E-Paper
Advertisement

రూ.18 వేల ఖర్చుకి రూ.50 వేల బాదుడా? iPhone 18 Pro స్టోరేజ్ వెనుక యాపిల్ సీక్రెట్ దందా!

రూ.18 వేల ఖర్చుకి రూ.50 వేల బాదుడా? iPhone 18 Pro స్టోరేజ్ వెనుక యాపిల్ సీక్రెట్ దందా!
Advertisement

iPhone 18 Pro Storage: చాలామంది కొత్త ఐఫోన్ కొనేటప్పుడు కెమెరా, డిజైన్‌తో పాటు స్టోరేజ్ ఎంత ఉందన్నదీ చూస్తారు. ఎక్కువ ఫొటోలు, వీడియోలు తీసేవారికి 1TB లేదా 2TB మోడల్ అవసరం కావచ్చు. అయితే iPhone 18 Proలో ఎక్కువ స్టోరేజ్ కావాలంటే వినియోగదారులు భారీగా అదనపు డబ్బు చెల్లించాల్సి వస్తోందని ఓ నివేదిక చెబుతోంది. స్టోరేజ్ పెంచడానికి యాపిల్ పెట్టిన ధర, దాని అంచనా ఖర్చుతో పోలిస్తే.. చాలా ఎక్కువగా ఉందని ఈ విశ్లేషణ వెల్లడించింది.

1TB అప్‌గ్రేడ్‌పై లెక్కలు..

వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషణ ప్రకారం.. iPhone 17 Proలో 1TB స్టోరేజ్ కోసం యాపిల్‌కు అయ్యే ఖర్చు సుమారు రూ.4,000 మాత్రమే. iPhone 18 Proలో అదే స్థాయి స్టోరేజ్‌కు ఈ ఖర్చు సుమారు రూ.18,000కు పెరిగిందని అంచనా. అయినా కంపెనీ ఈ అప్‌గ్రేడ్‌పై పొందే స్థూల లాభం రూ.34,000 నుంచి దాదాపు రూ.39,000కు చేరిందని నివేదిక పేర్కొంది. అంటే ఖర్చు పెరిగినా లాభం కూడా పెరిగింది.

512GB ధరలో మార్పు..

Advertisement

512GB స్టోరేజ్ అప్‌గ్రేడ్ విషయంలోనూ ఖర్చు పెరిగింది. iPhone 17 Pro కోసం యాపిల్ సరఫరాదారులకు సుమారు రూ.1,400 చెల్లించేది. ఇప్పుడు iPhonw 18 Proలో ఆ ఖర్చు దాదాపు రూ.6,000కు చేరిందని అంచనా. అయితే ఈ ఆప్షన్‌పై కంపెనీకి మిగిలే లాభం తగ్గినట్లు విశ్లేషణ చెబుతోంది. స్టోరేజ్ చిప్స్ ధరలు పెరగడం దీనికి ఒక కారణం కావచ్చు.

Also Read: కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఆధార్‌ అప్డేట్ నిమిషాల్లో!

2TB మోడల్‌పై భారీ ప్రీమియం..

Advertisement

అత్యధిక లాభం 2TB వేరియంట్‌లోనే కనిపిస్తోంది. 1TB మోడల్‌తో పోలిస్తే.. 2TB iPhonw 18 Pro కోసం యాపిల్ అదనంగా సుమారు రూ.1.13 లక్షలు వసూలు చేస్తోంది. ఆ అదనపు స్టోరేజ్ కోసం కంపెనీకి అయ్యే ఖర్చు దాదాపు రూ.42,000గా అంచనా. దీంతో సుమారు రూ.71,000 స్థూల లాభం మిగులుతుందని నివేదిక తెలిపింది.

భారత్‌లో ధరలు ఎంతంటే?

భారత్‌లో 256GB నుంచి 512GBకి మారితే అదనంగా రూ.25,000 చెల్లించాలి. 512GB నుంచి 1TBకి వెళ్లేందుకు మరో రూ.50,000, 1TB నుంచి 2TBకి మారేందుకు రూ.75,000 ఎక్కువ. అయితే ఈ లెక్కల్లో ర్యామ్ ఖర్చు ఎంత ఉందో నివేదిక స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి.. ఇవి పూర్తి తయారీ ఖర్చులు కావు. స్టోరేజ్ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన అంచనాలే.

అవసరాన్ని బట్టి కొనుగోలు..

ఇదే సమయంలో యాపిల్ భారత మార్కెట్లో రికార్డు ఆదాయం సాధించినట్లు ప్రకటించింది. ఐఫోన్, మ్యాక్ అమ్మకాలు పెరగడం దీనికి తోడైందని కంపెనీ తెలిపింది. అయితే ధరల పెంపు కూడా ఆదాయం పెరగడానికి కారణమై ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ర్యామ్ కొరత ప్రభావం కూడా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ స్టోరేజ్ నిజంగా అవసరమా, లేక తక్కువ ధర మోడల్ సరిపోతుందా అనేది యూజర్లు కొనుగోలుకు ముందే ఆలోచించుకోవడం మంచిది.

Also Read: మొబైల్ డేటా త్వరగా అయిపోతోందా? ఫేస్‌బుక్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్ మార్చారో లేదో ఒకసారి చూసుకోండి!

Tags

Related News

చలికాలంలో ఫోన్ ఛార్జింగ్ నెమ్మదిగా అవుతోందా? అసలు కారణం ఇదే!

కపుల్స్ కోసం Airtel బంపరాఫర్.. రూ.749కే అపరిమిత 5G డేటా.. ఓటీటీలు, 2 సిమ్ కార్డ్‌లు!

రూ.800లోపే గేమింగ్ ఇయర్‌బడ్స్..ఫీచర్లు మాములుగా లేవు!

మొబైల్ డేటా త్వరగా అయిపోతోందా? ఫేస్‌బుక్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్ మార్చారో లేదో ఒకసారి చూసుకోండి!

రూ.వెయ్యిలోపు బెస్ట్ హెడ్‌సెట్..బోట్ రాకర్జ్ 371 రివ్యూ ఇదిగో!

75 గంటల బ్యాటరీతో..గోబౌల్ట్ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోతుంది

ఒకటి కొంటే ఇంకోటి ఉచితం.. రియల్‌మీ దీపావళి సేల్‌లో మతిపోయే ఆఫర్లు భయ్యా!

Big Stories

Advertisement
×