E-Paper
Advertisement

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్
Advertisement

BoAt 160W power bank: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌టాప్, ఇయర్‌ బడ్స్, స్మార్ట్‌ వాచ్‌లు మన జీవితంలో భాగమైపోయాయి.రోజంతా ఇవి పని చేయాలంటే బ్యాటరీ ఛార్జింగ్ చాలా ముఖ్యం.తరచూ ట్రావెల్ చేసేవారికి లేదా ఆఫీస్ వర్క్ బయట నుంచి చేసే వారికి బ్యాటరీ అయిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా.. ప్రముఖ లైఫ్‌ స్టైల్ టెక్ బ్రాండ్ బోట్ మార్కెట్లోకి ఒక పవర్‌ఫుల్ డివైజ్‌ను తెచ్చింది. అదే ఈ మోడల్. దీనికి సంబంధించిన ఫీచర్లు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ధర:

ఈ పవర్ బ్యాంక్ ధర విషయానికి వస్తే..ఇది మార్కెట్లో కేవలం రూ.5,229 ధరకే అందుబాటులో ఉంది. 27000 mAh భారీ కెపాసిటీ , ఏకంగా 160W పవర్ అవుట్‌ పుట్ అందించే పవర్ బ్యాంక్ ఈ ధరలో.. లభించడం నిజంగా టెక్ లవర్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు,బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇది అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లు లేదా ఫెస్టివల్ డిస్కౌంట్‌లో ఇది మరింత తక్కువ ధరకే.. లభించే అవకాశం ఉంది.

డిజైన్, బిల్డ్ క్వాలిటీ:

Advertisement

బోట్ ఈ పవర్ బ్యాంక్‌ను ఎంతో స్టైలిష్‌గా డిజైన్ చేసింది. ఇది మెటల్‌గన్ కలర్‌లో లభిస్తుంది. అంతే కాకుండా ఇది చూడటానికి చాలా ప్రీమియంగా ,రగ్డ్‌గా ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి సౌకర్యంగా ఉండటంతో పాటు, ట్రావెల్ చేసేటప్పుడు.. బ్యాగులో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. బలమైన బాడీ కారణంగా ఇది త్వరగా పాడవ్వదు, తద్వారా చాలా కాలం పనిచేస్తుంది.

అద్భుతమైన ఫీచర్లు, పెర్ఫార్మెన్స్:

భారీ కెపాసిటీ: ఇందులో ఉన్న భారీ 27000 mAh లిథియం-అయాన్ బ్యాటరీ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సార్లు ఫుల్ ఛార్జ్ చేయగలదు.

Advertisement

160W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్: ఈ పవర్ బ్యాంక్ అతిపెద్ద హైలైట్ దీని 160W పవర్ అవుట్‌పుట్. దీని సహాయంతో.. కేవలం స్మార్ట్‌ ఫోన్‌లు మాత్రమే కాకుండా.. హెవీ-డ్యూటీ ల్యాప్‌ టాప్‌లను కూడా ఎంతో వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: రూ.1,599కే..20000 mAh భారీ బ్యాటరీతో ఫిలిప్స్ పవర్ బ్యాంక్!

క్విక్ ఛార్జ్ 3.0, పవర్ డెలివరీ 3.0: ఇందులో క్విక్ ఛార్జ్ 3.0సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల కనెక్ట్ చేసిన డివైజ్‌కు ఎంత పవర్ అవసరమో గుర్తించి, చాలా తక్కువ సమయంలో ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది.

ఆల్-ఇన్-వన్ మల్టీ-డివైస్ సపోర్ట్: ఈ ఒక్క పవర్ బ్యాంక్ ద్వారా ఇయర్‌ బడ్స్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, పోర్టబుల్ స్పీకర్లు,ట్యాబ్, ట్రిమ్మర్‌ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పోర్ట్స్ అందుబాటులో.. ఉండటం వల్ల ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లను కనెక్ట్ చేయెచ్చు.

ఎందుకు కొనాలి?

మీరు తరచుగా ప్రయాణాలు చేసేవారైతే.. లేదా ల్యాప్‌టాప్, మొబైల్ రెండింటినీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటే.. ఈ పవర్ బ్యాంక్ పర్ఫెక్ట్ ఛాయిస్.రూ. 5,229 బడ్జెట్‌లో లభించే బస్ట్ పవర్ బ్యాంకులలో ఇది టాప్‌లో నిలుస్తుంది. వేర్వేరు గాడ్జెట్లను త్వరగా ఛార్జ్ చేయగల సామర్థ్యం దీని సొంతం కాబట్టి, ఎప్పుడూ కనెక్టెడ్‌గా ఉండాలనుకునే వారికి ఇది కచ్చితంగా సరి పోతుంది!

Related News

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

యాపిల్ నుంచి ఊహించని ట్విస్ట్.. iPhone 18లో ఏకంగా నాలుగు భారీ మార్పులు.. ధర ఎంతంటే?

రూ.7,190కే వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు!

BSNL సంచలన ప్లాన్.. రోజుకు రూ.7 మాత్రమే.. ఏడాదంతా ఫ్రీ కాల్స్, డేటా!

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల వర్షం.. ఆసుస్ పాపులర్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.18,000 తగ్గింపు!

హయర్, శాంసంగ్ ఫ్రిజ్‌లపై అమెజాన్ సేల్‌లో..భారీ డిస్కౌంట్లు!

జియో అదిరిపోయే ప్లాన్.. రూ.999 కే ఇన్ని బెనిఫిట్సా.. వర్త్ వర్మా వర్త్!

Big Stories

Advertisement
×