BigTV English

Kannappa Release Date: తమ్ముడితో గొడవలు కేర్ చేయని అన్న.. ‘కన్నప్ప’పైనే ఫోకస్, రిలీజ్ ఎప్పుడంటే.?

Kannappa Release Date: తమ్ముడితో గొడవలు కేర్ చేయని అన్న.. ‘కన్నప్ప’పైనే ఫోకస్, రిలీజ్ ఎప్పుడంటే.?

Kannappa Release Date: మంచు ఫ్యామిలీలో గత కొన్నిరోజులుగా జరుగుతున్న వివాదాల గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. ప్రస్తుతం మంచు మనోజ్ ఒకవైపు, మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు అన్నట్టుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని సమాచారం. కానీ మంచు మనోజ్ మాత్రం ఇవి ఆస్తి తగాదాలు కాదంటూ ఎప్పటికప్పుడు తన తండ్రి, అన్నపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. ఒకవైపు పోలీసులను ఆశ్రయిస్తూనే.. మరోవైపు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటికప్పుడు కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా కూడా మరోసారి ప్రెస్ మీట్ పెట్టి తండ్రి, అన్నపై ఆరోపణలు చేశాడు మంచు మనోజ్. కానీ అవేవి పట్టించుకోకుండా తన పూర్తి ఫోకస్ ‘కన్నప్ప’పైనే పెట్టాడు మంచు విష్ణు.


రిలీజ్ డేట్ వచ్చేసింది

మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు మంచు విష్ణు, మంచు మనోజ్. వీరిద్దరూ హీరోలుగా కొంతవరకు సక్సెస్ అయినా మరీ గుర్తుండిపోయే విజయాలను మాత్రం సాధించలేదు. అయినా కూడా తన కెరీర్‌లో మొదటిసారి ఓ భారీ రిస్క్‌కు సిద్ధపడ్డాడు మంచు విష్ణు. శివుడికి అతిపెద్ద భక్తుడు అయిన భక్త కన్నప్ప కథను సినిమాగా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. అంతే కాకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తానే నిర్మిస్తానని అన్నాడు. అలా గత కొన్నేళ్లుగా మంచు విష్ణు పూర్తి ఫోకస్ అంతా ‘కన్నప్ప’పైనే ఉంది. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న ఈ సినిమా.. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.


నా హీరో

తాజాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలవడానికి వెళ్లింది ‘కన్నప్ప’ టీమ్. మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభుదేవాతో పాటు దర్శకుడు కూడా యోగి ఆదిత్యనాథ్‌ను కలవడానికి వెళ్లారు. ఆయనకు ఒక స్పెషల్ గిఫ్ట్‌ను కూడా అందించి, ‘కన్నప్ప’ రిలీజ్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ మీటింగ్ గురించి, ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో బయటపెట్టాడు మంచు విష్ణు. ‘నాకు ఇష్టమైన హీరో యోగి ఆదిత్యనాథ్‌ను కలిశాను. ఆయన కన్నప్ప రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను లాంచ్ చేయడానికి ఒప్పుకున్నారు. రమేశ్ గొరిజాల పెయింటింగ్‌ను కూడా ఆయనకు గిఫ్ట్ ఇచ్చాం. కన్నప్ప జూన్ 27న విడుదల కాబోతుంది’’ అంటూ ప్రకటించాడు మంచు విష్ణు (Manchu Vishnu).

Also Read: మంచు మనోజ్ చర్యలు.. మోహన్ బాబుపై కోర్టు సీరియస్

కేర్ చేయట్లేదు

ఒకవైపు హైదరాబాద్‌లో మంచు మనోజ్ (Manchu Manoj).. మంచు విష్ణుపై తీవ్రమైన ఆరోపణలు, పోలీసు కేసులు అంటూ తిరుగుతుంటే మంచు విష్ణు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ‘కన్నప్ప’ (Kannappa) రిలీజ్ డేట్ కోసం, దానిని అనౌన్స్ చేయడం కోసం ఉత్తర ప్రదేశ్ వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా తనకు మోహన్ బాబు కూడా వెళ్లడంతో మంచు మనోజ్‌ను పూర్తిగా లైట్ తీసుకున్నారని అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మనోజ్‌ను కేర్ చేయడం లేదని ఫీలవుతున్నారు. మొత్తానికి ‘కన్నప్ప’ సినిమా వల్ల తన కెరీర్‌ను మలుపు తిప్పడంపైనే విష్ణు ఫోకస్ చేయాలని ఫిక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్ యాక్టర్లు కూడా ఉండడం విశేషం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×