Oppo Pad Air 6: ప్రముఖ టెక్ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి..మరో పవర్ ఫుల్ ట్యాబ్‌లను తీసుకువచ్చేందుకు.. సన్నాహాలు చేస్తోంది. టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న’ఒప్పో ప్యాడ్ ఎయిర్ 6′(Oppo Pad Air 6)విడుదలకు ముందే.. కంపెనీ దీనికి సంబంధించిన పలు కీలక వివరాలను అధికారికంగా వెల్లడించింది. భారీ బ్యాటరీ కెపాసిటీ..లేటెస్ట్ ప్రాసెసర్ , ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ ట్యాబ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ట్యాబ్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్‌ను వాడారు. దీని వల్ల మల్టీటాస్కింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. గేమింగ్ లేదా హెవీ అప్లికేషన్స్ వాడేటప్పుడు.. ఎలాంటి లాగ్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో పని చేస్తుంది.
ఈ ట్యాబ్ మెయిన్ హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యం. ఇందులో.. ఏకంగా 10,050mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి తోడు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా నాన్‌స్టాప్‌గా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
Also Read: మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్స్ ఇవే..మీరూ ఓ లుక్కేయండి
యూజర్ల అవసరాలకు తగినట్లుగా ఇది వివిధ వేరియంట్లలో.. లభిస్తుంది. గరిష్టంగా 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఇందులో ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇది లేటెస్ట్ 5G పవర్‌తో వస్తుంది. దీంతో.. హై-స్పీడ్ ఇంటర్నెట్ ఫీల్ పొందవచ్చు. అలాగే మంచి సౌండ్ ఫీల్ కోసం క్వాడ్ స్పీకర్లను అందించారు.
ఈ ఒప్పో ప్యాడ్ ఎయిర్ 6 ట్యాబ్ ధర విషయానికి వస్తే, మార్కెట్ అంచనాల ప్రకారం దీని ధర సుమారు రూ. 24,990 నుంచి రూ. 29,990 మధ్య ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో.. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.