Airtel Rs 299 Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. సుమారు మూడు నెలల క్రితం నిలిపివేసిన పాపులర్ రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కంపెనీ మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరలో 28 రోజుల వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారులకు ఇది మంచి అవకాశం. అయితే ఈ ప్లాన్‌ను తిరిగి తెచ్చినప్పటికీ ఎయిర్‌టెల్ ఒక చిన్న షాక్ కూడా ఇచ్చింది. ధరలో ఎలాంటి మార్పు చేయకపోయినా.. డేటా ప్రయోజనాల్లో మాత్రం కోత పెట్టింది.
మళ్లీ అందుబాటులోకి వచ్చిన ఈ రూ.299 రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో రోజుకు 1GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా వస్తుంది. అంటే.. మొత్తం 28 రోజులకు కలిపి 28GB డేటా వాడుకోవచ్చు. వీటితో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఉచితంగా పొందవచ్చు.
గతంలో ఇదే రూ.299 ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా లభించేది. అంటే నెల మొత్తానికి 42GB డేటా వచ్చేది. కానీ ఇప్పుడు రోజుకు 1GBకి తగ్గించడంతో కస్టమర్లు ఏకంగా 14GB డేటాను కోల్పోతున్నారు. రోజూ ఎక్కువగా వీడియోలు చూసే వారికి, సోషల్ మీడియా వాడే వారికి ఈ 1GB డేటా ఏమాత్రం సరిపోకపోవచ్చు.
Also Read: ఫ్లాగ్‌షిప్ ఫోన్లకే బాప్ లాంటి Vivo X500.. భారత్ యూజర్ల కోసమే ప్రత్యేకంగా రెడ్ కలర్ వేరియంట్!
ఆగస్టు 2026లో ఎయిర్‌టెల్ తమ రీఛార్జ్ ప్లాన్లలో మార్పులు చేస్తూ రూ.299తో పాటు పలు ఇతర ప్లాన్లను తొలగించింది. ఆ సమయంలో 28 రోజుల వ్యాలిడిటీ కోసం కస్టమర్లు రూ.349 ప్లాన్ వైపు వెళ్లాల్సి వచ్చింది. దీనివల్ల వినియోగదారులపై అదనంగా రూ.50 భారం పడింది. ఇప్పుడు సబ్‌స్క్రైబర్ల వృద్ధి నెమ్మదించడంతో కస్టమర్లను కాపాడుకోవడానికి మళ్లీ రూ.299 ప్లాన్‌ను తీసుకొచ్చింది.
తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలి అనుకునే వారికి, ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడే వారికి ఈ రూ.299 ప్లాన్ చాలా బాగుంటుంది. తక్కువ ఇంటర్నెట్ వాడే బడ్జెట్ కస్టమర్లకు ఇది బెస్ట్ ఛాయిస్. ఒకవేళ మీకు రోజూ 1.5GB లేదా అంతకంటే ఎక్కువ డేటా కావాలంటే మాత్రం రూ.349 ప్లాన్ ఎంచుకోవడమే ఉత్తమం.
Also Read: చలికాలంలో ఎయిర్ ప్యూరిఫయర్ ఫుల్ స్పీడ్‌తో పనిచేయాలంటే.. ఈ 4 తప్పులు అస్సలు చేయొద్దు!