E-Paper
Advertisement

రూ.22,990కే 43 ఇంచుల టీవీ..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు

రూ.22,990కే 43 ఇంచుల టీవీ..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు
Advertisement

Acerpure Nitro 43 inch QLED TV: ప్రస్తుత రోజుల్లో టీవీలు కేవలం సీరియళ్లు, సినిమాలు చూసేందుకు మాత్రమే కాదు. హై-ఎండ్ గేమింగ్, ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ , స్మార్ట్ హోమ్ కంట్రోల్స్ అన్నీ ఒకే చోట లభించే డిజిటల్ హబ్‌గా మారిపోయాయి. ఈ ట్రెండ్‌కు తగినట్లుగా ఏసర్‌ప్యూర్ సంస్థ లాంచ్ చేసిన ‘నైట్రో’ సిరీస్ మోడల్ టెక్‌ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ టీవీపై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ నడుస్తోంది. కొత్తగా స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

అద్భుతమైన డిస్‌ప్లే,విజువల్ క్వాలిటీ:

ఈ టీవీ 108 సెంటీమీటర్లు అనగా 43 ఇంచుల క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్ ఉండటం వల్ల ప్రతి ఇమేజ్ చాలా స్పష్టంగా, సహజమైన రంగులతో.. కనిపిస్తుంది. దీనికి తోడు ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉండటం వల్ల హెచ్‌డీఆర్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఫీల్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాగే వైడ్ కలర్ గామట్ టెక్నాలజీ వల్ల కలర్స్ మరింత రిచ్‌గా కనిపిస్తాయి.

గేమింగ్ లవర్స్‌కు ప్రత్యేక ఫీచర్లు:

Advertisement

గేమింగ్ లవర్స్ కోసం ఈ టీవీలో ప్రత్యేకంగా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అందించారు. దీంతో పాటు ఆటో లో లేటెన్సీ మోడ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, MEMC టెక్నాలజీలు ఉన్నాయి. దీని వల్ల హై-స్పీడ్ గేమింగ్ ఆడేటప్పుడు లేదా యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు స్క్రీన్ లాగ్ అవ్వడం గానీ, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం గానీ జరగదు. గేమర్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

పవర్‌ఫుల్ సౌండ్, ఆడియో ఫీల్:

విజువల్స్ ఎంత స్పష్టంగా ఉన్నా.. సౌండ్ క్వాలిటీ లేకపోతే ఫలితం ఉండదు. ఈ సమస్యే లేకుండా ఏసర్‌ప్యూర్ నైట్రో టీవీలో ఏకంగా 40వాట్ల స్పీకర్లను ఉపయోగించారు. దీనికి తోడు డాల్బీ అట్మాస్ టెక్నాలజీ సపోర్ట్ లభిస్తుంది. ఇది ఇంట్లోనే సినిమా హాల్‌లాంటి.. సరౌండ్ సౌండ్ ఫీల్ అందిస్తుంది. అంతేకాకుండా.. ఇందులో కరాకే ఫీచర్ కూడా ఉండటం మరో ప్రత్యేకత.

సాఫ్ట్‌వేర్, స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌పై, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీంలో.. 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు, దీని వల్ల యాప్స్ చాలా వేగంగా రన్ అవుతాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. బిల్ట్-ఇన్ వైఫై, బ్లూటూత్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్లు అన్నీ ఇందులో ఉన్నాయి.

Also Read: మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్స్ ఇవే..మీరూ ఓ లుక్కేయండి

ధర:

అన్ని లేటెస్ట్ టెక్నాలజీలతో.. కూడిన ఈ టీవీ మార్కెట్లో సుమారు రూ.22,990 ధరతో అందుబాటులో ఉంది.

ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన గేమింగ్ సపోర్ట్, హై-ఎండ్ సౌండ్‌ను కోరుకునే బడ్జెట్ యూజర్లకు ఇది నిజంగా ఒక గొప్ప ఆప్షన్ అని చెప్పొచ్చు.

Related News

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఒక్క సెట్టింగ్ తెలిస్తే.. మీ అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు!

ఒప్పో ప్యాడ్ ఎయిర్ 6 లాంచ్ !ఇక మల్టీటాస్కింగ్ ఈజీ అయిపోవాల్సిందే..

మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్స్ ఇవే..మీరూ ఓ లుక్కేయండి

Meta Muse AIలో కొత్తగా స్పేసెస్ ఫీచర్.. మనకు నచ్చినట్టుగా కస్టమ్ ఫీడ్స్, గేమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు!

ఇంకో 3 రోజుల్లో ప్రపంచం అంతం? నవంబర్ 13 వెనుక 66 ఏళ్ల నాటి షాకింగ్ నిజం!

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేయకపోతే మీ పాస్‌వర్డ్స్, పర్సనల్ డేటా గోవిందా!

వృద్ధులకు భారీ ఊరట.. బ్యాంకుకు వెళ్లకుండానే ‘లైఫ్ సర్టిఫికెట్’ సమర్పించే సూపర్ ఛాన్స్!

Big Stories

Advertisement
×