E-Paper
Advertisement

శాంసంగ్ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్‌లు..అస్సలు మిస్సవ్వొద్దు

శాంసంగ్ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్‌లు..అస్సలు మిస్సవ్వొద్దు
Advertisement

Samsung tablet price drop 2026: టెక్నాలజీ మారుతున్న కొద్దీ స్మార్ట్‌ ఫోన్ల స్థానంలో..పెద్ద స్క్రీన్ గల ట్యాబ్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. స్టూడెంట్స్ ఆన్‌లైన్ క్లాసుల కోసం, ఉద్యోగస్తులు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం,ఎంటర్ టైన్మెంట్ ఎక్కువగా ట్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. మార్కెట్లో.. అనేక బ్రాండ్లు ఉన్నప్పటికీ, శాంసంగ్ అందించే ఫీచర్లు, డిస్‌ప్లే క్వాలిటీ, క్వాలిటీ వేరే లెవెల్‌లో ఉంటాయి. ప్రస్తుతం అమెజాన్ దీపావళి సేల్ సందర్భంగా.. శాంసంగ్ టాబ్లెట్లపై ఊహించని విధంగా భారీ ధర తగ్గింపులు ప్రకటించారు. మార్కెట్లో ఉన్న బెస్ట్ శాంసంగ్ ట్యాబ్‌ల వివరాలు, వాటి ఆఫర్ ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.Samsung Galaxy Tab S10 Lite:

శాంసంగ్ లైనప్‌లో ఫేమస్ అయిన మోడల్స్‌లో ఇది ఒకటి. దీని ఒరిజినల్ ధర రూ.57,999 ఉండగా..అమెజాన్ దీపావళి సేల్.. ప్రత్యేక ఆఫర్ కింద ఇది కేవలం రూ.30,999 ధరకే లభిస్తోంది.ఇది 10.9 ఇంచుల అద్భుతమైన డిస్‌ప్లే, 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీంట్లో ఉన్న 8000mAh బ్యాటరీ రోజంతా.. ఎలాంటి టెన్షన్ లేకుండా పని చేస్తుంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్‌తో పని చేసే.. ఈ ట్యాబ్ విద్యార్థులకు పర్ఫెక్ట్ ఛాయిస్.

2.Samsung Galaxy Tab A11+ :

Advertisement

మీరు తక్కువ బడ్జెట్‌లో.. మల్టీ మీడియా, రోజు వారీ అవసరాల కోసం ఒక మంచి ట్యాబ్ వెతుకుతుంటే.. ఇది చక్కటి ఆప్షన్. అమెజాన్ సేల్‌లో.. దీనిని కేవలం రూ.21,999ధరతో సొంతం చేసుకోవచ్చు. ఇది 11 ఇంచుల ఎల్సీడీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. సినిమాలు చూసే వారికి, పాటలు వినే వారికి ఇది అద్భుతమైన సౌండ్ ఫీల్ ఇస్తుంది.అంతేకాకుండా..దీని స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఏకంగా 2టీబీ వరకు పెంచుకోవచ్చు.

3.శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిరీస్ ప్రీమియం మోడల్స్:

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిరీస్ ట్యాబ్లెట్లు హై-ఎండ్ పెర్ఫార్మెన్స్ కోరు కునే.. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసారు. గేమింగ్, హెవీ గ్రాఫిక్స్ డిజైనింగ్ ,ప్రొఫెషనల్స్ కోసం ఇవి నెంబర్ వన్ స్థానంలో ఉంటాయి. అమెజాన్ దీపావళి సేల్‌లో.. ఈ ప్రీమియం మోడల్స్‌పై దాదాపు 30% నుంచి 40% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ఉపయోగించుకుంటే.. వీటిని మరింత తక్కువ ధరకే పొందొచ్చు.

4. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A సిరీస్ బడ్జెట్ ఎడిషన్స్:

Advertisement

ఎక్కువ బడ్జెట్ పెట్టలేము.. అనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కోసం శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A సిరీస్ కింద వచ్చే ఇతర వేరియంట్లు అమెజాన్ సేల్‌లో.. తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ట్యాబ్ సాధారణ బ్రౌజింగ్, పిల్లల ఆన్‌లైన్ చదువులు, ఈ-బుక్స్ చదవడానికి చాలా బాగుంటాయి. సేల్ సమయంలో..వీటిపై ప్రత్యేక కూపన్ డిస్కౌంట్లు కూడా వర్తిస్తున్నాయి.

Also Read: రూ.800లోపే గేమింగ్ ఇయర్‌బడ్స్..ఫీచర్లు మాములుగా లేవు!

5. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్-ఫ్యాన్ ఎడిషన్ :

ప్రీమియం ఫీచర్లు తక్కువ ధరలో.. కావాలనుకునే వారికి ఎఫ్ఈ సిరీస్ ఎప్పుడూ బెస్ట్. అమెజాన్ దీపావళి సేల్ సందర్భంగా..ఈ ట్యాబ్లెట్లపై భారీ ప్రైస్ కట్ ప్రకటించారు. ఎస్-పెన్ సపోర్ట్ లభించడం దీని ప్రధాన విశేషం. నోట్స్ రాసుకోవడానికి, డ్రాయింగ్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.

అమెజాన్ సేల్‌లో లాభాలు:

ఈ దీపావళికి కేవలం ప్రైస్ డ్రాప్ మాత్రమే కాకుండా.. హెచ్‌డీఎఫ్‌సీ లేదా ఎస్బీఐ క్రెడిట్/డెబిట్ కార్డులను ఉపయోగిస్తే.. అదనంగా 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా.. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండటం వల్ల సామాన్యులు సైతం ఈజీగా కొనొచ్చు.

ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ దీపావళి సేల్..వలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. రు ఒక మంచి శాంసంగ్ ట్యాబ్ కొనాలని ఆలోచిస్తుంటే..అనుకుంటే..ఈ భారీ ధర తగ్గింపు ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి. దీపావళి పండగను మీ కుటుంబంతో పాటు కొత్త ట్యాబ్‌తో మరింత ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి!

Related News

దీపావళి షాపింగ్ చేస్తున్నారా?ఈ 5 సైబర్ మోసాలతో జాగ్రత్త!

రూ.18 వేల ఖర్చుకి రూ.50 వేల బాదుడా? iPhone 18 Pro స్టోరేజ్ వెనుక యాపిల్ సీక్రెట్ దందా!

చలికాలంలో ఫోన్ ఛార్జింగ్ నెమ్మదిగా అవుతోందా? అసలు కారణం ఇదే!

కపుల్స్ కోసం Airtel బంపరాఫర్.. రూ.749కే అపరిమిత 5G డేటా.. ఓటీటీలు, 2 సిమ్ కార్డ్‌లు!

రూ.800లోపే గేమింగ్ ఇయర్‌బడ్స్..ఫీచర్లు మాములుగా లేవు!

మొబైల్ డేటా త్వరగా అయిపోతోందా? ఫేస్‌బుక్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్ మార్చారో లేదో ఒకసారి చూసుకోండి!

రూ.వెయ్యిలోపు బెస్ట్ హెడ్‌సెట్..బోట్ రాకర్జ్ 371 రివ్యూ ఇదిగో!

Big Stories

Advertisement
×