BigTV English

Extra Show for Kalki 2898 AD: ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్… ఏపీలో ‘కల్కి’ ఆరో షోకు గ్రీన్ సిగ్నల్..

Extra Show for Kalki 2898 AD: ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్… ఏపీలో ‘కల్కి’ ఆరో షోకు గ్రీన్ సిగ్నల్..

Extra Show for Kalki 2898 AD is Approved by AP Govt: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రభాస్ ఫ్యాన్స్‌తోపాటు మూవీ లవర్ప్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి’. ఈ సినిమా జూన్ 27వ తేదీన అంటే రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మూవీ టికెట్స్ పెంపుతోపాటు అదనపు షోలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఏపీ ప్రభుత్వం జూన్ 27న కల్కి అదనపు షో వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదల తేదీన గురువారం ఒక్క రోజు ఆరో షోకు అనుమతి లభించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


కల్కి సినిమా రేపు రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం..తాజాగా మరో షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. రేపు ఉదయం 4.30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటలలోపు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో మరో షో వేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. మూవీ నిర్మాతల కోరిక మేరకు భారీ రద్దీ, బ్లాక్ మార్కెటింగ్ వంటివి అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఏపీ ప్రభుత్వం ఏకంగా రెండు జీఓలు జారీ చేసింది. రానున్న రెండు వారాలపాటు ఏపీలో అదనపు ధరలతోపాటు 5 షోలు ప్రదర్శించనున్నారు. ఇక సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్‌గా రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


తెలంగాణలో కల్కి సినిమాను ఐదు షోలు వేసేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు టికెట్ ధర రూ.200 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే రూ.75, రూ.100 టికెట్ల ధరలను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక, పెరిగిన ధరల ఆధారంగా చూస్తే.. బెనిఫిట్ షోల రేట్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో రూ.377 ఉండగా..మల్టీ ప్లెక్స్‌లలో రూ.495 గా ఉండనుంది.

ఇక, బెనిఫిట్ షో అనంతరం రెగ్యులర్ షోల సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో రూ.265 ఉండగా.. మల్టీప్లెక్స్‌లలో రూ.413గా నిర్ణయించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న కల్కి మూవీలో బాలీవుడ్ హీరోయిన్స్ అలరించనున్నారు. దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బెంగాలి నటుడు శాశ్వత ఛటర్జీ విలన్ గా నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×