BigTV English
Advertisement

Olive Oil: ఆలివ్ ఆయిల్ అంత ఖరీదు ఎందుకు? ఆరోగ్యానికి అంత మంచిదా?

Olive Oil: ఆలివ్ ఆయిల్ అంత ఖరీదు ఎందుకు? ఆరోగ్యానికి అంత మంచిదా?

Olive Oil Health benifits: వంటకాలలో ఉపయోగించే ఆరోగ్యకరమైన నూనెలలో ఆలివ్ ఆయిల్ ఒకటి. వందల ఏళ్లుగా ఈ నూనెను విరివిగా ఉపయోగిస్తున్నారు. ధర ఎక్కువైనా చక్కటి రుచి, బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇంతకీ ఆలివ్ ఆయిల్ కు ఎందుకు అంత ధర ఎక్కువ? ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?


ఆలివ్ ఆయిల్ తో ఆరోగ్య ప్రయోజనాలు

గుండెకు మేలు: ఆలివ్ ఆయిల్ లోని ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆలివ్ నూనెలోని మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలివ్ ఆయిల్ గుండె జబ్బులను తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.   .


దీర్ఘకాలిక వ్యాధులు నయం: ఆలివ్ ఆయిల్ లోని యాంటీఆక్సిడెంట్లు ఆర్థరైటిస్, డయాబెటిస్, క్యాన్సర్ ముప్పులను అరికట్టడంలో సాయపడుతాయి. ఆలివ్ ఆయిల్ వాపులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

బరువు తగ్గడం: ఆలివ్ ఆయిల్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువును అదుపు చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

మెదడుకు మేలు: ఆలివ్ ఆయిల్ లోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి నాడీ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. మెదడును యాక్టివ్ గా ఉంచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

చర్మసౌందర్యం: ఆలివ్ ఆయిల్ చర్మంతో పాటు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఆలివ్ ఆయిల్ లోని విటమిన్స్, మినర్స్ చర్మసౌందర్యాన్ని పెంచడంతో పాటు జుట్టును బలంగా పెరిగేలా చేస్తాయి.

ఆలివ్ ఆయిల్ రకాలు

ఎక్స్ ట్రా వర్జిన్ ఆయిల్: ఇది ఆలివ్ ఆయిల్ లో నాణ్యమైనది. ఇందులో ఎలాంటి రసాయనాలు కలపరు. ఫ్యాటీ ఆమ్లాలు 1 శాతానికి మించి ఉండవు. ఈ ఆయిల్ ను శరీరానికి రాసుకోవడం చాలా మంచిది. ఈ నూనెను కేవలం సాల్స్ మీద చల్లుతారు.

వర్జిన్ ఆలివ్ అయిల్: ఇది రెండోరకం స్వచ్ఛమైన ఆయిల్. ఇందులో ఫ్యాటీ ఆమ్లాలు 2 శాతం వరకు ఉంటాయి. దీనిని కూడా సలాడ్స్ లోనే వినియోగిస్తారు.

రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్: బాగా రిఫైన్ చేయడం వల్ల ఆ ఆయిల్ వస్తుంది. మనం సాధారణంగా వాడే రిఫైన్డ్ అయిల్స్ ఉంటుంది. ఇందులో యాసిడ్ స్ధాయి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సలాడ్స్ లో నేరుగా ఉపయోగించకపోవడం మంచిది.

ప్యూర్ ఆలివ్ ఆయిల్: ఈ ఆయిల్ ను ప్రాసెసింగ్ చేయరు. రసాయనాలు వాడరు. ఈ నూనెను వంటకాల్లో వినియోగించవచ్చు.

ఆలివ్ ఆయిల వినియోగం, ధరలు

ఆలివ్ ఆయిల్ వినియోగం అనేది వయసును బట్టి మారుతుంది. సాధారణంగా రోజుకు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆలివ్ ఆయిల్స్ ను వినియోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆలివ్ ఆయిల్ ధరలను పరిశీలిస్తే, ఎక్స్ ట్రా వర్జిన్ ఆయిల్ లీటర్ కు రూ. 650 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది. వర్జిన్ ఆయిల్ ధర లీటరుకు రూ.600 నుంచి రూ.750 వరకు ఉంటుంది. రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ రూ. 250 నుంచి రూ. 300 వరకు ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ కు ఎందుకు అంత ధర?

ఒకప్పుడు ఆలివ్ ఆయిల్ చెట్ల సాగు అధికంగా ఉండేది. కానీ, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆలివ్ తోటలు తగ్గిపోతున్నాయి. ఆలివ్ ఆయిల్ ఉత్పత్తి అధికంగా ఉండే ఇటలీ, గ్రీస్, స్పెయిన్ లో వెదర్ కండీషన్స్ సరిగాలేక చాలా వరకు అలివ్ పంటలు ఎండిపోతున్నాయి.  గత రెండు దశాబ్దాల కాలంలో ఏకంగా 15 శాతం ఆలివ్ ఆయిల్ ఉత్పత్తి తగ్గింది. వినియోగం ఎక్కువగా ఉండి ఉత్పత్తి తక్కువ కావడంతో ఆలివ్ ఆయిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Read Also: సోయాబీన్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు..

Related News

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Bitter Gourd Juice: ఉదయం పూట కాకరకాయ జ్యూస్ తాగితే.. ఈ రోగాలన్నీ పరార్ !

Chicken Sweet Corn Soup: రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్ కార్న్ సూప్.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Dosakaya Pachadi: దోసకాయ కాల్చి ఇలా రోటి పచ్చడి చేశారంటే అదిరిపోతుంది

Most Dangerous Foods: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు.. సరిగ్గా వండకపోతే ప్రాణాలకే ప్రమాదం !

Omelette Vs Boiled Egg: ఉడికించిన ఎగ్స్ Vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది బెటర్ ?

Saliva Test: ఏంటి నిజమా? లాలాజలంతో గుండె పనితీరు గుర్తించొచ్చా..! అదెలా ?

Tips For Hair: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Big Stories

×