E-Paper
Advertisement

ఇకపై 72 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేయాలా? లేదంటే రీఫండ్ రాదా?

ఇకపై 72 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేయాలా? లేదంటే రీఫండ్ రాదా?
Advertisement

Indian Railways New Rules: రైలులో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అనుకోని కారణాలతో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి రావచ్చు. అలాంటి సమయంలో టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత మొత్తం తిరిగి వస్తుంది? ఎన్ని గంటల ముందు రద్దు చేస్తే పూర్తి రిఫండ్ లభిస్తుంది? అనే విషయాలు ప్రయాణికులకు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కొత్త రూల్స్ ప్రకారం టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తం మారుతుంది.

72 గంటల ముందే క్యాన్సిల్ చేస్తే పూర్తి రిఫండ్!

కొత్త నిబంధనల ప్రకారం రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే, టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు, వర్తించే ఇతర నిబంధనలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రయాణ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రిఫండ్ మొత్తం తగ్గుతుంది.

సమయాన్ని బట్టి ఎంత రిఫండ్ వస్తుంది?

Advertisement

కొత్త రూల్స్ ప్రకారం టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు. 72 గంటల కంటే ముందు క్యాన్సిల్ చేస్తే పూర్తి రిఫండ్‌కు అవకాశం ఉంటుంది. 72 నుంచి 24 గంటల మధ్య  క్యాన్సిల్ చేస్తే, టికెట్ ధరలో 25 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీగా కట్ అవుతుంది. 24 నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే,  టికెట్ ధరలో 50 శాతం మినహాయిస్తారు. 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు రిఫండ్ లభించదు. గతంలో 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రిఫండ్ పొందే అవకాశం ఉండేది. అలాగే 48 నుంచి 12 గంటల మధ్య 25 శాతం, 12 నుంచి 4 గంటల మధ్య 50 శాతం ఛార్జీలు కట్ అయ్యేవి.

బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం

కొత్త మార్పుల్లో ప్రయాణికులకు ఉపయోగపడే మరో అంశం బోర్డింగ్ పాయింట్ ఛేంజ్. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల చివరి నిమిషంలో ప్రయాణ ప్రణాళిక మార్చుకునే వారికి మంచి వెసులుబాటు లభిస్తుంది.

TDR ద్వారా ఆటోమేటిక్ రిఫండ్

Advertisement

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రయాణికులకు TDR ప్రక్రియ ద్వారా రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది. కొత్త విధానంలో అర్హత ఉన్న సందర్భాల్లో ఆటోమేటిక్ రిఫండ్ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా క్లాస్ అప్‌ గ్రేడ్‌ కు అవకాశం ఉంటుంది.

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు ఎంతంటే?

టికెట్ రద్దు చేసుకునేటప్పుడు క్లాస్ ను ని బట్టి ఛార్జీలు కూడా ఉంటాయి. తాజా రూల్స్ ప్రకారం.. ఏసీ ఫస్ట్ క్లాస్ / ఎగ్జిక్యూటివ్ క్లాస్ కు రూ.240 + జీఎస్టీ, ఏసీ చైర్ కార్ కు రూ.180 + జీఎస్టీ, స్లీపర్ క్లాస్ కు రూ.120, సెకండ్ క్లాస్ కు రూ.60 ఛార్జీలు కట్ అవుతాయి.

ప్రయాణికులకు కీలక అలర్ట్ 

టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే క్యాన్సిలేషన్ రూల్స్ తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రయాణం క్యాన్సిల్  చేయాల్సి వస్తే చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా ముందుగానే నిర్ణయం తీసుకోవడం మంచిది.

Read Also: దీపావళి పటాకులతో రైళ్లకు బ్రేక్.. 35 ట్రైన్స్ రద్దు, 150 రైళ్లు ఆలస్యం!

Tags

Related News

ఈ ఫ్యామిలీ నిర్వాకం చూశారా? రైలులోని 3AC కోచ్‌లో వంటలు.. నెటిజన్ల ఫైర్!

మొదటి రైలు ఆలస్యమై కనెక్టింగ్ ట్రైన్ మిస్ అయ్యిందా? మీ టికెట్ రిఫండ్ ఇలా పొందండి

దీపావళి పటాకులతో రైళ్లకు బ్రేక్.. 35 ట్రైన్స్ రద్దు, 150 రైళ్లు ఆలస్యం!

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ ప్రెస్!

సోలోగా యూరప్ టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారా? టాప్ 10 సిటీస్ ఇవే!

బ్రేకప్ కోసం హైకింగ్.. దెయ్యాల కోసం వేట.. 2027లో రాబోతున్న 6 వింత ట్రావెల్ ట్రెండ్స్!

దేశంలోనే అత్యంత అందమైన రోడ్ ట్రిప్.. బీచ్‌లు, జలపాతాలు, పురాతన కోటల మధ్య అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×