E-Paper
Advertisement

కపుల్స్ కోసం Airtel బంపరాఫర్.. రూ.749కే అపరిమిత 5G డేటా.. ఓటీటీలు, 2 సిమ్ కార్డ్‌లు!

కపుల్స్ కోసం Airtel బంపరాఫర్.. రూ.749కే అపరిమిత 5G డేటా.. ఓటీటీలు, 2 సిమ్ కార్డ్‌లు!
Advertisement

Airtel Family Plan: దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ (Airtel) తన యూజర్ల కోసం వివిధ రకాల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా కపుల్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన రూ.749 ఫ్యామిలీ ప్లాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ప్లాన్‌లో 2 సిమ్ కార్డ్‌లు (1 ప్రైమరీ, 1 యాడ్ ఆన్) లభిస్తాయి. ఇద్దరు యూజర్లకు అన్‌లిమిటెడ్ 4G – 5G డేటాతో పాటు, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లభిస్తాయి. వీటికి తోడు మరికొన్ని ప్రత్యేక బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.

ప్లాన్ వల్ల కలిగే బెనిఫిట్స్

రూ. 749 కపుల్ ప్లాన్ లో 5G స్లైసింగ్ సపోర్ట్‌తో కూడిన ‘ఫాస్ట్ లేన్’ (Fast Lane) టెక్నాలజీ లభిస్తుంది. అంతేకాకుండా 6 నెలల అమెజాన్ ప్రైమ్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, 6 నెలల గూగుల్ వన్ (100GB క్లౌడ్ స్టోరేజ్), ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, 3 నెలల ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం, 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి బెనిఫిట్స్ యూజర్లకు అందిస్తున్నారు. అంతేకాకుండా ఫ్రాడ్ లింక్ బ్లాకింగ్, స్పామ్ ప్రొటెక్షన్, ఓటీపి అలర్ట్స్, ఫ్రీ హలో ట్యూన్స్, బ్లూ రిబ్బన్ బ్యాగ్స్ (బ్యాగ్ ట్రాకింగ్ సర్వీస్) వంటి సేవలు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి.

పిల్లలను కూడా చేర్చాలంటే..

Advertisement

ఒకవేళ ఈ ప్లాన్‌లో పిల్లలను కూడా చేర్చాలనుకుంటే రూ.1049 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో పాటు మరో అదనపు సిమ్ కార్డ్ దీనికింద ఎయిర్ టెల్ అందిస్తుంది (మొత్తం 3 సిమ్ కార్డ్‌లు). ప్రతీ నెలా కపుల్స్ తలోక ప్లాన్ రీఛార్జ్ చేసుకునే బదులు.. ఒకటే పోస్ట్ పెయిడ్ తీసుకోవడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చని టెలికాం నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి కపుల్స్ కు ఈ రూ.749 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుందని పేర్కొంటున్నారు.

Also Read: దేశంలో అశాంతికి కుట్ర.. సీజేపీకి పాక్ నిధులు.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు!

‘ఫాస్ట్ లేన్’ టెక్నాలజీ అంటే?

Advertisement

ఎయిర్ టెల్ అందించే రూ.749 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ అడ్వాన్స్‌డ్ 5G నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీపై పనిచేయనుంది. దీని ప్రత్యేక ఏంటంటే.. సాధారణ ప్రీపెయిడ్ ప్లాన్లలో లభించే 5G డేటా కంటే ఇది మరింత వేగంతో ఇంటర్నెట్ ను అందిస్తుంది. సూపర్ స్పీడ్ తో సినిమాలు, వీడియోలు, ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. కాగా, ఈ 5G స్లైసింగ్ ప్రయోజనం ఎయిర్ టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లన్నింటిలోనూ అందుబాటులో ఉండటం విశేషం.

Also Read: ‘రోడ్ల మీద కాదు.. పార్లమెంట్‌లో చూసుకుందాం’.. రాహుల్ సవాల్‌పై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్!

Tags

Related News

చలికాలంలో ఫోన్ ఛార్జింగ్ నెమ్మదిగా అవుతోందా? అసలు కారణం ఇదే!

రూ.800లోపే గేమింగ్ ఇయర్‌బడ్స్..ఫీచర్లు మాములుగా లేవు!

మొబైల్ డేటా త్వరగా అయిపోతోందా? ఫేస్‌బుక్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్ మార్చారో లేదో ఒకసారి చూసుకోండి!

రూ.వెయ్యిలోపు బెస్ట్ హెడ్‌సెట్..బోట్ రాకర్జ్ 371 రివ్యూ ఇదిగో!

75 గంటల బ్యాటరీతో..గోబౌల్ట్ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోతుంది

ఒకటి కొంటే ఇంకోటి ఉచితం.. రియల్‌మీ దీపావళి సేల్‌లో మతిపోయే ఆఫర్లు భయ్యా!

కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఆధార్‌ అప్డేట్ నిమిషాల్లో!

Big Stories

Advertisement
×