E-Paper
Advertisement

iQOO Z9x 5G Offer: ఇదే సరైన ఆఫర్.. iQOO 5G ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్‌!

iQOO Z9x 5G Offer: ఇదే సరైన ఆఫర్.. iQOO 5G ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్‌!
Advertisement

iQOO Z9x 5G Offer: టెక్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. దీంతో ఫోన్ల ధరలు ఒక్కసారిగా తగ్గించి, భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు దర్శనమిస్తున్నాయి. కంపెనీ సేల్స్ కూడా ఊహించనంతగా పెరిగాయి. ఈ క్రమంలోనే మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే మీకో శుభవార్త అందుబాటులో ఉంది. అమెజాన్ ఇండియా స్పెషల్ డేస్ సేల్‌లో iQOO Z9x 5G ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ ఫోన్ 44 వాట్ల ఫ్లాష్ ఛార్జర్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ ఆఫర్ ప్రైస్, స్పెసిఫికేషన్‌లు తదితర వివరాలు తెలుసుకోండి.

ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో 28 శాతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఫోన్ అసలు ధర రూ. 17,999 అయితే మీరు డిస్కౌంట్ తర్వాత రూ.12,998కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డ్‌ల ద్వారా  కొనుగోలుపై రూ. 1000 తక్షణ తగ్గింపును కూడా పొందుతారు. అంతేకాకుండా కేవలం రూ.630కే నెలవారీ నో కాస్ట్ EMIతో ఫోన్‌ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ప్రైస్ కేక.. వివో నుంచి చీపెస్ట్ డ్యూయల్ 5G స్మార్ట్‌ఫోన్!

iQOO Z9x 5G 4 GB RAM +128 GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz 7- అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 2408×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. అంతేకాకుండా ఫోన్‌లో 1000 నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్ (HBM) కూడా అందుబాటులో ఉంది. ఇది సెంట్రల్ పంచ్-హోల్ డిజైన్‌ను కలిగి ఉంది.

Advertisement

స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 6 Gen 1 చిప్‌తో వస్తుంది. ఇందులోని 6000mAh బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ Android 14-ఆధారిత Funtouch OS 14పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు  రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది.

Also Read:మరో బాహుబలి.. బడ్జెట్లో గాజు ఫోన్.. రూ.7 వేలకే దక్కించుకోవచ్చు!

ఆప్టిక్స్ కోసం f/1.8 ఎపర్చరుతో 50MP మెయిన్ కెమెరా, వెనుకవైపు f/2.4 ఎపర్చర్‌తో 2MP బోకె కెమెరా ఉన్నాయి. ఇది LED ఫ్లాష్ లైట్‌తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ f/2.05 ఎపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది పోర్ట్రెయిట్ మోడ్, లైవ్ ఫోటో ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో సపోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి ఆప్షన్స్ చూస్తారు. కనెక్టివిటీ కోసం డ్యూయల్-సిమ్ సపోర్ట్, 5G, WiFi 5, బ్లూటూత్ 5.1, GPS ఉన్నాయి. ఇది IP68 రేటింగ్‌‌తో వస్తుంది.

Related News

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×