BigTV English

Virat Kohli Emotional Moments: ఎట్టకేలకు ప్లే ఆఫ్ కి ఆర్సీబీ.. కొహ్లీ ఉద్వేగభరిత క్షణాలు!

Virat Kohli Emotional Moments: ఎట్టకేలకు ప్లే ఆఫ్ కి ఆర్సీబీ.. కొహ్లీ ఉద్వేగభరిత క్షణాలు!

Virat got Emotional after RCB reach in Playoff: ఆర్సీబీ ఎట్టకేలకు ప్లే ఆఫ్ కి చేరింది. ఐపీఎల్ ప్రారంభంలో వరుసగా ఓడిపోతూ అట్టడుగు స్థానానికి పడిపోయిన ఆర్సీబీ, మళ్లీ వేగంగా పుంజుకుంది. అంత స్పీడుగా కమ్ బ్యాక్ కావడం ఆర్సీబీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ . మొదట 7 మ్యాచ్ లు ఓడిపోయి…తిరిగి అక్కడ నుంచి వరుసగా 6 మ్యాచ్ లు గెలవడం ఆషామాషీ కాదంటున్నారు.


16 ఏళ్ల నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న కొహ్లీ ఒక్కసారి కూడా ట్రోఫీ తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు 708 పరుగులతో తనే టాపర్ గా ఉన్నాడు. ఈసారైనా కప్ కొట్టాలనే కసి విరాట్ కొహ్లీలో కనిపించింది. అందుకే మ్యాచ్ గెలిచిన తర్వాత కొహ్లీ ఒక్కసారి ఉద్వేగభరితుడయ్యాడు. కళ్ల వెంట ఆనందభాష్పాలు వచ్చాయి. ఆ దుఖాన్ని ఆపుకోలేక చాలా అవస్థ పడ్డాడు.

ఇప్పుడు గెలిచింది కాబట్టి ఇలా బయటపడ్డాడు. మరి ప్రారంభంలో అన్ని మ్యాచ్ లు ఓడిపోతున్నప్పుడు తను మనసులో పడిన వేదన ఎంత ఉందోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొదట్లో ఆర్సీబీ ఆడిన ఆట తీరు చూసి అభిమానులు చాలామంది ఫాలో కావడమే మానేశారు. వీళ్లెప్పటికి మారరు..అని దుయ్యబట్టారు. చాలామంది తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశారు.


Also Read: ‘ఈ సాలా కప్ నమ్ దే’..హోరాహోరీ పోరులో ఆర్సీబీ గెలుపు

అవమానాలన్నింటిని దిగమింగుకుని, మళ్లీ రీఛార్జ్ అయ్యి, లోపం ఎక్కడుందో కనిపెట్టి, బౌలింగు టీమ్ ని మార్పించి, బ్యాటింగ్ ఆర్డర్ ని మార్చి, మళ్లీ లైనులో పెట్టారు. స్పిన్నర్ స్వప్నిల్, పేసర్ యశ్ దయాళ్ ఇద్దరి రాకతో బౌలింగు పటిష్టంగా మారింది.

ప్రత్యర్థులు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. డెత్ ఓవర్లలో వికెట్లు తీయడం, పవర్ ప్లేలో పరుగులు నియంత్రించడం ఇవన్నీ జరగడంతో బ్యాటర్లు తమ బ్యాట్లకు పని చెప్పారు. మొత్తానికి అలా దిగ్విజయంగా ఏడు విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు.

మరిలాగే ముందుకు సాగి ఆర్సీబీ ట్రోఫీ సాధించాలని, కొహ్లీకి ఘనమైన కానుకను జట్టు సభ్యులు అందించాలని మనం కూడా కోరుకుందాం.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×