Dhanaraj:జబర్దస్త్.. ప్రతిభ ఉంటే చాలు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది అతి పెద్ద వేదిక. ఇప్పటికే ధనరాజ్ ,వేణు, చలాకీ చంటి, చమ్మక్ చంద్ర, సుధీర్, రాంప్రసాద్ ఇలా ఒక్కరేమిటి ఎంతోమంది ఈ కామెడీ షో లో తమదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని ఇప్పుడు సినిమాలలో నిర్మాతలుగా, దర్శకులుగా, కమెడియన్స్ గా, హీరోలుగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే సినిమాలలో అవకాశాలు వచ్చిన తర్వాత జబర్దస్త్ ను వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అలా వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయట అవకాశాలు లేక జబర్దస్త్ లోకి వచ్చి తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక కమెడియన్ తనకు జబర్దస్త్ నుండి వెళ్లిపోవాలని లేనప్పటికీ కూడా బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆయన ఎవరో కాదు జబర్దస్త్ కామెడీ షో లో ధనాధన్ ధనరాజ్ గా ప్రసిద్ధి చెందిన ధనరాజ్. తేజ నటించిన జై అనే చిత్రం ద్వారా తొలిసారి తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఇక జబర్దస్త్లోకి అడుగుపెట్టిన తర్వాత.. ఇక్కడ టీం లీడర్గా ఎదిగి తన పాపులారిటీని మరింత పెంచేసుకున్నారు. ఈ షో ఇచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో పాల్గొన్న ధనరాజ్ ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్ వంటి షోలలో టీం లీడర్ గా పనిచేసి ఆకట్టుకున్నారు . ఇకపోతే 2025 లో రామ రాఘవం అనే చిత్రంతో దర్శకుడిగా కూడా అరంగేట్రం చేశారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో మళ్లీ జబర్దస్త్ స్కిట్ లలో సందడి చేస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
ఇకపోతే గతంలో జబర్దస్త్ ను వీడడం పై స్పందిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జబర్దస్త్ నుండి బయటకు రావడానికి గల కారణాలను ధనరాజు వెల్లడించారు.” నాకు మరో షోలో అవకాశం రావడంతో మల్లెమాల నిర్వహకులు ఎక్స్క్లూజివిటీ నిబంధన విధించారు. షూటింగ్ ఒత్తిడి, సినిమా అవకాశాలకు డేట్లు సర్దుబాటు కాకపోవడం కూడా కారణం. ఇక అందుకే జబర్దస్త్ను వదిలి వెళ్లాలని నాకు లేకపోయినా పరిస్థితుల వల్ల బయటకు వచ్చాను. ముఖ్యంగా మల్లెమాల నిర్వహకులు విధించిన ఎక్స్ క్లూజివిటి నిబంధన నన్ను బలవంతంగా బయటకు వెళ్లేలా చేసింది. అయితే నేను బయటకు వచ్చినా.. నాకు గుర్తింపు తెచ్చింది మాత్రం ఈ షోనే అంటూ గుర్తు చేసుకున్నారు” . మొత్తానికి అయితే ధనరాజ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:నేడే ఘనంగా కావ్య – అనిరుధ్ పెళ్లి.. ప్రత్యేకతలు ఇవే!
ధనరాజ్ విషయానికి వస్తే.. తేజ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈయన.. ఇండస్ట్రీలోకి రాకముందు తల్లిదండ్రులకు చెప్పకుండా సొంత ఊరు వదిలి హైదరాబాద్ కి 400 రూపాయలతో వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో కష్టపడ్డారు. హైదరాబాదులో ఒక హోటల్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత యాక్టింగ్ స్కూల్లో కూడా పనిచేసినట్లు సమాచారం. ఎప్పుడైతే జబర్దస్త్ లోకి వచ్చారో అక్కడ తన ప్రతిభ చాటుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.