Alien Life Discovered: 120 కాంతి సంవత్సరాల దూరంలో జీవం ఉందంటారా? ఇదేమైనా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుందా? కానీ ఇది నిజమే కావొచ్చని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అందులోనూ, ఈ అద్భుత అన్వేషణ వెనక ఉన్నది మన భారతీయ మూలాలున్న ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ నేతృత్వం కావడం గర్వించదగ్గ విషయం. వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్సోప్లానెట్‌పై జీవం ఉన్నట్లు 99.7 శాతం ఆధారాలు దొరికాయట. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో మనిషి అక్కడికి ప్రయాణించే రోజులు చాలా దూరంలో లేవేమే అని పిస్తుంది. శాస్త్రీయ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ విషయం గురించి అనేక మంది ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఇది సైన్స్, ఇది నిజం!
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తల బృందం, నిక్కు మధుసూదన్ ఆధ్వర్యంలో, K2-18b అనే ఒక సుదూర గ్రహంపై జీవం ఉండొచ్చన్న విశేషంగా ఆసక్తికరమైన ఆధారాలను కనుగొన్నారు. ఈ గ్రహం భూమికి దాదాపు 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అర్థం అయ్యేలా చెప్పాలంటే, మనం ఇప్పుడు ఇక్కడ ఏదైనా సందేశం పంపితే, అక్కడికి వెళ్లేందుకు 120 సంవత్సరాలు పడుతుంది.
వాతావరణంలో జీవం సూచనలు!
అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు, డైమిథైల్ సల్ఫైడ్ (DMS), డైమిథైల్ డైసల్ఫైడ్ (DADS) అనే అణువులను గుర్తించారు. ఈ రెండు అణువులు భూమిపై సూక్ష్మజీవులు. ముఖ్యంగా సముద్ర ఆల్గే ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతాయి. అంటే, ఈ అణువులు అక్కడ కనిపించడమే ఆ గ్రహంపై జీవం ఉండొచ్చన్న సాక్ష్యానికి బలాన్ని ఇస్తున్నాయి.
భూమి కంటే 2.5 రెట్లు పెద్దది
గ్రహం పేరు K2-18b – ఇది ఎలాంటిదంటే…భూమి కంటే 2.5 రెట్లు పెద్దది. పటిష్టమైన వాతావరణాన్ని కల్గి ఉంది. హైడ్రోజన్ అధికంగా ఉండే వాతావరణం, నీటి సముద్రాలు ఉండే అవకాశముంది. తేమగా, వెచ్చగా ఉండే వాతావరణం, భూమికంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఉండే ఛాన్సుంది. ఈ లక్షణాల వల్లే శాస్త్రవేత్తలు దీనిని “హైషియన్ వరల్డ్” అంటున్నారు. హైషియన్ అంటే హైడ్రోజన్ + ఓషియన్ కలయికతో వచ్చిన పదం.
Read Also: Budget Air Coolers: రూ.5000కే వేసవిలో చల్లదనం..టాప్ 4 …
ఏ టెలిస్కోప్ ఉపయోగించారు?
ఈ సూపర్ శాస్త్రీయ అన్వేషణకు James Webb Space Telescope (JWST) సహకారం ప్రధాన కారణం. ఇది 2021లో నాసా పంపించిన టెలిస్కోప్. మన కళ్లకే కనిపించని ధ్వనులు, కాంతులను గుర్తించగలిగే అత్యాధునిక పరికరం ఇది. JWST నుంచి వచ్చిన స్పెక్ట్రోస్కోపిక్ డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు, అక్కడ వాయుగోళంలో డైమిథైల్ మూలాలు ఉన్నట్టు నిర్ధారించారు.
ఇది ఎందుకు విప్లవాత్మకం?
ఈ పరిశోధనపై ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ మాట్లాడుతూ “ఈ సంకేతాలు జీవం ఉనికిని మద్దతు ఇస్తున్నాయనడం కంటే గొప్ప విషయం. ఎందుకంటే, భూమిపై మాత్రమే వీటి జీవం వల్ల వస్తాయన్న సాక్ష్యం ఉంది. వీటి రూపకల్పనకు జీవం తప్ప మరే మార్గమూ లేదనే పద్ధతి శాస్త్రీయంగా అందుబాటులో లేదు. ఈ సంకేతాలు యాదృచ్ఛికంగా లభించే అవకాశం కేవలం 0.3 శాతం మాత్రమే. అంటే 99.7 శాతం సాక్ష్యం మాత్రమే.
భవిష్యత్తులో ఏమవుతుంది?
ఇప్పటి వరకు మనం గ్రహాంతరవాసులు ఉన్నారు అనే విషయాన్ని సినిమాల్లో చూసాం, కథల్లో చదివాం. కానీ ఇప్పుడు మన శాస్త్రవేత్తలు దాన్ని నిజంగా సాధించే దశలోకి వచ్చారు. ఈ గ్రహం పై మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. మానవ చరిత్రలోనే ఇది ఓ గొప్ప మలుపు కావొచ్చు– “Are we alone in the universe?” అన్న ప్రశ్నకు సమాధానం దొరక్కపోయినా, ఈ దారిలో ఓ మెట్టు ఎక్కినట్టే అనిపిస్తుంది.