E-Paper
Advertisement

అప్పుల నుంచి త్వరగా బయటపడాలనుకుంటున్నారా? ఈ 7 తెలివైన మార్గాలను వెంటనే ప్రయత్నించండి!

అప్పుల నుంచి త్వరగా బయటపడాలనుకుంటున్నారా? ఈ 7 తెలివైన మార్గాలను వెంటనే ప్రయత్నించండి!
Advertisement

Smart ways to clear loans: ప్రతి నెలా జీతం బ్యాంకులో పడగానే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, వడ్డీలకే సగానికి పైగా డబ్బు ఖర్చయిపోతోందా? ఒక అప్పు తీర్చడానికి మరో కొత్త లోన్ తీసుకుంటూ అప్పుల ఉచ్చులో చిక్కుకుపోయామని ఆందోళన చెందుతున్నారా? సరైన ప్లానింగ్ లేకపోతే.. ఈ ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. అయితే.. కంగారు పడాల్సిన అవసరం లేదు కొన్ని తెలివైన ఆర్థిక మార్గాలను అనుసరిస్తే.. ఎంతటి అప్పుల ఊబి నుంచైనా త్వరగా బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.

1. అప్పుల లిస్ట్:

అప్పుల నుంచి బయటపడాలంటే అసలు మనం ఎంత మందికి, ఎంత మొత్తం బాకీ ఉన్నామో స్పష్టంగా తెలియాలి. చాలా మంది భయంతో ..తమ మొత్తం అప్పులను లెక్కేసుకోరు. ఒక పేపర్ లేదా ఎక్సెల్ షీట్ తీసుకొని మీకున్న పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఇతర ప్రైవేట్ అప్పుల వివరాలను రాసుకోండి. ప్రతి అప్పుకు ఎంత వడ్డీ పడుతోంది, నెల వారీ ఈఎంఐ ఎంత అనేది పక్కన నోట్ చేసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది.

2. అధిక వడ్డీ ఉన్న అప్పులు:

Advertisement

అప్పులు తీర్చే విషయంలో.. ఆర్థిక నిపుణులు సూచించే పద్ధతి ‘డెట్ అవలాంచ్’ విధానం. అంటే అన్ని అప్పులలోకెల్లా దేనికి ఎక్కువ వడ్డీ రేటు ఉందో దాన్ని ముందుగా తీర్చేయాలి. సాధారణంగా క్రెడిట్ కార్డ్ బకాయిలపై ఏడాదికి 36 నుంచి 42 శాతం వరకు భారీ వడ్డీ పడుతుంది. మిగతా లోన్లకు కనీస ఈఎంఐలు కడుతూ, మిగులు డబ్బునంతా అధిక వడ్డీ ఉన్న అప్పుపై వేస్తే అసలు భారం వేగంగా తగ్గుతుంది.

3. డెట్ కన్సాలిడేషన్ ఆప్షన్ :

మీరు వేర్వేరు బ్యాంకులు లేదా యాప్స్ నుంచి నాలుగైదు చిన్నచిన్న లోన్లు తీసుకుని ఉంటే.. వాటిని నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ‘డెట్ కన్సాలిడేషన్’ ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ వడ్డీకి ఒకే పెద్ద పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ తీసుకుని, ఆ డబ్బుతో అధిక వడ్డీ ఉన్న పాత అప్పులన్నింటినీ ఒకేసారి క్లోజ్ చేయాలి. దీని వల్ల నెలనెలా ఒకే ఈఎంఐ కట్టే వెసులుబాటు కలగడంతో పాటు వడ్డీ ఖర్చు కూడా తగ్గుతుంది.

4. అనవసర ఖర్చులు:

Advertisement

అప్పులు తీరే వరకు మీ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ప్రతి నెలా మీ ఆదాయం ఎంత, అత్యవసర ఖర్చులు ఎన్ని అనేది లెక్క వేసుకుని కఠినమైన బడ్జెట్ రూపొందించుకోండి. బయట ఫుడ్ ఆర్డర్ చేయడం, అనవసరపు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే షాపింగ్‌లను పూర్తిగా ఆపేయండి. ఇలా మిగిల్చిన ప్రతి రూపాయిని అప్పులు తీర్చడానికే కేటాయించాలి.

Also Read: నథింగ్ బడ్స్‌కు చెక్ పెట్టేలా JBL కొత్త స్ట్రాటజీ..ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో కొత్త మోడల్ లాంచ్!

5. కొత్త అప్పులు:

ఒక లోన్ కట్టడానికి మరో ఇన్‌స్టంట్ లోన్ యాప్ లేదా క్రెడిట్ కార్డ్ వాడటం అంటే అప్పుల ఊబిలో మరింత లోతుగా కూరుకుపోవడమే. అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లులో కేవలం ‘మినిమమ్ డ్యూ’ మాత్రమే కట్టే అలవాటును మానుకోండి. మినిమమ్ డ్యూ కడితే మిగిలిన మొత్తంపై విపరీతమైన వడ్డీ పడుతూనే ఉంటుంది. అప్పులు తీరే వరకు క్రెడిట్ కార్డులను పక్కన పెట్టేయడం బెస్ట్.

6. అదనపు ఆదాయ మార్గాలు:

కేవలం ఒకే జీతంతో అప్పులు తీర్చడం ఆలస్యమవుతుంటే.. ఖాళీ సమయాల్లో అదనపు ఆదాయం సంపాదించే మార్గాలను చూడండి. మీకున్న నైపుణ్యాలకు తగ్గట్టుగా.. వీకెండ్స్‌లో ఫ్రీలాన్సింగ్ చేయడం, ట్యూషన్లు చెప్పడం లేదా పార్ట్-టైమ్ ప్రాజెక్టులు చేయడం ద్వారా వచ్చే అదనపు డబ్బును నేరుగా లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి ఉపయోగించండి. అలాగే ఇంట్లో వాడకుండా ఉన్న విలువైన వస్తువులను అమ్మడం ద్వారా కూడా కొంత డబ్బు సమకూర్చుకోవచ్చు.

Related News

చలికాలంలో మంచి ఆదాయం కావాలా? రూ. 1 లక్ష లోపు పెట్టుబడితో.. 5 లాభదాయక వ్యాపారాలు!

బ్యాంకుల్లో మనకు తెలియకుండానే కట్ అయ్యే ఛార్జీలు.. వాటిని ఎలా ఆపాలి?

కేవలం ఆరేళ్లు.. లక్ష పెడితే 64 లక్షలు అయ్యింది, ధనవంతులైన చిన్న ఇన్వెస్టర్లు

ఆర్‌బీఐ కీలక అడుగు.. విదేశాల నుంచి 165 టన్నుల పసిడి రాక, దేశానికి మరింత బలం

టెక్కీలకు ఐబీఎం బిగ్ షాక్.. యూఎస్ వీసా స్పాన్సర్‌షిప్ బంద్! డెడ్‌లైన్ కూడా ఇచ్చేసింది

ఈక్విటీ, బంగారం, డెట్‌… 10 లక్షల పెట్టుబడి ఎక్కడ పెట్టాలి ?

PPFపై లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా ? 5 సంవత్సరాల పాటు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత తీసుకోవచ్చు ?

Big Stories

Advertisement
×