Kiran Abbavaram: టాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు కూడా సక్సెస్ అవ్వగలరు అనిపించడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అందులో ఒకటి కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిల్మ్స్‌లో హీరో దగ్గర నుండి ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్‌లో హీరో వరకు ఎదిగాడు కిరణ్ అబ్బవరం. తన డెబ్యూ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత కిరణ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. కానీ ‘క’ (Ka) అనే మూవీతో మళ్లీ ట్రాక్‌లో పడ్డాడు. ‘క’ మూవీ ప్రమోషన్స్ దగ్గర నుండి దాని సక్సెస్ వరకు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. అన్నింటిలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు సక్సెస్ ట్రాక్‌లో పడడంతో కిరణ్ అబ్బవరం తన రెమ్యునరేషన్ పెంచుతాడా అని డౌట్లు మొదలయ్యాయి. దానికి కిరణ్ ముక్కుసూటిగా సమాధానం కూడా ఇచ్చాడు.
ఆ మాట నిజమే
అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘క’ మూవీ.. మొత్తానికి రూ.50 కోట్ల వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరంను 50 కోట్ల క్లబ్‌లో జాయిన్ చేసింది. దీంతో తన రెమ్యునరేషన్ పెరుగుతుందని, తను స్క్రిప్ట్ వర్క్‌లో జోక్యం చేసుకుంటాడని సినీ సర్కిల్లో వార్తలు మొదలయ్యాయి. తాజాగా ‘క’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడం, ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోవడంతో మూవీ టీమ్ అంతా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అందులో కిరణ్ రెమ్యునరేషన్ గురించి ప్రశ్న ఎదురయ్యింది. రెమ్యునరేషన్ పెంచిన మాట నిజమే అని కన్ఫర్మ్ చేశాడు. ఇప్పటివరకు హీరోగా సినిమాలు చేస్తున్నా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని, ఇప్పటికైనా పారితోషికం పెంచుతానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
Also Read: శ్రీదేవి మరణంపై సినీ రచయిత ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
నిర్మాత గురించే ఆలోచిస్తాను
రెమ్యునరేషన్ పెంచాలి కదా అంటూ చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. ఇన్నిరోజులు కాస్త ఇబ్బంది పడ్డానని, ఇప్పుడు కొంచెం రెమ్యునరేషన్ పెంచానని తెలిపాడు. అయినా కూడా నిర్మాతలకు లాభాలు వచ్చిన తర్వాతే తాను రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుంటానని, ముందుగా నిర్మాతల గురించే ఆలోచిస్తానని అన్నాడు. ముందు నిర్మాత సేఫ్ అని తెలిసిన తర్వాత నేను ఎంత తీసుకోవాలని ఆలోచిస్తానని చెప్పాడు కిరణ్ అబ్బవరం. దీంతో కిరణ్ అబ్బవరం చేస్తున్న పని కరెక్టే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటివరకు తను ఎన్ని సినిమాలు చేసినా ‘క’ రేంజ్‌లో సక్సెస్ లభించలేదు. దీంతో పారితోషికం విషయంలో ఈ ఆలోచన మంచిదే అంటున్నారు.
సీక్వెల్ ప్లానింగ్
సుజీత్, సుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘క’ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. అయితే ఈ సీక్వెల్ పరిస్థితి ఏంటి అని అడగగా.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని, ఈలోపు తన తరువాతి ప్రాజెక్ట్స్‌పై దృష్టిపెడతానని అన్నాడు కిరణ్. తాజాగా ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు కానీ ‘క’ వల్ల తన అప్‌కమింగ్ సినిమాలకు కచ్చితంగా ప్లస్ అవుతుంది. ఇదే రేంజ్‌లో ఇంకో రెండు సినిమాలు హిట్ అయితే కిరణ్ అబ్బవరం మార్కెట్ మరింత పెరగడం ఖాయం.