BigTV English

OTT Movie : కళ్ళు తెరిచి చూసేసరికి కాళ్ళు కాస్తా మాయమైతే… దిమ్మతిరిగే ట్విస్ట్ లున్న సై-ఫై మూవీ

OTT Movie : కళ్ళు తెరిచి చూసేసరికి కాళ్ళు కాస్తా మాయమైతే… దిమ్మతిరిగే ట్విస్ట్ లున్న సై-ఫై మూవీ

OTT Movie : సెక్షన్ ఫిక్షన్ సినిమాలు ఊహకు అందని రీతిలో తెరకెక్కుతుంటాయి. వీటిలో ఏలియన్స్ స్టోరీలతో వచ్చే సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాలు మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.  ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఏలియన్స్ రహస్యంగా మనుషుల్ని ట్రాక్ చేస్తుంటాయి. ఈ మూవీ చివరి వరకు సస్పెన్స్ ను క్రియేట్ చేస్తూ వస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది సిగ్నల్’ (The Signal). 2014 లో వచ్చిన ఈ మూవీకి విలియం యూబాంక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బ్రెంటన్ థ్వైట్స్, ఒలివియా కుక్, లారెన్స్ ఫిష్‌బర్న్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ముగ్గురు కాలేజీ విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు ఒక మిస్టీరియస్ హ్యాకర్‌ను ట్రాక్ చేస్తూ, అనుకోని సమస్యల్లో చిక్కుకుంటారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

నిక్, జోనాస్ అనే ఇద్దరు విద్యార్థులు, వీరి స్నేహితురాలు హేలీతో కలిసి ఒక రోడ్ ట్రిప్‌లో ఉంటారు. నిక్, జోనాస్ లను గతంలో నోమాడ్ అనే హ్యాకర్ వీళ్ళను ట్రాక్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వీళ్ళు , ట్రాక్ చేస్తుంది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే ఈ ట్రిప్ సమయంలో వీళ్ళు నోమాడ్ సిగ్నల్‌ను ట్రాక్ చేస్తారు. ఈ ట్రాకింగ్ వారిని నెవాడాలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తుంది. అక్కడికి చేరుకున్న తర్వాత, వారు ఒక పాడుబడిన ఇంటిని కనుగొంటారు. అక్కడ వీళ్ళకు ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అక్కడ నిక్, హేలీని ఒక వింత శక్తి దాడి చేస్తుంది. ఈ దాడిలో నిక్ స్పృహ కోల్పోతాడు. అతను మళ్లీ కళ్లు తెరిచేలోగా, తాను ఒక రహస్య పరిశోధనా కేంద్రంలో ఉన్నట్లు కనుగొంటాడు. అక్కడ డామన్ అనే వ్యక్తి నిక్‌ను ప్రశ్నిస్తాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో తెలీక నిక్ అయోమయంలో పడతాడు.

ఇప్పుడు నిక్ కు తన చుట్టూ జరిగే విషయాల గురించి సందేహాలు కలుగుతాయి. అతను తన స్నేహితులను కనిపెట్టి, ఆ ప్రాంతం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే, అతనికి తన శరీరంలో కొన్ని అసాధారణ మార్పులు జరిగినట్లు తెలుస్తుంది. అతనికి అసలు కాళ్లు ఉండవు. ఆ ప్లేస్ లో రోబోటిక్‌ కాళ్ళు అమర్చినట్లు  తెలుస్తుంది. చివరకు నిక్ ఈ భూమి మీద కాకుండా, వేరే గ్రహానికి సంబంధించిన స్పేస్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తుంది. నిక్, జోనాస్, హేలీలను ఎలియన్స్ జీవులు పరీక్షిస్తున్నాయని, వారు ఒక సిమ్యులేటెడ్ వాతావరణంలో ఉన్నారని తెలుసుకుంటారు. చివరకి ఈ ముగ్గురూ స్పేస్ షిప్ నుంచి తప్పించుకుంటారా ? ఎలియన్స్  వీళ్ళ మీద ఎటువంటి ప్రయోగాలు చేస్తాయి ? ఈ విషయాలు ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : పిల్లలు పుట్టట్లేదని దెయ్యంతో పాడు పని… ఈ రియల్ హర్రర్ మూవీని సింగిల్ గా చూసే దమ్ముందా?

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×