HBD Hero Karti:ప్రముఖ హీరో కార్తీ (Karti) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సూర్య (Suriya )తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కార్తీ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈరోజు కార్తీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు, ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హీరో కార్తీ ఆస్తుల విలువ..
కార్తీ అసలు పేరు కార్తీక్ శివకుమార్. తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా ఎదిగిన ఈయన.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు పలు యాడ్స్ కూడా చేస్తూ భారీగా సంపాదించారు. మే 25 అనగా ఈరోజు కార్తీ తన 48వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. 2025 నాటికి కార్తీ నికర ఆస్తుల విలువ అంచనా ప్రకారం సుమారుగా రూ.130 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఒక్కో సినిమాకి రూ.8నుండి రూ.10కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. అంతేకాదు సుమారుగా నెలకి రూ.2కోట్ల వరకు సంపాదిస్తున్నారు. అటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ప్రమోషన్స్ ద్వారా ఏడాదికి రూ.20 కోట్ల వరకు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి బ్రాండ్ ఎండార్స్మెంట్లకైతే ఒక్కో ప్రకటనకు ఏకంగా కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కార్తీ. ఇక విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించే ఈయన దగ్గర అంతే లగ్జరీ ఇల్లు, కార్లు కూడా ఉన్నాయి.
హీరో కార్తీ కార్ కలెక్షన్..
కార్తీ కార్ కలెక్షన్ విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ ml 350 కారు ఈయన కార్ గ్యారేజీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని విలువ సుమారుగా రూ.66 లక్షలు. దీంతో పాటు ఆడి కారు అలాగే మరికొన్ని లగ్జరీ కార్లు ఆయన కార్ గ్యారేజీ లో ఉన్నాయి. సినిమాల ద్వారా, బ్రాండ్ ఎండార్స్మెంట్ ల ద్వారా వచ్చే డబ్బును రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా పెడుతున్నట్లు సమాచారం.
హీరో కార్తీ నటన ప్రస్థానం..
కార్తీ తన కెరీర్ ను మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించారు. ఇక 2007లో వచ్చిన ‘పరుత్తివీరన్’అనే సినిమా ద్వారా నటన రంగ ప్రవేశం చేశారు. ఈయన నటనకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇక ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖైదీ, యుగానికి ఒక్కడు వంటి చిత్రాలతో తెలుగు, తమిళ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు.. ఇటీవల తెలుగులో డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 సినిమాలో కనిపించారు కార్తి. ఇక శైలేష్ కొలను దర్శకత్వం వహించబోయే హిట్ -4 లో కార్తి కనిపించనున్నారు. తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈయన విద్యాభ్యాసం విషయానికి వస్తే చెన్నైలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కార్తీ.. న్యూయార్క్ లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2013లో రంజిని చిన్నస్వామి వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె , కొడుకు కూడా ఉన్నారు.
ALSO READ:Amala Paul: సొంత కొడుకు మతం మార్చిన స్టార్ హీరోయిన్… ఫోటోలు వైరల్..!