Anc vs enc earbuds: కాలం మారుతున్న కొద్దీ.. మనం వాడే గాడ్జెట్లు కూడా చాలా స్మార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా.. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ మార్కెట్లోకి వచ్చాక హెడ్ ఫోన్‌ల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు లేదా వర్కవుట్లు చేసేటప్పుడు ఇయర్ బడ్స్ వాడకం చాలా అవసరం అయింది. ఇదెలా ఉంటే.. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఇయర్‌బడ్స్‌లో ANC, ENC అనే రెండు పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటి? మన అవసరానికి ఏది బెటర్ అనే వివరాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.
ANC అంటే ‘యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్’. ఈ టెక్నాలజీ.. ప్రధానంగా మ్యూజిక్ వినే వారి కోసం తయారు చేసారు.ఇయర్ బడ్స్‌లో ఉండే మైక్రో ఫోన్లు బయటి నుంచి వచ్చే శబ్దాలను (ట్రాఫిక్ హోర్లు, ఏసీ శబ్దాలు, రైలు ట్రాక్ సౌండ్లు) గమనించి, వాటికి వ్యతి రేకమైన వేవ్‌ల ద్వారా ఆ సౌండ్స్ రాకుండా చేస్తాయి. దీని వల్ల మీరు పాటలు వినేటప్పుడు బయటి ప్రపంచంతో.. సంబంధం లేకుండా కేవలం మ్యూజిక్‌ను.. మాత్రమే స్పష్టంగా వినొచ్చు. ప్రస్తుతం రూ. 2,000 నుంచి రూ. 10,000 పైచిలుకు ధరల్లో.. లభించే మంచి ఇయర్ బడ్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
ENC అంటే ‘ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్’. ఇది పూర్తిగా ఫోన్ కాల్స్ మాట్లాడే వారి కోసం ఉద్దేశించబడింది. మీరు రద్దీగా ఉండే రోడ్డుపై నడుస్తూ లేదా బస్సులో ప్రయాణిస్తూ ఎవరికైనా కాల్ మాట్లాడితే.. అవలి వైపు వారికి మీ గొంతుతో పాటు చుట్టు పక్కల సౌండ్స్ కూడా వినిపిస్తాయి. కానీ ENC టెక్నాలజీ ఉన్న ఇయర్ బడ్స్ మీ గొంతును మాత్రమే గుర్తించి, చుట్టూ ఉన్న సౌండ్స్ ఫిల్టర్ చేసి అవతలి వారికి కేవలం మీ వాయిస్‌ని మాత్రమే స్పష్టంగా వినిపించేలా చేస్తాయి. ఈ ఫీచర్ ఉన్న బడ్జెట్ ఇయర్ బడ్స్ ధరలు సాధారణంగా రూ. 1,200 నుంచి రూ. 5,000 వరకు ఉంటున్నాయి.
మీరు ప్రధానంగా ప్రయాణాల్లో పాటలు వినడానికి, సినిమా లేదా వెబ్ సిరీస్‌లు చూడటానికి ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే కచ్చితంగా ‘ANC’ ఫీచర్ ఉన్న ఇయర్ బడ్స్‌ను ఎంచుకోవడం మంచిది. ఇది బయటి సౌండ్లను పూర్తిగా కట్టడి చేసి మీకు అద్భుతమైన మ్యూజిక్ ఫీల్ ఇస్తుంది. సోనీ, శాంసంగ్, ఆపిల్ వంటి బ్రాండ్లలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. అయితే.. వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి.
Also Read: ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ..రూ.1,899కే అగారో రాయల్ కాఫీ మేకర్
ఆఫీస్ మీటింగ్‌లు, క్లాసులు లేదా రోజూ గంటల తర బడి ఫోన్ కాల్స్ మాట్లాడే వారికి ‘ENC’ ఫీచర్ చాలా ముఖ్యం. కొన్ని సార్లు ANC ఉన్న ఇయర్‌బ డ్స్‌లో కూడా కాల్స్.. సమయంలో పూర్తి క్లారిటీ ఉండకపోవచ్చు. కానీ ENC టెక్నాలజీ మాత్రం మీ వాయిస్ కమ్యూనికేషన్‌ను.. చాలా ప్రొఫెషనల్‌గా మారుస్తుంది. ప్రస్తుతం తక్కువ ధరలో లభించే బోట్, రియల్మి, వన్ ప్లస్ బడ్జెట్ మోడల్స్‌లో.. ఈ ENC ఫీచర్ అద్భుతంగా ఇస్తున్నారు. వీటి ధరలు రూ.1,500లోపు కూడా లభిస్తున్నాయి.
మొత్తం మీద చూస్తే.. ANC అనేది మీ చెవులకు ప్రశాంతతను ఇస్తే.. ENC అనేది మీ మాటలను అవతలి వారికి స్పష్టంగా చేర వేస్తుంది. మీ అవసరం సంగీతం.. వినడమా.. లేదా కాల్స్ మాట్లాడడమా అనే దానిపై ఆధార పడి ఈ రెండింటిలో ఒక దానిని లేదా రెండూ ఉన్న హైబ్రిడ్ మోడల్స్‌ను తీసుకోవడం బెస్ట్. మీ బడ్జెట్, పెర్ఫామెన్స్ బట్టి సరైన ఇయర్‌బడ్స్‌ను ఎంచుకుని మీ డిజిటల్ ఫీల్ మెరుగు పరచుకోండి!