BigTV English
Advertisement

SSMB29: రాజమౌళి చేతికి మహేష్ పాస్ పోర్ట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మీమ్స్.. అసలు నవ్వకుండా ఉండలేరు

SSMB29: రాజమౌళి చేతికి మహేష్ పాస్ పోర్ట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మీమ్స్.. అసలు నవ్వకుండా ఉండలేరు

SSMB29: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. అని  ఆనందంలో ఉబ్బితబ్బిబైపోతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఇండస్ట్రీ కాదు కాదు.. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా SSMB29. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.  ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి ఈ సినిమాను అనౌన్స్ చేశాడు. అప్పటి నుంచి స్క్రిప్ట్ ను రెడీ చేయడానికే బాగా కష్టపడ్డాడు.  దాదాపు రెండేళ్లు  ఈ స్క్రిప్ట్ ను రెడీ చేశాడు.


అందరి హీరోలు వేరు.. మహేష్ వేరు. మహేష్ కు కాబట్టే  కథ రాయడానికి ఇంత సమయం పట్టిందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇలా ఈ సినిమాపై హైప్ రోజురోజుకు పెరుగుతూ వచ్చిందే కానీ.. ఎక్కడ తగ్గింది లేదు.  ఒకపక్క జక్కన్న కథం యూ సిద్ధం చేస్తుండగా.. ఇంకోపక్క మహేష్ తన లుక్ ను రెడీ చేయడం మొదలు పెట్టాడు. పొడవైన జుట్టు..  గడ్డం తో హాలీవుడ్ హీరోలా రెడీ అయ్యాడు. ఇప్పటివరకు ఈ సినిమా గురించిన ఒక్క అప్డేట్ ను కూడా మేకర్స్ అధికారికంగా తెలిపింది లేదు.

Gautham Menon: ఫాహద్ ఫాజిల్ చాలా గ్రేట్, ఏ తమిళ హీరో అలా చేయలేడు.. గౌతమ్ మీనన్ ఓపెన్ కామెంట్స్


తాజాగా   SSMB29 షూటింగ్  మొదలైనట్లు రాజమౌళి చెప్పకనే చెప్పుకొచ్చాడు. మహేష్ పాస్ పోర్ట్ ను సీజ్ చేసినట్లు ఒకవీడియోను షేర్ చేశాడు. ఇక దీంతో నెట్టింట మీమర్స్ పండగ చేసుకుంటున్నారు. షూటింగ్ మొదలైంది అంటే.. మహేష్ కు వెకేషన్స్ లేనట్టే అంటూ మీమ్స్ తో ఆడేసుకుంటున్నారు. మహేష్ కు తెల్సినవి రెండే రెండు. ఒకటి సినిమా.. రెండు కుటుంబం. సినిమాను అయినా పక్కన పెడతాడేమో కానీ, కుటుంబంతో గడిపే సమయాన్ని మాత్రం  ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ అవ్వడు.

ఇక ఎలాగూ జక్కన్నతో సినిమా అంటే ఎన్నేళ్లు అవుతుందో తెలియదు అనుకున్నాడో ఏమో.. గుంటూరు కారం సినిమా ఫినిష్ అయిన నెక్స్ట్ డే నుంచే కుటుంబంతో ఎంత సమయం గడపాలో  గడిపేశాడు. ఇక  ఇప్పుడు షూటింగ్ కు వేళాయరా  అని జక్కన్న పిలిచేశాడు. దీంతో ఇక ఆ వెకేషన్స్ బంద్ అయ్యినట్లే. ఈ కాన్సెప్ట్ తో మీమర్స్ .. తమ క్రియేటివిటీని ఉపయోగించి మీమ్స్ చేసి ప్రేక్షకులను నవ్విస్తున్నారు. మరి ఆ మీమ్స్ ఏంటో మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×