BigTV English

Star Hero : సినిమాలు ఫ్లాప్.. కానీ రెమ్యూనరేషన్ మాత్రం తగ్గట్లేదు..హీరో రేంజ్ వేరే లెవల్..

Star Hero : సినిమాలు ఫ్లాప్.. కానీ రెమ్యూనరేషన్ మాత్రం తగ్గట్లేదు..హీరో రేంజ్ వేరే లెవల్..

Star Hero : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా అదృష్టం లేకుంటే చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఇటీవల ఓ హీరో భారీ బడ్జెట్ సినిమాను చేశాడు. అది అనుకున్న టాక్ ను అందుకోలేదు. కనీసం సినిమా ఖర్చులు కూడా కలెక్షన్స్ రాలేదని టాక్. ఆ హీరో గతంలో వచ్చిన రెండు సినిమాలు భారీ ఫ్లాప్ ను అందుకున్నాయి. కానీ రెమ్యూనరేషన్ మాత్రం తగ్గట్లేదు.. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? అవును అండి మీరు గెస్ చేసింది కరెక్టే.. ఆయన మరెవ్వరో కాదు రామ్ పోతినేని.. ఈయన ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


టాలీవుడ్ ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ గారి అబ్బాయి గా ‘దేవదాసు’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు.. ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో అతడి దూకుడుకు అడ్డు లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు తన ఖాతాలో పడ్డాయి. ఇక ఆ తర్వాత రామ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘రెడీ’, ‘మస్కా’, ‘కందిరీగ’, ‘నేను శైలజ’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘ఇస్మార్ట్ శంకర్’ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి మార్కెట్ ని తెచ్చుకున్నాడు. కానీ రీసెంట్ గా రామ్ చేసిన చిత్రాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇక గత ఏడాది, ఈ ఏడాది రెండు సినిమాలు చేశాడు.. అది కాస్త డిజాస్టర్ గా నిలిచాయి. సినిమాలు తక్కువ అయినా కూడా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.

The flop hero who increased the remuneration is all crores per film?
The flop hero who increased the remuneration is all crores per film?

ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన రెడ్, స్కంద, వారియర్, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు భారీ డిజాస్టర్ అయ్యాయి. సాధారణంగా వరుస ఫ్లాప్స్ వచ్చిన హీరోలు తమ తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ని బాగా తగ్గిస్తారు. కానీ రామ్ మాత్రం రెమ్యూనరేషన్ విషయం లో అసలు తగ్గేదే లేదు అని అంటున్నాడు. తన దగ్గరకు వచ్చే నిర్మాతలకు పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అడుగుతున్నాడు. రామ్ నటించిన సినిమాలలో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి ఒక్కటే 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. మిగిలిన అన్ని చిత్రాలకు 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్ల కంటే తక్కువే వచ్చాయి. అయితే ఈయన అడిగిన దానికి ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. రెమ్యూనరేషన్ కి బదులుగా రెండు ప్రాంతాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కోరాలని నిర్ణయించుకున్నాడట.. అయితే నిర్మాతలు దీనిపై ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.. ఇక రామ్ లిస్ట్ లో ప్రస్తుతం సినిమాలు లేవని తెలుస్తుంది..


Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×