E-Paper
Advertisement

Airtel సూపర్ ప్లాన్.. రోజూ 2.5GB డేటా, కాల్స్, అమెజాన్ ప్రైమ్, 18+ ఓటీటీలు ఫ్రీ.. ఇంకా మరెన్నో!

Airtel సూపర్ ప్లాన్.. రోజూ 2.5GB డేటా, కాల్స్, అమెజాన్ ప్రైమ్, 18+ ఓటీటీలు ఫ్రీ.. ఇంకా మరెన్నో!
Advertisement

Airtel Recharge Plans: విభిన్నమైన రీఛార్జ్ లతో ఎయిర్ టెల్ తన యూజర్లను ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తీసుకొచ్చిన రూ.1,199 ప్రీపెయిడ్ ప్లాన్.. బెనిఫిట్స్ పరంగా మంచి ఆదరణ సంపాదిస్తోంది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఇందులోని బెనిఫిట్స్ పరంగా చూస్తే ఆ ప్రైస్ వర్త్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ ప్రత్యేకతలు, దీనిని రీఛార్జ్ చేయడం ద్వారా యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

ప్రతీరోజూ 2.5GB డేటా..

84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే ప్రతీ రోజూ యూజర్లకు 2.5GB డేటా లభించనుంది. అంటే ప్లాన్ వ్యవధి పూర్తయ్యే సరికి 210GB డేటాను వినియోగించుకోవచ్చు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ సమయం గడిపేవారికి ఈ భారీ డేటా పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఎయిర్ టెల్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీరోజూ 2GB కంటే ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఈ రూ.1,199 ప్లాన్ మంచి ఆప్షన్ అని పేర్కొంటున్నాయి. మరోవైపు ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సైతం యూజర్లు చేసుకోవచ్చు.

18కి పైగా ఓటీటీ యాప్స్ ఫ్రీ..

Advertisement

ఈ ప్లాన్ ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు హైలెట్ గా నిలుస్తున్నాయి. ఏకంగా 18 పైగా ఓటీటీల కంటెంట్ ను ఫ్రీగా వీక్షించే వెసులుబాటును ఎయిర్ టెల్ ఈ ప్లాన్ లో కల్పిస్తోంది. ‘ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే’ యాప్ ద్వారా అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, ఆహా, చౌపాల్, సన్ నెక్స్ట్ వంటి 18కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను ఫ్రీగా చూడొచ్చు. మెుబైల్ తో పాటు స్మార్ట్ టీవీలో సైతం ఈ ఎయిర్ టెల్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ షోలు ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: Airtel బాటలో Jio.. ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ రీఛార్జ్ ఆఫర్.. ఏ ప్లాన్లపై వర్తిస్తుందంటే?

అర్హులకు అపరిమిత 5G డేటా

Advertisement

మరోవైపు రూ.1199 ప్లాన్ లో అర్హులైన యూజర్లకు అపరిమిత 5G డేటాను సైతం ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. ఎయిర్ టెల్ 5G నెట్ వర్క్ పరిధిలో ఉండి, 5G స్మార్ట్ ఫోన్ ఉన్న యూజర్లు దీనిని వినియోగించుకోవచ్చు. అటు అడిషనల్ బెనిఫిట్స్ కింద ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’, ‘ఎయిర్‌టెల్ సేఫ్’ (Airtel Safe) సేవలు కూడా ఈ ప్లాన్ లో భాగంగా ఎయిర్ టెల్ అందిస్తోంది. ఎయిర్ టెల్ సేఫ్ సేవల ద్వారా స్పామ్ కాల్స్ అలర్ట్స్, నకిలీ లింక్‌లను ఈజీగా గుర్తించడం, ఓటీపీల ద్వారా జరిగే ఆన్‌లైన్ మోసాల నుంచి ప్రొటెక్షన్ పొందొచ్చు.

Also Read: పాకిస్తాన్ ను ఒడించేందుకు ఇర్ఫాన్ ప‌ఠాన్ తో క‌లిసి వసీం అక్రమ్ కుట్ర‌లు!

Tags

Related News

ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ వచ్చిన రూ.299 రీఛార్జ్ ప్లాన్, కానీ ఒక ట్విస్ట్!

ఫ్లాగ్‌షిప్ ఫోన్లకే బాప్ లాంటి Vivo X500.. భారత్ యూజర్ల కోసమే ప్రత్యేకంగా రెడ్ కలర్ వేరియంట్!

మీ అకౌంట్ ఖాళీ కావద్దంటే..ఈ ఫేక్ బ్యాంకింగ్ ట్రిక్స్ తప్పక తెలుసుకోండి!

Airtel బాటలో Jio.. ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ రీఛార్జ్ ఆఫర్.. ఏ ప్లాన్లపై వర్తిస్తుందంటే?

చలికాలంలో ఎయిర్ ప్యూరిఫయర్ ఫుల్ స్పీడ్‌తో పనిచేయాలంటే.. ఈ 4 తప్పులు అస్సలు చేయొద్దు!

క్రిస్టల్ క్లియర్ కాల్స్ కోసం..ఏ ఇయర్‌బడ్స్ తీసుకోవాలి? ANC లేదా ENC?

టీనేజర్ల ఆట కట్టించేందుకు మెటా కొత్త అస్త్రం.. వయసు దాచినా ఇట్టే పట్టేస్తుంది ఈ ఏఐ టూల్!

Big Stories

Advertisement
×