Trolls On Wasim Akram: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ ప్రారంభంలో తాను అతనికి ఎంతో హెల్ప్ చేశానని.. కానీ ఇప్పుడు అతడే తమ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతున్నాడని మండిపడ్డాడు. అతని కోసం అప్పట్లో సహాయం చేసి అనేక ఇబ్బందులను తాను ఎదుర్కొన్నట్టు గుర్తు చేశాడు. బౌలింగ్ టెక్నిక్స్ ఇర్ఫాన్ పఠాన్ కు చెప్పినందుకు తన ఇంటిపై పాకిస్తాన్ అభిమానులు రాళ్లతో దాడులు కూడా చేసినట్టు బాంబు పేల్చాడు. అయినప్పటికీ తాను ఓపికగా అన్ని భరించానని వివరించాడు. అలాంటి ఇర్ఫాన్ పఠాన్ ఇప్పుడు తన దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు.
ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్ ప్రారంభంలో బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే 2004 సంవత్సరంలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్ళింది. ఈ సందర్భంగా వసీం అక్రమ్ ను ఇర్ఫాన్ పఠాన్ కలిశాడు. మీరు నా ఫేవరెట్ క్రికెటర్ అంటూ ఇర్ఫాన్ పఠాన్ పరిచయం చేసుకున్నాడు. వసీం అక్రమ్ లాగానే ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ చేయడంతో ఇద్దరి మధ్య బంధం పెరిగింది. ఈ క్రమంలోనే ఇర్ఫాన్ పఠాన్ కు వసీం అక్రమ్ కొన్ని బౌలింగ్ టెక్నిక్స్ నేర్పించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ప్లేయర్ల బలహీనతలను కూడా వసీమ్ అక్రమ్ పంచుకున్నట్టు సమాచారం.
అయితే అతని ట్రైనింగ్ తీసుకున్న ఇర్ఫాన్ పఠాన్ బలమైన బౌలర్ గా తయారయ్యాడు. ఈ తరుణంలోనే 2006లో పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా వెళ్లింది ఆ సందర్భంగా పాకిస్తాన్ పై ఇర్ఫాన్ పఠాన్ అద్భుతంగా ప్రదర్శన చేశాడు. కరాచీలో పాకిస్తాన్ పై హ్యాట్రిక్ సాధించాడు. సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసఫ్ లను తన తొలి ఓవర్ లోనే వరసగా ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు. 2007 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా కూడా పాకిస్తాన్ జట్టును దెబ్బతీశాడు. ఈ నేపథ్యంలో వసీం అక్రమ్ పై ఆ దేశ అభిమానులు సీరియస్ అయ్యారు. గతంలో అతడి ఇంటిపై రాళ్లదాడి కూడా చేశారు. పగొడికి బౌలింగ్ నేర్పిస్తావా? అని రెచ్చిపోయారు.
బౌలింగ్ నేర్పించిన పాపానికి ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం తన పాకిస్తాన్ దేశంపై ట్వీట్లు చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని వసీం అక్రమ్ ఆగ్రహించాడు. తన దృష్టిలో ఇర్ఫాన్ పఠాన్ చాలా మంచి అబ్బాయి… కానీ ఏమైందో తెలియదు ఈ మధ్య రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డాడు. అతని తోక కట్ చేయాల్సిందేనని ఆగ్రహించాడు. ఇకపై తమ జోలికి వస్తే ఇర్ఫాన్ పఠాన్ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు.