Amazon Prime Drone Delivery| ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్తగా డ్రోన్ ఆధారిత డెలివరీ సేవ అయిన ప్రైమ్ ఎయిర్‌ను ప్రారంభించింది. స్మార్ట్ లాజిస్టిక్స్‌లో ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ఒక గంటలోపు డెలివరీ అందించాలనేది ఈ కొత్త సర్వీసు లక్ష్యం. ఐఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల డెలివరీ విధానాన్ని ఈ సర్వీస్ పూర్తిగా మార్చేయనుంది.
10 నిమిషాల్లో ఐఫోన్ డెలివరీ
అమెరికాలోని టెక్సాస్, అరిజోనా వంటి కొన్ని ఎంపిక చేసిన నగరాల్లోని కస్టమర్లు ఇప్పుడు అతి వేగవంతమైన డెలివరీ సేవను అనుభవించవచ్చు. ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌లు, ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌ట్యాగ్స్, స్మార్ట్ రింగ్‌లు, వీడియో డోర్‌బెల్‌ల వంటి ఉత్పత్తులను అమెజాన్.. కొత్త MK30 డ్రోన్‌ల ద్వారా ఒక గంటలోపు, కొన్నిసార్లు కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయవచ్చు.
అమెజాన్ అధికారికంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (పాత ట్విట్టర్) పేజీలో ఇలా పోస్ట్ చేసింది: “అమెజాన్ నుండి డ్రోన్ డెలివరీలో ఒక ఎక్సైటింగ్ అప్‌డేట్: ప్రైమ్ ఎయిర్ ఇప్పుడు ఫోన్‌లు, ఎయిర్‌ట్యాగ్స్, గ్రిల్లింగ్ థర్మామీటర్‌ల వంటి లిథియం-అయాన్ బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కూడా చేర్చింది.”
“టెక్సాస్, అరిజోనాలో డ్రోన్ డెలివరీకి అర్హత ఉన్న ప్రాంతాల్లోని కస్టమర్లు ఇప్పుడు ప్రైమ్ ఎయిర్ యొక్క MK30 డ్రోన్‌ల ద్వారా ఆర్డర్ చేసిన 60 నిమిషాల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలో ఈ ఉత్పత్తులను పొందవచ్చు.”
ఎలా పనిచేస్తుంది: అధునాతన డ్రోన్ టెక్నాలజీ
MK30 డ్రోన్‌లు మీ ఇంటి సమీపంలో ఉన్న యార్డ్ లేదా ఖాళీ స్థలం వంటి సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాన్ని స్కాన్ చేస్తాయి. ఇవి సుమారు 13 అడుగుల ఎత్తులో గాలిలో హోవర్ చేసి, ప్యాకేజీని సున్నితంగా వదులుతాయి. గతంలో డ్రోన్‌లు క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి డెలివరీ స్థలాన్ని గుర్తించేవి, కానీ ఇప్పుడు ఈ డ్రోన్‌లలోని స్మార్ట్ సిస్టమ్ బాహ్య కోడ్‌లు లేకుండానే ప్యాకేజీని వదలడానికి సరైన స్థలాన్ని గుర్తిస్తుంది.
డ్రోన్ డెలివరీ ద్వారా 60,000 ఉత్పత్తులు సరఫరా
ఈ డెలివరీ సర్వీస్ కేవలం ఫోన్‌లకు మాత్రమే పరిమితం కాదు. తేలికగా ఉండే 60,000 కంటే ఎక్కువ ఉత్పత్తులను డ్రోన్ డెలివరీ ద్వారా అందిస్తామని అమెజాన్ తెలిపింది. ఇందులో ఒక కండిషన్ ఉంది. ఉత్పత్తి బరువు 2 కిలోల కంటే తక్కువ ఉండాలి.
Also Read: చాట్‌జిపిటి సాయంతో నష్టపోయిన రూ.2లక్షలు తిరిగిపొందిన ప్రయాణికుడు.. ఎలాగంటే?
వాతావరణం సమస్యల వల్ల డెలివరీ విఫలం కాకుండా ఉండేందుకు, అమెజాన్ 75 నిమిషాల వాతావరణ సూచన వ్యవస్థను ఇందులో ఇన్ బిల్ట్ ఉంది. ఇది డ్రోన్‌లను ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితుల నుండి రక్షిస్తుంది. వాతావరణం సరిగా లేనప్పుడు కస్టమర్లకు ముందుగానే సమాచారం అందించబడుతుంది.
భారతీయ కస్టమర్లకు భవిష్యత్తులో ఈ సర్వీస్
ప్రస్తుతం ఈ అత్యాధునిక డెలివరీ సేవ.. అమెరికాలోని కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఈ రకమైన ఆవిష్కరణలు త్వరలో భారతదేశంతో సహా ఇతర ప్రపంచ మార్కెట్‌లకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈ డ్రోన్ డెలివరీ వేగవంతమైన, సమర్థవంతమైన స్మార్ట్ ఈ-కామర్స్ లాజిస్టిక్స్‌లో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది.
Exciting update in drone delivery from Amazon: Prime Air is now expanding its selection to include popular electronics with lithium-ion batteries, like phones, AirTags, and even grilling thermometers.
Customers who are in eligible areas for drone delivery in Texas and Arizona… pic.twitter.com/wQSpUTE4tu
— Amazon (@amazon) May 20, 2025