన దేశంలో ఇప్పటికే ప్రతి షాప్ లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం క్యూఆర్ కోడ్ బోర్డ్ లు అందుబాటులో ఉన్నాయి. ఇకపై ఆధార్ ధృవీకరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారంతా కొత్త క్యూఆర్ కోడ్ బోర్డ్ లు తమ వద్ద ఉంచుకోవాలి. అప్పుడే ఆధార్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. కొత్త ఆధార్ యాప్‌తో, వినియోగదారులు అవసరమైన డేటాను మాత్రమే షేర్ చేస్తారు. అంటే వారి వ్యక్తిగత సమాచారంపై వారికి పూర్తి నియంత్రణ లభిస్తుందన్నమాట. ఈ యాప్ ప్రస్తుతం బీటా పరీక్ష దశలో ఉంది. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ఆధార్ విషయంలో ప్రయోగాలు సరే, ఇవన్నీ కేవలం స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అది కూడా స్మార్ట్ ఫోన్ లో ఆధార్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకునేవారికి మాత్రమే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. కీప్యాడ్ ఫోన్ లు వాడే వారికి, స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా అందులో యాప్ ఇన్ స్టలేషన్, ఇతర టెక్నాలజీ వాడటం చేతకానివారికి మాత్రం దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే రాబోయే రోజుల్లో దీన్ని ఒక గేమ్ ఛేంజింగ్ యాప్ గా కేంద్రం పరిగణిస్తోంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×