iQOO Z10 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ మరో కొత్త మెుబైల్ ను తీసుకొస్తుంది. IQOO Z10 Turbo మెుబైల్ Snapdragon 8s ఎలైట్ ప్రాసెసర్, 7500mAh బ్యాటరీతో త్వరలోనే చైనీస్ మార్కెట్లోకి లాంఛ్ కాబోతుంది.
ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ మెుబైల్స్ ను తీసుకొస్తున్న స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ. ఈ టెక్ దిగ్గజం తాాజాగా ఐక్యూ 13 మెుబైల్ ను అదిరే ఫీచర్స్ తో తీసుకొచ్చేసింది. గత ఏడాది ఐక్యూ Z9 టర్బో ను లాంఛ్ చేసింది. అదిరే ఫీచర్స్ తో వచ్చేసిన ఈ మెుబైల్ ధర కూడా అందుబాటులోనే ఉంది. ఇప్పుడు ఈ Z సిరీస్ లో మరో కొత్త మెుబైల్ రాబోతుంది. తాజాగా ఈ మెుబైల్ ఫీచర్స్ లాంఛ్ అయ్యి టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
2025 ద్వితీయార్థంలో చైనీస్ మార్కెట్‌లోకి iQOO Z10 Turbo వచ్చేస్తుంది. ఈ మెుబైల్ ఫీచర్స్ Weibo తన పోస్ట్ లో తెలిపింది. 7500mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మునుపటి లీక్స్ లో ర్యామ్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్ ఫీచర్స్ ఇప్పటికే వెల్లడయ్యాయి.
iQOO Z10 Turbo Pro Features –
iQOO Z10 Turbo స్మార్ట్‌ఫోన్ Adreno 825 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ తో Qualcomm Snapdragon 8s ఎలైట్ ప్రాసెసర్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో హై వేరియంట్ 12GB RAM తో పాటు 256GB స్టోరేజ్ ఉండనుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా OriginOS 5 తో పనిచేస్తుంది.
ఈ గ్యాడ్జెట్ మోడల్ నంబర్ V2453Aతో టిప్ స్టర్ లో రిజిస్టర్ అయ్యింది. ఇక ఈ సిరీస్ iQOO Z10 Turbo పేరుతో వచ్చేస్తుంది. బేస్ మోడల్ MediaTek Dimensity 8400 ప్రాసెసర్‌తో 12GB RAM మెమరీతో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఐక్యూ తీసుకొచ్చిన ముందు మెుబైల్స్ విషయానికి వస్తే.. iQOO Z9 Turbo ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఈ మెుబైల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్లు ది బెస్ట్ గా వచ్చేశాయి. ఈ ఫోన్ 6.78 ఇంచుల FHD+ AMOLED డిస్‌ప్లేతో వచ్చేసింది. రిఫ్రెష్ రేట్ 120Hz, ఇది స్మూత్‌గా స్క్రోలింగ్, గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
iQOO Z9 Turboలో 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరాతో 13MP ultra-wide, 2MP depth సెన్సార్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 5000mAh ఉంటుంది. ఇది 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 5G కనెక్టివిటీ, Wi-Fi 6, బ్లూటూత్ 5.3 వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్స్ తో వచ్చేసింది. ఇక డిజైన్ విషయంలో ఇది స్టైలిష్‌గా వచ్చేసింది.
ALSO READ : దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన యాపిల్.. ఐఫోన్ SE4, ఐపాడ్ 11 ప్రాసెసర్ కన్ఫామ్