Multani Mitti Benefits for Sin: ముల్తానీ మట్టి గురించి దాదాపు తెలియని వారుండరు. ముల్తానీ మట్టిని సబ్బులు, కాస్మెటిక్ ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ముల్తానీ మట్టి వల్ల చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది.
ముల్తానీ మట్టి చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. వేసవిలో శరీరం చల్లగా ఉంచడానికి ముల్తానీ మట్టి ఎంతో ఉపయోగపడుతుంది. పురాతన కాలం నుంచి దీనిని ఉపయోగిస్తున్నారు. కాలక్రమేనా ముల్తానీ మట్టి సౌందర్య ఉత్పత్తుల్లో ఒక ప్రత్యేక పదార్థంగా మారింది. ముల్తానీ మట్టిలో సిలికా ఆక్సైడ్, అల్యూమినియం మూలకాలు ఉంటాయి. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. అంతేకాకుండా అందాన్ని పెంచుతుంది. ముల్తానీ మట్టి ద్వారా అనేక అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
జిడ్డును గ్రహిస్తుంది..
ముల్తానీ మట్టికి సాధారణంగా పీల్చే గుణం ఎక్కువగా ఉంటుంది. ముల్తానీ మట్టిని ముఖానికి రాయగానే ఇది చర్మంలో ఉన్న నూనెలను పూర్తిగా పీల్చేస్తుంది. అంతే కాకుండా చర్మంలోని పీహెచ్ స్థాయిని ఇది సమతుల్యం చేస్తుంది. అందుకే ఎక్కువ మంది దీనిని ఫేస్ ప్యాక్ లాగా వినియోగిస్తుంటారు. చర్మంపై మచ్చలను తొలగించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read: Red Rice Benefits: తరచూ తెల్ల బియ్యమే తింటున్నారా.. ఒక్కసారి ఈ ఎర్ర బియ్యం ట్రై చేసి చూడండి..
మొటిమలు మాయం..
ముల్తానీ మట్టి మొటిమలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. చర్మంపై నూనెల వల్ల మొటిమలు ఏర్పడతాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ముల్తానీ మట్టి ముఖానికి రాసినట్లయితే జిడ్డు మాయమవుతుంది. మొటిమల వల్ల ముఖంపై ఏర్పడే గుంటలను కూడా ఇది తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
చర్మానికి మంచి రంగు ఇస్తుంది..
చర్మం మెరవాలంటే ముల్తానీ మట్టి తప్పక రాయాల్సిందే. దీనిని ముఖానికి అప్లై చేయడం. ముఖం రంగు మారుతుంది అంతే కాకుండా డార్క్ స్కిన్ తో బాధపడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తిగా తెల్లగా మార్చుకునా.. చర్మాన్ని కాంతి వంతంగా కనిపించడం కోసం సహకరిస్తుంది. చర్మంపై ఉండే మృతకణాలను సైతం తొలగిస్తుంది.
Also Read: పిగ్మెంటేషన్ తో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే..
మచ్చలను తగ్గిస్తుంది..
ముల్తానీ మట్టి కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు, ముఖంపై ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా ముఖంపై చెమట మలినాలు లేకుండా చేస్తుంది. చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ తొలగించి మొటిమలకు చికిత్స చేస్తుంది. దురద వాపు వల్ల కలిగే చికాకును కూడా ఇది తగ్గిస్తుంది.
ముడతలను తొలగిస్తుంది..
ముల్తానీ మట్టి ముఖంపై రాయడం వల్ల వృద్ధాప్య లక్షణాలు తొలగిపోతాయి. ఇది చర్మం కింద రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. తద్వారా యవ్వనంగా కనిపించవచ్చు. ముల్తానీ మట్టి ప్రభావంతమైన యాంటీ మైక్రోబయాల్ కూడా.. ఇది చర్మంపై గాయాలను వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. చర్మంపై మృతకణాలను తొలగించి జీవం నింపడంలో సహాయపడుతుంది.
(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.)