E-Paper
Advertisement

నా క్లిప్స్ పోర్న్ సైట్‌లో పెట్టి.. ఆ చేదు జ్ఞాపకాలపై నోరు విప్పిన రాజశ్రీ దేశ్‌పాండే!

నా క్లిప్స్ పోర్న్ సైట్‌లో పెట్టి.. ఆ చేదు జ్ఞాపకాలపై నోరు విప్పిన రాజశ్రీ దేశ్‌పాండే!
Advertisement

Rajshri Deshpande: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’ (Sacred Games). 2018లో వచ్చిన ఈ సిరీస్ ఎంతటి ఘనవిజయం సాధించిందో, ఇందులో నటించిన నటి రాజశ్రీ దేశ్‌పాండే చుట్టూ అంతటి వివాదం కూడా నడిచింది. ఈ సిరీస్‌లో గ్యాగ్ ‌స్టర్ గణేష్ గైతోండే (నవాజుద్దీన్ సిద్ధిఖీ) భార్య ‘సుభద్ర’ పాత్రలో రాజశ్రీ నటించారు. అయితే, ఆ సమయంలో సిరీస్‌లోని ఒక బోల్డ్ సీన్ తీవ్ర దుమారం రేపింది. కొందరు దుండగులు ఆ సన్నివేశాన్ని మార్ఫింగ్ చేసి, అశ్లీల (పోర్న్) వెబ్‌సైట్లలో పెట్టడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.
తాజాగా ఈ చేదు జ్ఞాపకాలపై, ఆ తర్వాత తను ఎదుర్కొన్న పరిస్థితులపై రాజశ్రీ దేశ్‌పాండే స్పందించారు. ఆ వివాదాలన్నింటినీ దాటుకుని తాను ఎప్పుడో ముందుకు సాగిపోయానని ఆమె స్పష్టం చేశారు.

Read also-డిప్రెషన్‌తో లేనివి ఉన్నట్లు ఊహించుకున్నా.. ఆర్‌జే ఎమోషనల్ కామెంట్స్!

‘ఆ చర్చలతో విసుగొచ్చింది’

Advertisement

ఈ విషయంపై రాజశ్రీ దేశ్‌పాండే మాట్లాడుతూ.. “నేను ఆ చేదు జ్ఞాపకాల నుండి ఎప్పుడో బయటపడ్డాను, ముందుకు సాగిపోయాను. ఇప్పటికీ పాత విషయాల గురించే పదే పదే మాట్లాడటం నాకు విసుగు తెప్పిస్తోంది. ప్రస్తుతం మన సమాజంలో మనం చర్చించాల్సిన, పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. నా ముందు కూడా చేయాల్సిన పనులు, ప్రాజెక్ట్‌లు ఎన్నో ఉన్నాయి” అని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికీ మీడియా తనను కేవలం ‘సేక్రెడ్ గేమ్స్ నటి’గానే గుర్తించడం, హెడ్‌లైన్స్‌లో అదే పాత్రను హైలైట్ చేయడంపై ఆమె కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.

హీరోను, డైరెక్టర్‌ను ఎందుకు అడగరు?

గతంలో ఈ వివాదంపై స్పందించిన రాజశ్రీ.. సమాజంలో, చిత్ర పరిశ్రమలో ఉన్న లింగ వివక్షను బలంగా ప్రశ్నించారు. “ఆ బోల్డ్ సన్నివేశంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఉన్నారు. కానీ సమాజం నన్ను మాత్రమే టార్గెట్ చేసింది. నన్ను మాత్రమే ‘ఆ సీన్ ఎందుకు చేశావు?’ అని ప్రశ్నించారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను ఎవరూ అడగలేదు, ఎడిటర్‌ను ప్రశ్నించలేదు, హీరోను కూడా ఏమీ అనలేదు. కేవలం మహిళనైన నన్ను మాత్రమే ‘పోర్న్ స్టార్’ అంటూ ట్రోల్ చేశారు” అంటూ సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను ఆమె తూర్పారబట్టారు.

Advertisement

Read also-జాన్వీ కపూర్ కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా..? వామ్మో లక్షలే..

కెరీర్‌పైనే పూర్తి దృష్టి

ఈ తరహా ట్రోలింగ్, విమర్శలను ఎదుర్కొని నిలబడిన రాజశ్రీ.. ఆ తర్వాత కాలంలో నటిగా తనను తాను నిరూపించుకున్నారు. ముఖ్యంగా ‘ట్రయల్ బై ఫైర్’ (Trial by Fire) వంటి సిరీస్‌లలో ఆమె నటనకు విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. వివాదాలను పక్కన పెట్టి, ప్రస్తుతం తాను మంచి కథలను ఎంచుకుంటూ, తన కెరీర్‌తో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపైనే పూర్తి దృష్టి పెట్టినట్లు రాజశ్రీ దేశ్‌పాండే స్పష్టం చేశారు.

Related News

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

Big Stories

Advertisement
×