E-Paper
Advertisement

హైదరాబాద్‌వాసులకు దీపావళి కానుక.. సగానికి తగ్గిన కామన్ పాస్ ధరలు, శనివారం నుంచి అమలు

హైదరాబాద్‌వాసులకు దీపావళి కానుక.. సగానికి తగ్గిన కామన్ పాస్ ధరలు, శనివారం నుంచి అమలు
Advertisement

Hyderabad City: దీపావళికి ముందు హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కామన్ బస్సు పాస్ ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  ఆ ధరలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల నగరవాసులపై అధిక భారం తగ్గినట్టైంది. ఇంతకీ కామన్ బస్సు పాస్ ఎంత వరకు తగ్గించిందనేది మీ డౌట్. దాదాపు 40 శాతం పైగానే తగ్గించింది ప్రభుత్వం.

దీపావళి పండగ వేళ హైదరాబాద్ సిటీవాసులకు తీపి కబురు తెలంగాణ ప్రభుత్వం. ప్రజా రవాణా వ్యవస్థ బలంగా చేసేందుకు బస్సులు-మెట్రో రైళ్లను సమన్వయం చేసే ఉద్దేశంతో గత నెలలో ఉమ్మడి పాస్ విధానాన్ని ప్రారంభించింది. అయితే కామన్ పాస్‌ల ధరలు అధికంగా ఉంది. దీంతో సామాన్యుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. పరిస్థితి గమనించిన ప్రభుత్వ అధికారులు, దీనిపై రివ్యూ చేశారు.

Advertisement

ఈ క్రమంలో ప్రయాణికులకు భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మెట్రో రైళ్లు-సిటీ బస్సుల్లో ఒకే పాస్‌తో అన్‌లిమిటెడ్‌గా ప్రయాణించేందుకు ధరను భారీగా తగ్గించింది. గతంలో నెలకు రూ.8,500 కామన్ పాస్ ధరను రూ.4 వేలకు తగ్గించింది. తగ్గించిన ధరలు నవంబర్ 8 అంటే శనివారం నుంచి అమల్లోకి రానున్నాయని రవాణా మంత్రి పొన్న ప్రభాకర్ వెల్లడించారు. ఒక విధంగా చెప్పాలంటే రెండింటిలో ప్రతీ రోజూ ట్రావెల్ చేసేవారికి బిగ్ రిలీఫ్.

Related News

అమెరికాలో తెలుగు స్టూడెంట్ అదృశ్యం.. 36 గంటలకు గడిచినా తెలియని ఆచూకీ, లొకేషన్‌ బీచ్‌ ప్రాంతంలో

మేడ్చల్ లో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

ఖమ్మం జిల్లాలో పౌరసరఫరాల శాఖ దాడులు.. భారీగా బియ్యం బస్తాలు సీజ్!

హైదరాబాద్‌లో ఈ నెల 6 నుంచి 11 వరకు ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు!

తెలంగాణ పట్టణాభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 5 భారీ ప్రాజెక్టులకు ఆమోదం!

‘బీజేపీ నేతలవి ఉత్త మాటలే’.. మోదీ, అమిత్ షాలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్!

DSP భీంరెడ్డి అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్.. ఇళ్లు, కార్లు, భూములు అటాచ్ చేసిన ఐటీ!

Big Stories

Advertisement
×