E-Paper
Advertisement

దీపావళి షాపింగ్ చేస్తున్నారా?ఈ 5 సైబర్ మోసాలతో జాగ్రత్త!

దీపావళి షాపింగ్ చేస్తున్నారా?ఈ 5 సైబర్ మోసాలతో జాగ్రత్త!
Advertisement

Diwali shopping cyber scams: దీపావళి అంటేనే సంబరాలు, పటాసులు, కొత్త బట్టలు, భారీ షాపింగ్! ఈ రోజుల్లో.. మనం మార్కెట్‌కు వెళ్లడం కంటే ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో.. షాపింగ్ చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నాం. అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్ వంటి ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ పండగ సందర్భంగా భారీ డిస్కౌంట్లు, సేల్స్ ప్రకటిస్తుంటాయి. అయితే.. ఈ ఆన్‌ లైన్ హడావుడిని సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీ ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు.. రకరకాల మోసాలకు తెరలేపుతుంటారు. దీపావళి షాపింగ్ సమయంలో మీ కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి, మోసగాళ్లు వాడే .. 5 ప్రధాన సైబర్ మోసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, ఫేక్ యాప్స్:

పండగ సీజన్‌లో అసలు బ్రాండ్ల మాదిరిగానే ఉండే నకిలీ వెబ్‌ సైట్లను సైబర్ నేరగాళ్లు సృష్టిస్తారు. ఉదాహరణకు.. పాపులర్ బ్రాండ్లపై 80% నుంచి 90% వరకు భారీ డిస్కౌంట్లు ఉన్నట్లు సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తుంటారు. మనం నిజమైన వెబ్‌సైట్.. అనుకుని వాటిలో లాగిన్ అయి షాపింగ్ చేస్తుంటాం. కానీ.. ఆర్డర్ చేసిన సామాన్లు రావు, పైగా మన క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు దొంగిలించి అకౌంట్‌లోని డబ్బు మొత్తం కాజేస్తారు. కాబట్టి, ఎప్పుడైనా సరే అధికారిక యాప్స్ లేదా నమ్మకమైన వెబ్‌సైట్లలో మాత్రమే షాపింగ్ చేయడం ముఖ్యం.

2. ఫేక్ గిఫ్ట్ వోచర్లు, లక్కీ డ్రా లింక్స్:

Advertisement

“మీకు దీపావళి కానుకగా రూ. 10,000 విలువైన గిఫ్ట్ వోచర్ వచ్చింది”, లేదా “మీరు లక్కీ డ్రాలో కారు గెలుచుకున్నారు” అంటూ వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్‌ల ద్వారా మెసేజ్‌లు వస్తుంటాయి. వాటితో.. పాటు కొన్ని లింక్స్ కూడా ఇస్తారు. ఆ ఉత్సాహంలో.. మనం ఆ లింక్‌పై క్లిక్ చేయగానే, మన పర్సనల్ వివరాలు లేదా ఫోన్‌లోని డేటా హ్యాకర్ల చేతికి వెళ్తుంది. కొన్నిసార్లు ఏపికె ఫైల్స్ డౌన్‌ లోడ్ అయ్యి ఫోన్ మొత్తం వారి నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు.

3. పార్శిల్ డెలివరీ స్కామ్‌లు:

పండగ సమయంలో.. మనం ఆన్‌లైన్‌లో చాలా ఆర్డర్లు చేస్తుంటాం. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు మీకు కొరియర్ కంపెనీల పేరుతో .. కాల్స్ లేదా మెసేజ్‌లు చేస్తారు.”మీ పేరు మీద ఒక పార్శిల్ వచ్చింది. కానీ అడ్రస్ తప్పుగా ఉంది లేదా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి” అంటూ చిన్న మొత్తంలో.. డబ్బులు ఆన్‌లైన్‌లో కట్టమంటారు. మనం నిజంగానే.. ఏదో ఆర్డర్ చేసి ఉంటాం కదా అని నమ్మి ఆ లింక్ ద్వారా డబ్బులు కడితే.. మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం. అసలు కొరియర్ సంస్థలు.. ఎప్పుడూ ఇలా ఫోన్ చేసి డబ్బులు అడగవని తప్పకుండా గమనించాలి.

