E-Paper
Advertisement

ఫ్లాగ్‌షిప్ ఫోన్లకే బాప్ లాంటి Vivo X500.. భారత్ యూజర్ల కోసమే ప్రత్యేకంగా రెడ్ కలర్ వేరియంట్!

ఫ్లాగ్‌షిప్ ఫోన్లకే బాప్ లాంటి Vivo X500.. భారత్ యూజర్ల కోసమే ప్రత్యేకంగా రెడ్ కలర్ వేరియంట్!
Advertisement

Vivo X500: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో తమ కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్‌తో మరోసారి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనాతో పాటు కొన్ని గ్లోబల్ మార్కెట్లలో అడుగుపెట్టిన Vivo X500 సిరీస్, త్వరలోనే భారతదేశంలోకి రాబోతోంది. అయితే ఈసారి ఫోన్ ఫీచర్లతో పాటు దాని ధర, కొత్త కలర్ ఆప్షన్ గురించి టెక్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రీమియం సెగ్మెంట్ యూజర్లను టార్గెట్ చేస్తూ.. వస్తున్న ఈ ఫోన్, అటు లుక్స్ పరంగానూ ఇటు పర్ఫార్మెన్స్ పరంగానూ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. మరి ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? అసలు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో వివరంగా తెలుసుకుందామా..

రెడ్ కలర్ వేరియంట్‌పై ఆసక్తి..

Vivo X500 మొదట బ్లాక్, గ్రే, వైట్, పింక్ రంగుల్లో పరిచయమైనట్లు సమాచారం. ఇప్పుడు కనిపించిన ఎరుపు రంగు మరో ఎంపికగా మారవచ్చు. భారత్‌లో ప్రత్యేకంగా ఈ రంగును తీసుకొస్తారని ప్రచారం జరుగుతున్నా.. దానిపై ఇప్పటివరకు కంపెనీ ప్రకటన చేయలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన యూట్యూబర్ సహిల్ కరౌల్ షేర్ చేసిన అన్‌బాక్సింగ్ వీడియోలో కూడా ఇదే రంగు ఉన్న గ్లోబల్ మోడల్ కనిపించింది. దీంతో ఇది భారత్‌కు మాత్రమే పరిమితం అవుతుందనే మాటపై సందేహాలు ఉన్నాయి.

డిస్‌ప్లే, ప్రాసెసర్..

Advertisement

ఈ Vivo X500లో 6.59 అంగుళాల 1.5K LTPS డిస్‌ప్లే ఉండొచ్చని అంచనా. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉండవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9600M చిప్‌సెట్‌తో ఫోన్ రావచ్చని సమాచారం. LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ అధికారికంగా ఖరారు కాలేదు.

Also Read: చలికాలంలో ఎయిర్ ప్యూరిఫయర్ ఫుల్ స్పీడ్‌తో పనిచేయాలంటే.. ఈ 4 తప్పులు అస్సలు చేయొద్దు!

కెమెరాలపై స్పెషల్ ఫోకస్..

Advertisement

వెనుకవైపు మూడు కెమెరాలు ఉండొచ్చని అంచనా. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 3x ఆప్టికల్ జూమ్ ఇచ్చే 64 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఆటోఫోకస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వొచ్చని తెలుస్తోంది. కెమెరాల పనితీరు ఎలా ఉంటుందో ఫోన్ విడుదలయ్యాకే తెలుస్తుంది.

బ్యాటరీ, ధర ఎంత?

Vivo X500 ఫోన్‌లో 7,500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉండొచ్చని సమాచారం. 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్స్ ఇవ్వొచ్చని అంచనా. 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర భారత్‌లో సుమారు రూ.1,19,999గా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. X500తో పాటు X500 Pro, X500 Pro Max మోడళ్ల విడుదల, ధరలు, అమ్మకాల తేదీలను వివో ఇంకా ప్రకటించలేదు. కాబట్టి.. కొనుగోలు చేయాలనుకునే వారు అధికారిక వివరాల కోసం వేచి చూడటం మంచిది.

Also Read: టీనేజర్ల ఆట కట్టించేందుకు మెటా కొత్త అస్త్రం.. వయసు దాచినా ఇట్టే పట్టేస్తుంది ఈ ఏఐ టూల్!

Tags

Related News

మీ అకౌంట్ ఖాళీ కావద్దంటే..ఈ ఫేక్ బ్యాంకింగ్ ట్రిక్స్ తప్పక తెలుసుకోండి!

Airtel బాటలో Jio.. ‘బై 1 గెట్ 1 ఫ్రీ’ రీఛార్జ్ ఆఫర్.. ఏ ప్లాన్లపై వర్తిస్తుందంటే?

చలికాలంలో ఎయిర్ ప్యూరిఫయర్ ఫుల్ స్పీడ్‌తో పనిచేయాలంటే.. ఈ 4 తప్పులు అస్సలు చేయొద్దు!

క్రిస్టల్ క్లియర్ కాల్స్ కోసం..ఏ ఇయర్‌బడ్స్ తీసుకోవాలి? ANC లేదా ENC?

టీనేజర్ల ఆట కట్టించేందుకు మెటా కొత్త అస్త్రం.. వయసు దాచినా ఇట్టే పట్టేస్తుంది ఈ ఏఐ టూల్!

రూ.13 వేలకే దొరికే..ఈ సూపర్ స్మార్ట్ టీవీ అస్సలు మిస్ కావద్దు!

తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ లుక్..ఈ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×