E-Paper
Advertisement

క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్‌లో ఈ పొరపాటు చేస్తే అప్పు పెరుగుతూనే ఉంటుంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

క్రెడిట్ కార్డ్  బిల్లు పేమెంట్‌లో ఈ పొరపాటు చేస్తే అప్పు పెరుగుతూనే ఉంటుంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Advertisement

Credit Card Debt Trap| ప్రతి నెలా క్రెడిట్ కార్డ్ బిల్లు కడుతున్నారు. అయినప్పటికీ మీ అప్పు మాత్రం తగ్గడం లేదా? జీతం వచ్చిన వెంటనే బిల్లులో కొంత మొత్తం చెల్లిస్తున్నా, బకాయి అలాగే కనిపిస్తోందా? దీనికి కారణం మీరు చెల్లిస్తున్న మినిమమ్ అమౌంట్ డ్యూ కావచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్లులో కనీస మొత్తం మాత్రమే చెల్లిస్తే వెంటనే లేట్ ఫీజుల నుంచి తప్పించుకోవచ్చు. కానీ అసలు అప్పు మాత్రం త్వరగా తగ్గదు. వడ్డీ, జీఎస్టీ రూపంలో మీ డబ్బులో ఎక్కువ భాగం ఖర్చవుతుంది. చివరకు చిన్న అప్పు కూడా పెద్ద ఆర్థిక భారంగా మారుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ అప్పుల చక్రం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

మినిమమ్ అమౌంట్ డ్యూ చెల్లిస్తే అప్పు ఎందుకు తగ్గదు?

క్రెడిట్ కార్డ్ బిల్లులో మినిమమ్ అమౌంట్ డ్యూ చెల్లించడం వల్ల లేట్ పేమెంట్ పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఇలా చేసినంత మాత్రాన మొత్తం బకాయి తీరదు. మిగిలిన మొత్తంపై వడ్డీ, ఇతర ఛార్జీలు వర్తిస్తాయి. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డుపై రూ.1 లక్ష బకాయి ఉందనుకుందాం. నెలకు 3.75 శాతం వడ్డీ పడుతోందని భావిద్దాం. మీరు ఏడాది పాటు కనీస మొత్తం మాత్రమే చెల్లిస్తే, మొత్తం రూ.69,160 వరకు చెల్లించాల్సి రావచ్చు. అయినా ఏడాది తర్వాత సుమారు రూ.78,470 బకాయి మిగిలే అవకాశం ఉంది. మీరు చెల్లించిన మొత్తంలో రూ.47,630 వడ్డీ, జీఎస్టీ రూపంలో ఖర్చవుతుంది. అసలు అప్పు తగ్గడానికి కేవలం రూ.21,530 మాత్రమే ఉపయోగపడుతుంది.

క్రెడిట్ కార్డ్ వడ్డీ భారం ఎలా పెరుగుతుంది?

Advertisement

క్రెడిట్ కార్డుపై కొంత బకాయి మిగిలిస్తే సాధారణంగా వడ్డీ లేని గడువు కోల్పోతారు. కార్డు నిబంధనల ప్రకారం పాత బకాయితో పాటు కొత్త కొనుగోళ్లపైనా వడ్డీ పడవచ్చు. దీంతో రోజువారీ అవసరాల కోసం చేసే ఖర్చులు కూడా భారంగా మారతాయి. వడ్డీ పెరుగుతున్న కొద్దీ మొత్తం అప్పును తీర్చడం కష్టమవుతుంది. క్రెడిట్ కార్డ్ అప్పు పెరుగుతోందని తెలిపే సంకేతాలు ఇవే.

బిల్‌కట్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, సీటీఓ తనిష్ శర్మ ప్రకారం కొన్ని అలవాట్లు అప్పుల సమస్యను సూచిస్తాయి.

  •  ప్రతినెలా చెల్లిస్తున్నా బకాయి తగ్గకపోవడం.
  •  జీతం సరిపోక నిత్యావసరాల కోసం కూడా క్రెడిట్ కార్డు వాడటం.
  •  ఒక అప్పు తీర్చడానికి మరోచోట అప్పు చేయడం.
  •  మినిమమ్ అమౌంట్ కంటే ఎక్కువ చెల్లించలేకపోవడం.
Advertisement

Also Read: చదువు మధ్యలోనే ఆపేసి రోజుకు రూ.100 కూలీ పని చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2 లక్ష కోట్ల బిజినెస్‌కు అధిపతి

పర్సనల్ లోన్‌తో క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చవచ్చా?

క్రెడిట్ కార్డ్ అప్పుపై వడ్డీ ఎక్కువగా ఉంటే పర్సనల్ లోన్ ఒక ప్రత్యామ్నాయం కావచ్చు. ఉదాహరణకు, రూ.1 లక్ష రుణాన్ని 16 శాతం వార్షిక వడ్డీతో రెండేళ్లకు తీసుకుంటే నెలకు సుమారు రూ.4,896 ఈఎంఐ చెల్లించాలి. మొత్తం వడ్డీ దాదాపు రూ.17,500 అవుతుంది. అయితే ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ రేట్లు, అర్హతలను ముందుగా పరిశీలించాలి. పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత మళ్లీ క్రెడిట్ కార్డుపై ఖర్చులు పెంచకూడదు.

Also Read: నెలకు రూ.24 లక్షల జీతం, క్రెడిట్ స్కోర్ 750.. అయినా హోమ్ లోన్ తిరస్కరించిన బ్యాంక్?

క్రెడిట్ కార్డ్ అప్పుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ప్రతి నెలా చెల్లించండి. అవసరం లేని కొనుగోళ్లను తగ్గించండి. నెలవారీ బడ్జెట్ తయారుచేసుకుని అప్పుల చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా మీ బకాయి ప్రతి నెలా తగ్గుతోందో లేదో గమనించండి. మినిమమ్ అమౌంట్ చెల్లించడం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అప్పు పూర్తిగా తీర్చడమే మీ లక్ష్యం కావాలి.

Related News

వాల్‌‌స్ట్రీట్‌లో బేర్ వీర విహారం..ఆరేళ్ల తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ భారీ పతనం, వెంటాడిన ఏఐ భయాలు

దీపావళి బోనస్ వచ్చిందా? డబ్బంతా ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం ఇలా చేయండి

దీపావళి బిజినెస్ ఐడియా.. కేవలం రూ.10000తో కొవ్వత్తుల వ్యాపారం.. ఇలా చేస్తే భారీ ఆదాయం

ఏటీఎంలకు కొత్త రూల్స్.. అమలు చేస్తున్న ఒక్కో బ్యాంకు, లబోదిబోమంటున్న కస్టమర్లు

సంక్షేమ పథకాలకు ఇకపై ఓటర్ ఐడీ? కేంద్రం కొత్తగా ప్రతిపాదన, మండిపడుతున్న విపక్షాలు

బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. వడ్డీ రేట్లు పెంపు, ఆనందంలో సీనియర్ సిటిజన్లు

ఇల్లు షిఫ్ట్ చేస్తుండగా వస్తువులు మాయం.. ఏసీ, టీవీ ధ్వంసం.. మూవర్స్, ప్యాకర్స్‌కు భారీ జరిమానా

Big Stories

Advertisement
×