Amazfit BIP 5 Unity Smart Watch for Health: టెక్నాలజీ కాలంలో స్మార్ట్‌వాచ్ వాడకం అధికమైంది. ఈ స్మార్ట్ వాచ్‌లు టైమ్‌ను చూపడమే కాకుండా హెల్త్‌కి సంబంధించి ఫీచర్లను కూడా అందిస్తాయి. అంతేకాకుండా స్మార్ట్‌వాచ్‌లతో కాల్స్ మాట్లాడొచ్చు. మెసేజెస్ చూడొచ్చు, రిప్లై ఇవొచ్చు. ఈ క్రమంలోనే అమాజ్‌ఫిట్ కొత్త అమాజ్‌ఫిట్ బిఐపి 5 యూనిటీ స్మార్ట్‌వాచ్‌ను మే 19 దేశంలో విడుదల చేసింది. హెల్త్ పట్ల స్పెషల్ కేర్ తీసుకొనే వ్యక్తులకు ఈ స్మార్ట్ వాచ్ చాలా ఉపయోగంగా ఉంటుంది.
Amazfit Bip 5 Unity 1.91-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆరోగ్య పరంగా Zepp OS 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇది అనేక చిన్న యాప్‌లు, గేమ్‌లు, వాచ్ ఫేస్‌లతో ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య నివేదికలు అందించడానికి స్మార్ట్‌వాచ్ AI- పవర్డ్ పర్సనల్ వెల్‌నెస్ అసిస్టెంట్‌ని ఉపయోగిస్తుంది. 120 స్పోర్ట్స్ మోడ్‌లను ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి BIP 5 యూనిటీ స్మార్ట్ రికగ్నిషన్ ఫీచర్‌ని కలిగి ఉందని Amazfit తెలిపింది. వాచ్ గ్రే, చార్‌కోల్, పింక్ కలర్ ఆప్షన్‌లలో రూ. 6,999కి తీసుకొచ్చారు. అమాజ్‌ఫిట్ ఇండియా, అమెజాన్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.
Amazfit BIP 5 Unity స్మార్ట్‌వాచ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్ సిలికాన్ స్ట్రాప్‌తో వస్తుంది. స్మార్ట్ వాచ్ 10mm మందం ఉంటుంది. దాని బరువు 25 గ్రాములు. ఇది 260 ppi పిక్సెల్ డెన్సిటీతో కూడిన 1.91-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ Zepp OS 3.0తో వస్తున్న BIP 5 యూనిటీ వినియోగదారులు అనేక చిన్న యాప్‌లు, గేమ్‌లు, వాచ్ ఫేస్‌లను పొందుతారు. స్మార్ట్‌వాచ్‌లో AI- పవర్డ్ పర్సనల్ వెల్‌నెస్ అసిస్టెంట్, Zepp Aura ఉంది. ఇది వ్యక్తిగత ఆరోగ్య నివేదికలు, ఓదార్పు సౌండ్‌స్కేప్‌లు అందిస్తుంది.
Also Read: రూ.16 వేలకే రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్లు ఎక్స్‌పెక్ట్ చేసుండరు!
Amazfit BIP 5 Unity స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ ఫోన్ కాల్‌లకు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్ వాచ్ IP68 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది వివిధ వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఖచ్చితమైన ఆరోగ్య ట్రాకింగ్ కోసం యాక్సిలరోమీటర్, హార్ట్ రేట్ సెన్సార్, 3-యాక్సిస్ మోషన్ సెన్సార్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంటుంది.
Amazfit BIP 5 Unity స్మార్ట్‌వాచ్ స్మార్ట్ రికగ్నిషన్ ఫీచర్‌లు, 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో, BIP 5 యూనిటీ ఫిట్‌నెస్ నియమాలకు అనుగుణంగా ఖచ్చితమైన ట్రాకింగ్‌ను నిర్ధారిస్తుంది. వినియోగదారులు 24-గంటల హార్ట్ రేట్, SpO₂, ఒత్తిడి పర్యవేక్షణ లక్షణాలతో వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించగలరు.
Also Read: ప్రపంచంలోనే అతి చిన్న ఫ్లిప్ ఫోన్ లాంచ్.. దీని స్పెషల్ ఫీచర్స్ చూస్తే ఆశ్యర్యపోతారు!
Amazfit BIP 5 Unity స్మార్ట్‌వాచ్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో క్యాలెండర్ రిమైండర్, కాల్ నోటిఫికేషన్, సెడెంటరీ రిమైండర్, స్మార్ట్‌ఫోన్ యాప్‌ల నుండి నోటిఫికేషన్‌లు ఉంటాయి. స్మార్ట్ వాచ్ ఛార్జింగ్ సమయం కేవలం 120 నిమిషాలు. ఇది 12 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.