BigTV English

Whatsapp : వాట్సాప్ లో ఈ 4 సెట్టింగ్స్ మార్చారా.. మర్చిపోయారా?

Whatsapp : వాట్సాప్ లో ఈ 4 సెట్టింగ్స్ మార్చారా.. మర్చిపోయారా?

Whatsapp : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్స్ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ వాట్సాప్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మెసేజ్ ట్రాన్స్ఫర్, ఫైల్ షేరింగ్ కు ముఖ్యమైన సాధారణంగా మారిపోయిన వాట్సప్ తో అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా హ్యాకర్స్ వాట్సాప్ ను ఆసరాగా చేసుకొని పలు నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వాట్సాప్ అకౌంట్ ఎంత భద్రంగా ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో యూజర్స్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. క్షణాల్లోనే డేటా మొత్తం హ్యాక్ అవ్వడంతో పాటు ముఖ్యమైన సమాచారం సైతం నేరగాళ్లు చేతికి చేరిపోతుంది. అందుకే వాట్సప్ వాడే ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.


ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగించే ఇనిస్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ అనే విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. మెటా తీసుకొచ్చిన ఈ వాట్సాప్.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ ను సంతరించుకుంటున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేటెస్ట్ అప్డేట్స్ తో తన యూజర్స్ భద్రతే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు మెటా చేపడుతున్నప్పటికీ ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే వాట్సాప్ ను ఉపయోగిస్తున్న ప్రతీ ఒక్కరూ కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అందులో వాట్సప్ హ్యాక్ కాకుండా ఉండాలి అంటే ఈ నాలుగు టిప్స్ కచ్చితంగా పాటించాల్సిందే.

టు ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ఫీచర్ –


వాట్సాప్ లో టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ఫీచర్ ను ఉపయోగించాలి. ఈ ఫీచర్ ను ప్రతీ ఒక్కరూ ఎనేబుల్ చేసుకోవడం అత్యవసరం. వాట్సాప్ యాప్ కు అదనపు భద్రత ఈ ఫీచర్ తోనే వస్తుంది. ఇది ఉంటే వాట్సప్ హ్యాక్ అవ్వడం కష్టతరం అవుతుంది.

పబ్లిక్ వైఫై వద్దు –

ఎటువంటి ముఖ్యమైన సమాచారం పంపించాల్సి వచ్చినా పబ్లిక్ వైఫై ను ఉపయోగించకపోవటమే మంచిది. ఉచిత వైఫై కోసం సర్చ్ చేసి ఇబ్బందుల్లో పడే అవకాశం ఎంతైనా ఉంటుంది. అందుకే సురక్షితమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాట్సాప్ నుంచి సమాచారాన్ని డేటాను ట్రాన్స్ఫర్ చేయడం మంచిది.

థర్డ్ పార్టీ యాప్స్ వద్దు –

థర్డ్ పార్టీ యాప్స్ ని ఉపయోగించి వాట్సాప్ ను ఇన్స్టాల్ చేసినప్పుడు ఫోన్ లోకి మాల్వేర్ లేదా స్పై వేర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికార స్టోర్స్ నుంచి మాత్రమే వాట్సాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

వాట్సాప్ లింక్స్ టచ్ చేయొద్దు –

వాట్సాప్ ను ఆసరాగా చేసుకుని హాకర్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఖాతాకు వచ్చిన ఎటువంటి లింక్స్ ను క్లిక్ చేయకపోవడం మంచిది. హాకర్స్ ఈ లింక్స్ ని పంపించి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇక వాట్సప్ కు వచ్చే తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్స్ తో పాటు లింక్స్ ను ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలి.

ALSO READ : డీప్ ఫేక్.. ముంచేస్తుందా..!

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×