BigTV English

Bharateeyudu 2 Song Promo: శౌరా సాంగ్ ప్రోమో రిలీజ్.. అనిరుధ్ మరో రికార్డ్!

Bharateeyudu 2 Song Promo: శౌరా సాంగ్ ప్రోమో రిలీజ్.. అనిరుధ్ మరో రికార్డ్!

Kamal Haasan’s Bharateeyudu 2 Souraa Song Promo Released: లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. 28 ఏళ్ళ క్రితం వీరిద్దరి కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కుతుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. వివాదాల వలన ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తుంది కానీ, లేకపోతే ఈపాటికి రిలీజ్ కావాల్సి ఉంది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా జూలై 12 న రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఈ సినిమాలోని మొదటి సాంగ్ రిలీజ్ కు ముహూర్తం పెట్టారు.

తాజాగా ఈ సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.. శౌరా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అనిరుధ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు శంకర్, లైకా అంటే కచ్చితంగా రెహమాన్ ఉండాలి. కానీ, ఈఅరి ఏమైందో AR రెహమాన్ ప్లేస్ ను అనిరుధ్ అందుకున్నాడు.


Also Read: Allu Arjun: చిన్న ధాబాలో భార్యతో కలిసి బన్నీ ఏం చేస్తున్నాడో చూడండి.. ?

ఇక కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏం తక్కువ తినలేదని ఈ ప్రోమో చూస్తుంటే అర్ధమవుతుంది. ఎడారి ప్రాంతంలో గుర్రం ఎక్కి సేనాని యద్ధభూమికి బయలుదేరినట్లు విజువల్స్ చూపించగా .. దానికి తగ్గట్టుగానే లిరిక్స్ ఆకట్టుకున్నాయి. రేపు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో కమల్ – శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×