Tanveer Ahmed On IND VS SL: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ సందర్భంగా శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది టీమిండియా. దీంతో ఫైనల్ కు శ్రీలంక వెళ్లగా… తిలక్ వర్మ సేన ఇంటిదారి పట్టింది. ఇక ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లా మధ్య రెండో సెమీ ఫైనల్ ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు శ్రీలంకతో ఫైనల్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఇంటి దారి పట్టడంపై పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్స్ లో పాకిస్తాన్ చేతిలో ఎలాగూ ఓడిపోతామనే భయంతో.. సెమీ ఫైనల్స్ లోనే కావాలని టీమ్ ఇండియా ఓటమి పాలై…టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిందని బాంబు పేల్చాడు. ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ చేతిలో ఓడిపోతే, టీమిండియా క్రికెటర్లకు అభిమానులు చుక్కలు చూపిస్తారని తెలివిగా వ్యవహరించి లంక చేతిలో ఓడిపోయినట్టు పరువు తీశాడు. దీంతో తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిందని తన్వీర్ అహ్మద్ వెల్లడించాడు. ఆ జట్టులో ఉన్న క్రికెటర్లు అద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్లని కొనియాడాడు. కానీ ప్రదర్శన మాత్రం చాలా పేలవంగా ఉందని పరువు తీశాడు. నేపాల్, యూఏఈ జట్లపైన మాత్రమే అద్భుతంగా ఆడారని… పాకిస్తాన్, శ్రీలంక జట్లతో ఆడినప్పుడు టీమిండియా వైఫల్యాలు బయటపడ్డాయని పేర్కొన్నాడు. పసికూనలపై మాత్రమే రెచ్చిపోయే టీమిండియా… ఫైనల్ దాకా వచ్చిన్నా పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేదని సెటైర్లు పేల్చాడు. గ్రూప్ స్టేజ్ లో ఓడిన టీమిండియాను ఫైనల్ లోనూ ఓడించి ప్రతీకారం తీర్చుకుందామని తమ కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
యూఏఈపై డబుల్ సెంచరీ చేసిన బుడ్డోడు వైభవ్ సూర్యవంశీపై కూడా మరోసారి తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్ చేశాడు. కేవలం ఐపీఎల్ పసికూనలపై మాత్రమే రెచ్చిపోయే వైభవ్ సూర్యవంశీకి అనవసరంగా హైప్ ఇస్తున్నారని తన్వీర్ అహ్మద్ మండిపడ్డాడు. వాడు డబుల్ సెంచరీ చేయగానే ఇతర దేశాల మాజీ క్రికెటర్లు హీరోను చేసి .. అనవసరంగా ప్రశంసలు కురిపించారని మండిపడ్డాడు. బీసీసీఐ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళు టీమిండియాకు అనుకూలంగా డబ్బా కొడతారని ఎద్దేవా చేశాడు తన్వీర్ అహ్మద్.