E-Paper
Advertisement

3 గంటల్లోనే ముగిసిన అనిరుధ్ లవ్ స్టోరీ..కానీ?

3 గంటల్లోనే ముగిసిన అనిరుధ్ లవ్ స్టోరీ..కానీ?
Advertisement

Anirudh Ravi Chander:ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఎట్టకేలకు తన ప్రేయసి కావ్య మారన్ తో ఏడడుగులు వేశారు. కోట్ల మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సొంతం చేసుకున్న అనిరుధ్.. తన ప్రేయసితో ఏడడుగులు వేసి, అందుకు సంబంధించిన ఫోటోలను అధికారికంగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు , అభిమానులు అనిరుధ్, కావ్య దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా అనిరుధ్ కి సంబంధించిన పలు విషయాలు ఈ సందర్భంగా మళ్లీ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఆయన లవ్ స్టోరీ.

మూడు గంటల్లో ముగిసిన ప్రేమ..

సాధారణంగా ఒకరి లైఫ్ లో ప్రేమ కథ అంటే కొన్ని నెలలు లేదా కొన్ని రోజుల్లో జరుగుతుంది. కానీ రాక్ స్టార్ అనిరుధ్ తొలిప్రేమ ఆయుష్షు అక్షరాల మూడు గంటలు ఉండడం గమనాభం. స్కూల్ రోజుల్లో ఒక అమ్మాయిని మనసులోనే ఆరాధించాడట. ఎంతో ధైర్యం చేసి తన ప్రేమను ఆ అమ్మాయికి చెప్పాడు. అయితే ఆ అమ్మాయి ఓకే చెప్పిందో లేదో కానీ ఆ ఆనందం ఆవిరయ్యేలోపే సీన్ కాస్త రివర్స్ అయిపోయింది.. ప్రపోజ్ చేసిన మూడు గంటల్లోనే వారి మధ్య బ్రేకప్ జరిగిపోయింది . అయితే ఈ ఫన్నీ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్ ని స్వయంగా అనిరుధ్ ఒక సందర్భంలో బయట పెట్టడం గమనార్హం.

Advertisement

also read:రామ్ ప్రసాద్ సీక్రెట్ బయటపెట్టిన అమ్మ!

ధనుష్ వల్లే ఇండస్ట్రీలోకి?

అనిరుధ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారట. అనిరుధ్ టాలెంట్ ని చూసి ఈయన తండ్రి రవి రాఘవేంద్ర తన కొడుకు ఎప్పటికైనా ఐఐటీలో పెద్ద స్థాయికి వెళ్తాడు అని అందరి దగ్గర గొప్పగా చెప్పుకునేవారట. ఇక లయోలా కాలేజీలో బీకాం పూర్తయ్యాక, పై చదువుల కోసం సింగపూర్ పంపాలని సిద్ధమవుతున్న సమయంలో సడన్గా ధనుష్ ఎంట్రీ ఇచ్చి.. అతని తల్లిదండ్రులతో మాట్లాడి ఇతడు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇండస్ట్రీని ఏలుతాడని ఒప్పించారట. అలా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 3 అనే సినిమాతో అనిరుధ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇకపోతే తన జీవితంలో ఆ మూడు గంటల ప్రేమాయణం ముగిసినా.. మళ్లీ 3 అనే సినిమాతో తన కెరీర్ మొదలపెట్టి నేడు సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్నారు.

చెన్నై వేదికగా గ్రాండ్ రిసెప్షన్..

Advertisement

ఇకపోతే అనిరుధ్, కావ్య పెళ్లి వేడుక గ్రీస్లో రెండు రోజులపాటు ఘనంగా జరిగింది.. ఇకపోతే ఇండియన్ సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖుల కోసం చెన్నైలో రిసెప్షన్ గ్రాండ్గా నిర్వహించనున్నారు. నవంబర్ 21వ తేదీన జరగబోయే ఈ వేడుకకు కళానిధి మారన్, ఆయన భార్య పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఏది ఏమైనా వివాహం అనంతరం కూడా మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్, హైదరాబాద్ సన్రైజర్స్ సీఈవోగా కావ్య తమ కెరియర్లో బిజీగా మరింత దూసుకుపోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

50 ఏళ్లు దాటినా నటి సితార ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

చాగంటి ప్రవచనాలతో ‘ఇడుపు కాయితం’ అఫీషియల్ టీజర్.. ఎలా ఉందంటే?

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?

మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ తో అదరగొట్టేసిన రజినీకాంత్.. వీడియో వైరల్!

ప్రగ్యా నెలకు ఎంత సంపాదిస్తుంది..? ఒక్క సినిమా కంటే ఎక్కువే..!

ప్రేమలో పడ్డ నస్లేన్.. హీరోయిన్ ఎవరంటే?

అయ్యో.. మోనాల్ కు ఏమైంది..? ఇది అస్సలు ఊహించలేదుగా..

Big Stories

Advertisement
×