Fake banking website detection: టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా అదే స్థాయిలో.. పెరుగుతున్నాయి.ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ రంగంలో.. కొత్త కొత్త టెక్నిక్స్‌ను ఉపయోగిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లను పోలిన ‘ఫిషింగ్’ వెబ్ సైట్లను సృష్టిస్తూ, కస్టమర్ల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను తెలుసు కుంటున్నారు. కాస్త అయినా జాగ్రత్తగా లేకపోతే మీ జీవితకాల సంపాదన క్షణాల్లో మాయం కావచ్చు. కాబట్టి ఫేక్ వెబ్‌సైట్లను గుర్తించడం ఎలాగో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నకిలీ వెబ్‌సైట్లను గుర్తించడానికి మొదటి, ముఖ్యమైన మార్గం దాని వెబ్ అడ్రస్ లేదా URLను చెక్ చేయడం. అసలు బ్యాంకుల వెబ్ సైట్ చిరునామా ఎప్పుడూ ‘https://’తో మొదలవుతుంది.ప్రారంభంలో.. ఒక చిన్న లాక్ ఐకాన్ ఉంటుంది.ఒక వేళ ఆ చిరునామా ‘http://’ తో మొదలైతే అది సేఫ్ కాదని అర్థం.అంతే కాకుండా,సైబర్ కేటు గాళ్లు అసలు పేరు లాగే.. ఉండేలా చిన్న స్పెల్లింగ్ తప్పులతో (ఉదాహరణకు sbi కి బదులు sbii లేదా s-bi) వెబ్‌సైట్లను సృష్టిస్తారు. కాబట్టి లింక్ ఓపెన్ చేసే ముందు స్పెల్లింగ్‌ను సరిగ్గా చెక్ చేయడం చాలా అవసరం.
అసలు బ్యాంక్ వెబ్‌సైట్లు అత్యంత సురక్షితంగా, ప్రొఫెషనల్ డిజైన్‌తో.. ఉంటాయి.కానీ నకిలీ వెబ్‌సైట్లలో పేలవమైన గ్రాఫిక్స్,తప్పుగా ముద్రించిన అక్షరాలు,లోపభూయిష్టమైన లోగోలు కనిపిస్తాయి. అలాగే ఆ వెబ్‌సైట్‌లోని ఇతర పేజీలు లేదా లింక్స్ క్లిక్ చేసినప్పుడు అవి ఓపెన్ కాకపోవడం లేదా వేరే పేజీకి రీడైరెక్ట్ కావడం జరుగుతుంది. ఇలాంటి అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆ వెబ్‌సైట్ నుంచి బయటకు వచ్చేయడం మంచిది.
చాలా మందికి లాటరీ తగిలిందని, మీ అకౌంట్ బ్లాక్ అయిందని, వెంటనే కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ..సైబర్ నేరగాళ్లు ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు..లేదా ఈమెయిల్ పంపుతుంటారు. వాటిలో ఒక లింక్ ఇచ్చి క్లిక్ చేయమంటారు. గుర్తుంచుకోండి, ఏ బ్యాంక్ కూడా ఎప్పుడూ.. ఎస్ఎంఎస్ ద్వారా నేరుగా లాగిన్ లింక్‌లను పంపదు. అలాగే.. అత్యవసరంగా ..మీ పర్సనల్ వివరాలు లేదా పిన్ నంబర్ అడగదు. అలాంటి అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.
Also Read: రూ.1లక్ష పెట్టుబడితో..లక్షలు సంపాదించండి,పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ బెనిఫిట్స్ ఇవే!
ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల నుంచి రక్షణ.. పొందడానికి ఎలాంటి ఖర్చుతో.. కూడుకున్న యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్లు లేదా భారీ చెల్లింపులు అవసరం లేదు. కేవలం.. మీ అవగాహన, అప్రమత్తతే ..అతిపెద్ద రక్షణ. ఎప్పుడూ గూగుల్ సెర్చ్‌లో నేరుగా బ్యాంక్ వెబ్‌సైట్ కోసం వెతకకుండా..మీ బ్యాంక్ పాస్‌బుక్ లేదా డెబిట్ కార్డ్ వెనక ఉన్న అధికారిక వెబ్ అడ్రస్ నేరుగా.. బ్రౌజర్ అడ్రస్ బార్‌లో టైప్ చేయాలి.అలాగే.. మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అలర్ట్‌లను ఎప్పుడూ ఆన్ లో ఉంచుకోవాలి.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ అనేది మన పనులను ఈజీ చేయడానికి ఒక అద్భుతమైన వరం. అయితే దీనిని సురక్షితంగా ఉపయోగించుకోవడం మన చేతుల్లోనే ఉంది. కొద్ది పాటి జాగ్రత్త, అనుమానాస్పద లింక్‌లకు దూరంగా ఉండటం ద్వారా.. సైబర్ మోసాల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చు. మీ బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.