Skywall 40 inch smart tv: ప్రస్తుత కాలంలో.. ఎంటర్‌టైన్మెంట్ అంటే.. కేవలం సినిమా హాల్‌లకు వెళ్లడమే కాదు,ఇంట్లోనే కూర్చుని.. హై క్వాలిటీ విజువల్స్ ఆస్వాదించడం. దీని కోసం ప్రతి ఒక్కరూ స్మార్ట్ టీవీలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ప్రముఖ బ్రాండ్ల టీవీల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల సామాన్యులకు అది భారంగా మారుతోంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ..సామాన్యుల బడ్జెట్‌కు సరి పోయేలా అద్భుతమైన టెక్నాలజీతో వస్తోంది ఈ స్మార్ట్ టీవీ’. మార్కెట్లో దీని ధర సుమారు రూ.13,499 వరకు ఉంది. ఈ టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ టీవీ డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బ్లాక్ కలర్ ఫినిషింగ్, స్లీమ్ బెజెల్స్‌తో ఇది మీ లివింగ్ రూమ్‌కు మోడర్న్ లుక్‌ను తీసుకు వస్తుంది. ఇందులో.. అందించిన 40 ఇంచుల (101.6 సెం.మీ) డిస్‌ప్లే చిన్న , మిడిల్ క్లాస్ హాల్స్‌కు సరిగ్గా సరి పోతుంది. 1920 x 1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్‌డీ రెసల్యూషన్ కారణంగా.. వీడియోలు ఎంతో స్పష్టంగా, సహజ మైన రంగులతో కనిపిస్తాయి.
కేవలం పిక్చర్ క్వాలిటీ మాత్రమే కాకుండా..సౌండ్ విషయంలోనూ..ఈ టీవీ అదరగొడుతుంది.సాధారణంగా బడ్జెట్ టీవీలలో.. స్పీకర్ సౌండ్ తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో.. ఏకంగా 30 వాట్స్ పవర్ ఫుల్ స్పీకర్ అవుట్ పుట్ లభిస్తుంది. దీనికి తోడు సరౌండ్.. సౌండ్ సపోర్ట్ ఉండటంతో.. సినిమాలు చూసేటప్పుడు లేదా పాటలు వినేటప్పుడు.. థియేటర్ లాంటి ఫీల్ కలుగుతుంది.ఎక్స్‌టర్నల్ సౌండ్ బార్‌లు.. అవసరం లేకుండానే రూమ్ అంతా సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే..ఇందులో 2 హెచ్‌డీఎంఐ పోర్టులు ఇవ్వడం ద్వారా సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ లేదా ల్యాప్ టాప్‌లను.. ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే.. పెన్‌డ్రైవ్‌లు లేదా హార్డ్ డిస్క్‌ల వాడకం కోసం 2 యూఎస్‌బీ పోర్టులు అందుబాటులో.. ఉన్నాయి.బిల్ట్-ఇన్ వైఫై సపోర్ట్ ద్వారా ఇంటర్నెట్‌ను.. కనెక్ట్ చేసుకొని యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్,ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ యాప్స్‌ను నేరుగా చూడొచ్చు.
తక్కువ ధరలో.. పెద్ద స్క్రీన్, అదిరిపోయే సౌండ్, స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ హెచ్‌డీ స్మార్ట్ టీవీ ఒక గొప్ప ప్రత్యామ్నాయం. రూ. 13,499 బడ్జెట్‌లో ఇంతకంటే మంచి ఫీచర్లు లభించడం కష్టమనే చెప్పాలి. మీరు కూడా తక్కువ ఖర్చులో మంచి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్ కోసం చూస్తుంటే, ఈ టీవీని ధైర్యంగా కొనొచ్చు.