Anshul Kamboj On IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (Team India vs New Zealand) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ (India tour of New Zealand 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన శుభమాన్ గిల్ ( Gill) సేన సూపర్ విక్టరీ అందుకుంది. శనివారం అంటే రేపు రెండో వన్డే జరగనుంది. ఇలాంటి క్రమంలో టీమిండియా కొత్త బౌలర్ అన్షుల్ కాంబోజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారతదేశంలోని ఫ్లాట్ పిచ్ లే అంటూ బాంబు పేల్చాడు. అందుకే ఇండియాలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా తాను విఫలమైనట్టు పేర్కొన్నాడు. కానీ, ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై అద్భుతంగా రాణిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక్కడి పిచ్ లు బౌలింగ్ కు అద్భుతంగా అనుకూలిస్తున్నాయని.. ఇలాగే ఉంటే మెరుగైన బౌలింగ్ తన నుంచి వస్తుందని స్పష్టం చేశాడు. దీంతో అన్షుల్ కంబోజ్ (Anshul Kamboj) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.