E-Paper
Advertisement

దొంగ గేమ్ ఆడొద్దు.. కర్మ అనుభవిస్తావ్.. త్రిగుణ్ పై నీతూ మాస్టర్ ఫైర్..

దొంగ గేమ్ ఆడొద్దు.. కర్మ అనుభవిస్తావ్.. త్రిగుణ్ పై నీతూ మాస్టర్ ఫైర్..
Advertisement

Bigg boss 10:బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ ఊహించని టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటున్న బిగ్ బాస్ (Bigg Boss) రియాలిటీ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు కామనర్స్ ఇటు సెలబ్రిటీలతో పాటు వైల్డ్ కార్డు ఎంట్రీస్ కూడా ఆటపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఊహించని ఎలిమినేషన్స్ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఒకరితప్పులను మరొకరు బయట పెట్టడం అన్నీ కూడా షోపై ఆసక్తిని పెంచుతున్న విషయం తెలిసిందే . ఇకపోతే షో మొదలైనప్పటి నుంచి సెలబ్రిటీ అయిన త్రిగుణ్ కి బిగ్ బాస్ ఫేవర్ గా గేమ్ నడిపిస్తున్నాడు అంటూ కొంతమంది వార్తలు వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే.

గేమ్ నిజంగానే త్రిగుణ్ వైపు ఉందా..

ముఖ్యంగా అటు రోహిత్ ఇటు ముఖేష్ ఇద్దరు కూడా త్రిగుణ్ బండారం బయటపెట్టే ప్రయత్నం చేశారు. అటు రోహిత్ కూడా త్రిగుణ్ తో నువ్వు కాబట్టి బిగ్ బాస్ నిన్ను ఏమీ అనడం లేదు.. నీకు ఎల్లో కార్డ్స్ వచ్చినా..ఆఖరికి రెడ్ కార్డు వచ్చినా.. నీ ప్రవర్తన వరస్ట్ గా ఉన్నప్పటికీ.. గేమ్ నీకు అనుకూలంగానే ఉంటుంది. అదే నాలాంటి వాళ్లకు రెడ్ కార్డు వస్తే ఎప్పుడో హౌస్ నుండి బయటకు పంపించేవాళ్లు అంటూ అసలైన పాయింట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే రోహిత్ ను ప్లాన్ ప్రకారమే బయటకు పంపించేశారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో నిన్ను తొక్కుకుంటూ రోహిత్ కి ప్రామిస్ చేస్తూ కచ్చితంగా టైటిల్ విజేతగా నేనే నిలుస్తాను అంటూ ముఖేష్ కూడా త్రిగుణ్ పై మండిపడ్డారు.

నిన్న రోహిత్, ముకేష్ నేడు నీతూ మాస్టర్..

Advertisement

కట్ చేస్తే త్రిగుణ్ అసలు బుద్ధి బయటపెట్టే ప్రయత్నం చేసింది నీతూ మాస్టర్. మాట మీద నించోవడం రాదు మీకు అని నీతూ మాస్టర్ ని త్రిగుణ్ అనగా.. ఆమె మాట్లాడుతూ.. వంశీ, దేబ్జానీలతో మాట్లాడుకోండి మీరు.. మీకు సేఫ్ ఉంటారు. మీది ముందు లాగేస్తారు. ఎందుకంటే మీరు తన పేరు రాశారు అని మీరు నాతో అన్నారా? అసలు మీరు నాతో అన్నారా లేదా? ఎన్నిసార్లు కాపాడుకుంటారు అంటూ గట్టిగానే నిలదీసింది. అప్పటికి కూడా తన బిహేవియర్ ను మార్చుకోలేదు.. అయిపోయిందా లేదా అన్నట్టుగా ప్రవర్తించాడు. పైగా ఆమె అంత గట్టిగా అడుగుతుంటే తనకేమీ పట్టనట్టుగా ప్రవర్తించడం కూడా వైరల్ గా మారింది. ఇలా దొంగ గేమ్స్ ఆడొద్దు. ఆడితే సూటిగా ఆడాలి. వెనకాల రెండు ఫేస్ లు పెట్టుకొని ఆడొద్దు. అంటూ మండిపడింది.

also read:వంశీ నీకు మానవత్వమే లేదా..అందరూ చూస్తున్నారు!

నీ గుట్టు రట్టు చేస్తాను – నీతూ మాస్టర్

Advertisement

దానికి త్రిగుణ్ ఎవరు మాట్లాడుతున్నారో చూడండి అంటూ వెటకారంగా అన్నాడు. నువ్వు అని పిలిచి మళ్లీ మీరు అంటూ సంబోధించింది నీతూ. దీంతో మర్యాద ఇచ్చి మాట్లాడండి అంటూ అన్నాడు. మర్యాద పోయింది చాలామంది నిన్ను నమ్మొద్దు అన్నారు. కానీ ఒక గొర్రె లాగా నిన్ను నమ్మాను. త్రిగుణ్ అంటే మూడు గుణాలు. ఒక్క గుణం నచ్చుతుంది . కొన్ని గుణాలు నచ్చకపోతే రిటర్న్ పేలుతుంది. అది పేలకపోతే నన్ను అడుగు..నేను పేలుస్తా..అన్ని బయట పెడతాను. నీ గుట్టు బయట పెట్టే వరకు వదలను.. కర్మ కచ్చితంగా రిటర్న్ వస్తుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది . ఇది చూసిన ఆడియన్స్ త్రిగుణ్ కి కరెక్టు మొగుడు ఈమె అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటివన్నీ ప్రోమోలలో, ఎపిసోడ్లలో చూపించకుండా దాచేస్తున్నారా అంటూ బిగ్ బాస్ పై కూడా ఆడియన్స్ మండిపడుతుండడం గమనార్హం.

Related News

శైలు ఎంత క్యూట్ గా ఉందో.. కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే..!

వంశీ నీకు మానవత్వమే లేదా..అందరూ చూస్తున్నారు!

Illu Illalu Pillalu Today Episodes: తండ్రిని ఎదురించిన చందు.. కుప్పకూలిన రామరాజు.. ఇదేం ట్విస్ట్..

Podarillu Today Episode : పెద్ది స్టైల్ కేక.. చక్రికీ మహా కౌంటర్స్.. శైలు మాటతో కేశవ షాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఆఫీసుకు రాకుండా మాలిని ఆపగలదా..?   

Gundeninda GudiGantalu Today episode: ఇంటి కోసం ప్రభా ఎమోషనల్.. బాలు ప్లాన్ ఇదే..? రోహిణికి దిమ్మతిరిగే షాక్..

Brahmamudi Serial Today Episode November 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు చలపతి గ్రీన్ సిగ్నల్ – ఇందు మెడలో రాజు తాళి కడతాడా..? 

Big Stories

Advertisement
×