BigTV English

OTT Movie : మందలించిందని టీచర్ కి గన్ గురిపెట్టే స్టూడెంట్ … మహిళలు మిస్ కాకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : మందలించిందని టీచర్ కి గన్ గురిపెట్టే స్టూడెంట్ … మహిళలు మిస్ కాకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి. వీటిని ఎంటర్టైన్మెంట్ గా కాకుండా, కాస్త సమాజంలో మార్పు కోసం చూడటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మంచి కంటే, చెడే సమాజంలో ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక టీచర్ గన్ లైసెన్స్ కోసం కోర్టుకు వెళుతుంది. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు, తుపాకి సమాధానం గా భావిస్తుంది.  ఈ  స్టోరీలో ఒక మహిళ సమాజంలో ఎదుర్కునే పరిస్తితిని చూపిస్తారు.  ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే….


ఆహా (aha) లో

ఈ తమిళ డ్రామా మూవీ పేరు ‘లైసెన్స్’ (License). 2023 లో విడుదలైన ఈ మహిళా సాధికారిత సినిమాకు, గణపతి బాలమురుగన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కథ ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన భారతి చుట్టూ తిరుగుతుంది. ఆమె చిన్నారులపై లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తుంది. ఈ సినిమా నవంబర్ 3, 2023న విడుదలైంది. ప్రస్తుతం ఆహా (aha) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

భారతి చిన్న వయసు నుండి సమాజానికి మేలు చేయాలి అనుకునే మహిళ. ఆమె తండ్రి ఒక పోలీస్ అధికారిగా ఉంటాడు. ఒకరోజు స్కూల్ టీచర్ కి ఒక అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తుంది భారతి . అయితే ఆ టీచర్ భారతినే తిడుతుంది. దీంతో తన తండ్రి గన్ తీసుకొచ్చి టీచర్ కి గురిపెడుతుంది. ఇక  తన తండ్రి మాటలను పట్టించుకుని పోలీస్ అవుదామనుకుని, టీచర్ అవుతుంది. టీచర్ అయితే పోలీస్ కన్నా గొప్పగా,  సమాజానికి మంచి చెయ్యచ్చు అనినమ్ముతుంది. ఇక సమాజంలో తప్పు చేసేవారిని నిర్భయంగా ఎదిరించే, ధైర్యవంతమైన మహిళగా ఆమె పెరుగుతుంది. ఎందుకనో తన తండ్రితో ఆమె మాట్లాడకుండా, కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఒకసారి తన స్టూడెంట్ అఘాయిత్యానికి గురి అవుతుంది. అదిచూసి తట్టుకోలేక చాలా బాధపడుతుంది.  లైంగిక వేధింపుల నుండి మహిళలు, పిల్లలను రక్షించడానికి తుపాకీ లైసెన్స్ తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

అయితే ఆమె దరఖాస్తును రాష్ట్ర పోలీసులు తిరస్కరిస్తారు. దీని వల్ల ఏమైనా సమస్యలు వస్తాయని అనుకుంటారు. దీంతో ఆమె డిఫెన్స్ లాయర్ గా ఉండే తన సోదరుడు భరత్ ను కలుస్తుంది. అతని సహాయంతో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) ను దాఖలు చేస్తుంది. ఆ తరువాత కేసు కోర్టుకు వెళుతుంది. ఈ క్రమంలో ఆమె మీడియా, దీన్ని వ్యతిరేకించే వాళ్ళనుండి వేధింపులను ఎదుర్కొంటుంది. చివరికి భారతికి గన్ లైసెన్స్ ను కోర్ట్ అనుమతి ఇస్తుందా ? ఆమె న్యాయ పోరాటంలో ఎదుర్కొనే సవాళ్ళు ఏమిటి ? ఆమె తండ్రితో ఉన్న విభేదాల వెనుక ఉన్న కారణాలు ఏంటి ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : సైకోలకు చిక్కే ఒంటరి అమ్మాయి… రాత్రంతా నరకం … అదిరిపోయే ట్విస్ట్ లతో హోరెత్తించే సస్పెన్స్ థ్రిల్లర్

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×