E-Paper
Advertisement

Airtel బాటలో Jio.. ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ రీఛార్జ్ ఆఫర్.. ఏ ప్లాన్లపై వర్తిస్తుందంటే?

Airtel బాటలో Jio.. ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ రీఛార్జ్ ఆఫర్.. ఏ ప్లాన్లపై వర్తిస్తుందంటే?
Advertisement

Jio Buy 1 Get 1 Free: దేశంలో దిగ్గజ టెలికాం సంస్థలైన ఎయిర్ టెల్, జియో మధ్య గట్టిపోటీ నడుస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ సంస్థలు పోటాపోటీగా రీఛార్జ్ ప్లాన్లను, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎయిర్ టెల్ ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ (buy 1 get 1 free) ఆఫర్ ప్రకటించి సర్ ప్రైజ్ చేయగా.. తాజాగా జియో సైతం అదే బాటలో నడిచింది. జియో కూడా ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ ఆఫర్ తో తన కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. ఒక ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అదే విలువ కలిగిన మరో రీఛార్జ్ వోచర్‌ను ఉచితంగా పొందే వెసులుబాటును కల్పించింది. అయితే ఇది అర్హుత గల యూజర్లకు రూ.299, రూ.349 ప్లాన్లపై మాత్రమే వర్తించనున్నట్లు జియో స్పష్టం చేసింది.

రూ. 299 ప్లాన్‌ బెనిఫిట్స్..

‘బై వన్ గెట్ ఆఫర్’ వర్తిస్తున్న ఈ రూ.299 ప్లాన్ విషయానికి వస్తే.. దీనిని ఎయిర్ టెల్ 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్లకు ప్రతీ రోజూ 1.5GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభించనున్నాయి. అలాగే జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సబ్ స్క్రిప్షన్లు సైతం ఉచితంగా యూజర్లు పొందొచ్చు. తాజా ఆఫర్ నేపథ్యంలో ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా రూ.299 విలువైన ఫ్రీ రీఛార్జ్ వోచర్ లభించనుంది.

రూ. 349 రీఛార్జ్‌పై కూడా ఫ్రీ వోచర్

Advertisement

ఈ ప్లాన్ కింద యూజర్లకు రోజూ 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఏ రోజుకారోజు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీంతో పాటు అర్హులైన యూజర్లకు అపరిమిత 5G డేటా, జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్, జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ వంటి బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ‘కాన్వా ప్రో లైట్’ ఏడాది సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తోంది. ఈ ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ ఆఫర్ కింద అర్హత ఉన్న యూజర్లకు రూ. 349 విలువైన మరో రీఛార్జ్ వోచర్ కూడా ఈ ప్లాన్ పై ఉచితంగా లభించనుంది.

Also Read: 50 ఏళ్లు దాటినా నటి సితార ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

ఈ ఆఫర్ ఇలా చెక్ చేయండి?

Advertisement

అయితే ఈ ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ ఆఫర్ అర్హులైన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో స్పష్టం చేసింది. కేవలం కొన్ని సెలెక్టెడ్ నంబర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో యూజర్లు తమ నెంబర్ కు ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మైజియో యాప్‌లో లాగిన్ అయ్యి.. హోమ్‌పేజీలో కనిపించే ప్రమోషనల్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ‘రికమండెడ్ ప్లాన్స్ ఫర్ యూ’ సెక్షన్‌లో రూ. 299, రూ. 349 ప్లాన్లపై ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ బ్యాడ్జ్ ఉంటే ఈ ఆఫర్ కు అర్హత ఉన్నట్లే. రీఛార్జ్ చేసుకున్న 7 రోజుల్లోపు వోచర్స్ లభించనున్నాయి.

Also Read: ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తున్నారా? ఈ అలవాటు మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోందంటే?

Tags

Related News

మీ అకౌంట్ ఖాళీ కావద్దంటే..ఈ ఫేక్ బ్యాంకింగ్ ట్రిక్స్ తప్పక తెలుసుకోండి!

చలికాలంలో ఎయిర్ ప్యూరిఫయర్ ఫుల్ స్పీడ్‌తో పనిచేయాలంటే.. ఈ 4 తప్పులు అస్సలు చేయొద్దు!

క్రిస్టల్ క్లియర్ కాల్స్ కోసం..ఏ ఇయర్‌బడ్స్ తీసుకోవాలి? ANC లేదా ENC?

టీనేజర్ల ఆట కట్టించేందుకు మెటా కొత్త అస్త్రం.. వయసు దాచినా ఇట్టే పట్టేస్తుంది ఈ ఏఐ టూల్!

రూ.13 వేలకే దొరికే..ఈ సూపర్ స్మార్ట్ టీవీ అస్సలు మిస్ కావద్దు!

తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ లుక్..ఈ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లపై ఓ లుక్కేయండి

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ మోసాలపై బీ అలర్ట్.. తెలంగాణ సైబర్ బ్యూరో వార్నింగ్!

Big Stories

Advertisement
×