E-Paper
Advertisement

శ్రీకాళహస్తి దేవాలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో ఘటన, ఎలా జరిగింది?

శ్రీకాళహస్తి దేవాలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో ఘటన, ఎలా జరిగింది?
Advertisement

Srikalahasti Temple Incident: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భక్తులకు అన్న ప్రసాదాలు తయారు చేసే కేంద్రంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన గురించి సమచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవాలయంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఆలయ ప్రసాద కేంద్రంలో ఆ ఘటన జరిగింది. దక్షిణ గోపురం పక్కన ప్రసాదాల తయారీ కేంద్రం ఉంది. అయితే ఉన్నట్లుండి గ్యాస్ లీకైన వాసన రావడంతో అందులోని వారు అలర్ట్ అయ్యారు. స్వామికి లడ్డూతోపాటు వడలు, అన్న ప్రసాదాలు తయారు చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆలయానికి చేరుకున్నారు. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

Advertisement

ప్రమాదం కారణంగా ఆలయం బయట దట్టమైన పొగలు అలముకున్నాయి. ఆలయం లోపల మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం కారణంగా మండపంలో ఉన్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఆలయ ఈవో వెంకటేశులు, ఛైర్మన్ సాయి ప్రసాద్ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ప్రసాదాల తయారీని నిలిపి వేశారు అధికారులు.

ALSO READ: సెమీ కండక్టర్ పరిశ్రమకు హబ్‌గా విశాఖ.. సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement

 

Related News

సెమీ కండక్టర్ పరిశ్రమకు హబ్‌గా విశాఖ.. సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విశాఖలో సీఐఐ సదస్సులో నేతల సందడి! డోలు వాయించిన చంద్రబాబు, పవన్, పీయూష్ గోయల్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండుకార్లు, ప్రకాశం జిల్లాలో ఘటన

జగన్ దారిలో విజయసాయిరెడ్డి అడుగులు.. ఆనాడు వైసీపీ అలా, నేడు పీఆర్పీ ఇలా

ఢిల్లీలో రాహుల్‌తో షర్మిల భేటీ.. పెళ్లి పిలుపు మాత్రమేనా, వెనుక పెద్ద వ్యూహమే ఉందా?

అప్పుడు రాజకీయాలు వద్దన్నావ్.. ఇప్పుడెందుకు వచ్చావ్? విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ ఫైర్

ఏపీకి మరో ముప్పు! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాతావరణ శాఖ అలర్ట్

Big Stories

Advertisement
×