4. క్యూఆర్ కోడ్ మోసాలు:

Advertisement

పాత వస్తువులు అమ్మడానికి.. లేదా ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనడానికి ఓఎల్‌ఎక్స్ లాంటి ప్లాట్‌ ఫారమ్‌లను వాడే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసగాళ్లు తమను తాము కొనుగోలు దారులుగా పరిచయం చేసుకుని, మీకు డబ్బులు పంపిస్తామంటూ ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు. “ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయండి” అని చెబుతారు..గుర్తుంచుకోండి. డబ్బులు పొందడానికి ఎప్పుడూ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. పిన్ ఎంటర్ చేస్తే.. మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి తప్ప రావు.

Also Read: రూ.800లోపే గేమింగ్ ఇయర్‌బడ్స్..ఫీచర్లు మాములుగా లేవు!

5. ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు:

ఆన్‌లైన్ షాపింగ్‌లో ఏదైనా సమస్య వస్తే.. వెంటనే గూగుల్‌లో సంబంధిత ఈ-కామర్స్ కంపెనీ.. కస్టమర్ కేర్ నంబర్ వెతుకుతాం. సైబర్ నేరగాళ్లు.. గూగుల్ మ్యాప్స్ లేదా సెర్చ్ రిజల్ట్స్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను అప్‌ లోడ్ చేసి ఉంచుతారు. మనం ఆ నంబర్‌కు కాల్ చేస్తే.. వారు కంపెనీ ప్రతినిధులమని నమ్మిస్తారు. సమస్య పరిష్కారం పేరుతో ఎనీడెస్క్ లేదా టెక్‌డ్యూవర్ లాంటి రిమోట్ యాక్సెస్ యాప్స్‌ను డౌన్‌ లోడ్ చేయమంటారు. ఆ యాప్స్ ద్వారా.. మీ ఫోన్‌ను పూర్తిగా నియంత్రించి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కాజేస్తారు.

దీపావళి పండగ సంతోషం మన ఇంట్లో వెలుగులు నింపాలి కానీ, సైబర్ మోసాల వల్ల చీకట్లు మిగల్చకూడదు. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎవరికీ మీ ఓటీపీ, యూపీఐ పిన్ లేదా పాస్‌వర్డ్‌లను షేర్ చేయకండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకుండా, సురక్షితమైన పద్ధతిలో షాపింగ్ చేసి సంతోషకరమైన దీపావళిని జరుపుకోండి!

Related News

రూ.18 వేల ఖర్చుకి రూ.50 వేల బాదుడా? iPhone 18 Pro స్టోరేజ్ వెనుక యాపిల్ సీక్రెట్ దందా!

చలికాలంలో ఫోన్ ఛార్జింగ్ నెమ్మదిగా అవుతోందా? అసలు కారణం ఇదే!

కపుల్స్ కోసం Airtel బంపరాఫర్.. రూ.749కే అపరిమిత 5G డేటా.. ఓటీటీలు, 2 సిమ్ కార్డ్‌లు!

రూ.800లోపే గేమింగ్ ఇయర్‌బడ్స్..ఫీచర్లు మాములుగా లేవు!

మొబైల్ డేటా త్వరగా అయిపోతోందా? ఫేస్‌బుక్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్ మార్చారో లేదో ఒకసారి చూసుకోండి!

రూ.వెయ్యిలోపు బెస్ట్ హెడ్‌సెట్..బోట్ రాకర్జ్ 371 రివ్యూ ఇదిగో!

75 గంటల బ్యాటరీతో..గోబౌల్ట్ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోతుంది

Big Stories

Advertisement
×